Monday, October 28, 2013

ALL IN ONE గజల్స్.( మధుశాల ).

ప్రేమ గీతాలు . 


  

"మౌన గీతం". 

__________________
మనసు కలచే మౌన వేదన 
పెదవి విప్పీ చెప్పలేను ... 
కలల  చెలివి నీవు నీవని 
ఎదుట నిలిచీ పలుకలేను

ప్రియతమా ......నా .... ప్రణయ గీతమా .... 
.. ప్రేమా ............ నా ప్రాణమా ......... ॥ 

గుండె గుడిలో నిలిపినాను 
కానవైతివి  నా వలపూ  ..... 
మదిని నిండిన  నీ రూపూ 
చెరపలేవది  నా గెలుపూ 
మరపు రాని జ్ఞాపకాలే 
నిండు పున్నమి వెలుగులూ ..ఆ .. 
వెలుగు పంచిన ప్రేమ కధలే 
బ్రతుకు నిలిపే శ్వాశలూ ...... నా ॥ బ్రతుకు ॥ 

ప్రియతమా ..... నా .... ప్రణయ గీతమా .. 
ప్రేమా .......... న ఆ......... ప్రాణమా ......॥ 

నిదురరానీ  కనులు బాధగ 
కార్చె  కన్నీటి  ఆవేదనా ..... 
కలత నిదురకు కరగే కలలే 
మిగిలే నాలో   వేదనా....
బ్రతుకు విరహపు అలల సడియై 
అలజడైనది భావనా...... 
చితుకు ఆశల చివరి పల్లవి 
పాడెనపశ్రుతి ఆలాపనా ....  

తీరదు ఈ తీపి బాధా 
ఎవరు ఎరుగరు  నా గాధా.... . 

ప్రియతమా ........నా ..ప్రణయ గీతమా.... 
ప్రేమా,.......... నా.....  ప్రాణమా .........॥ .. 
___________________________

"ప్రియా...సఖియా ". 

________________________
ప్రియా..   సఖియా.....
 రావే ..... ఇలా....
కదలే...... లయా.......
 నా...      గుండెలా ..... ॥ 

నుదుట  శశికళా ........ 
సిందూర సితార మెరుపులా .... 
ఎదుటా ,.... ఎరుపెక్కిన బుగ్గలు  
రంగు గులాబీ పూవులా......  ॥ 

కనులా....... కాటుకా..... 
అది కదలే మేఘ మాలికా..... 
కనులా ..........కలువలా... . 
అవి విరిసే.....  సుమ రేకలా...... ॥ 

కదలే.........  ముంగురులా .......
అవి ఎగిరే... తుమ్మెదలా.... 
కురులా....... అవి ఝరులా..... 
అవి ఆడే  నల్లని నాగులా.....॥ 

సడులా...... సవ్వడులా....... 
నీ  పదముల పారాడు మువ్వలా.... 
అలలా..... భంగిమలా ,....... 
నీ  మేని  సొగసుల  సందడులా ...॥ 
_______________________
_____________________

"నీవులేవు నిదురరాదు"..

నీవులేవు నిదురరాదు 
బ్రతుకుమీద ఆశలేదు 
అన్నీ మరపించీ పిలిచే 
చావుకూడా దరికి రాదు ॥ 

నీవు జతగా కట్టినాను 
కలల ఆశల మేడలూ... ఆ   
మేడచుట్టూ  వేసినాను 
వలపు పూవులా తోటలూ ,ఆ... 
తోటలో తిరుగాడు రాణివి 
నీవు నీవనే తలపులూ 
కూలిపోయెను ఆశలన్నీ 
వాడిపోయెను పూవులూ ॥ 

నిన్ను విడిచీ నిలువలేక 
మధువు మత్తును మరిగినాను 
మత్తు నిండిన మనసు గుడిలో 
నిండు నీ రూపు చెరపలేను 
నీడవై వెంటాడినావు 
మధువు సుధవై నిండినావు 
నీ..తలపులు వీడలేను 
నిన్ను వదిలీ ఉండలేను ॥ 
_________________

"శృతి తప్పెను నా పాట... 

_____________________

శృతి తప్పెను నాపాట 
అడుగు తడబడే ప్రతిచోట 
మాట రాదాయె నా... నోట 
మధుశాల గురుతులే నా బాట ॥ 

మరచిపోలేను మల్లెల నవ్వులు 
మాటలాడు నీ (నీలి) కన్నులూ 
గుండె లయల నీ  అడుగు  సవ్వడులు 
కాలి అందియల కొంటె కబురులు 
పైట రెప రెపల గాలి ఊసులు 
పరిమళించు నీ మేని సొగసులు ॥ 

తెలుపలేదు నా తలపు  సడి నీకు 
ఎరుగవైతివే   నా....  వలపూ 
తెలియలేదు  నా  మనసు నీదనీ.
అందలేనంత దూరమౌవరకు 
మనసు లేఖల మూగ భాషలు 
నావిగా మిగిలే ప్రేమ బాసలు ॥ 

కలనైన ఎరుగనీ ఎడబాటు 
కానరానైతి  విధి పోటు 
కోటీ స్వప్నాలే కూలి పోయి కన్నీటి 
వరదలో కరిగిపోయెను...... 
మనసు లో దాచు ప్రేమ సౌధాలె 
మత్తు మంటలో మసిగ మారెను 
నా బ్రతుకు అమావాస్య చీకటీ 
మధుశాల  మరపించు  నీ స్మృతీ...  
______________________

"మనసు మాటలాడుననీ"

____________________

మనసు మాటలాడుననీ 
కధ చెప్పగ విన్నాను 
కనులు చెప్పు భాష్యాలే
 కవితల్లో చదివేనూ ॥ 

కలల కావ్య మాలికలా ... 
ప్రేమ పిలుపు గీతాలా 
సందేశం సారాంశం నిను 
కలిసి తెలుసు కున్నాను ॥ 

కదలే నీలి మేఘం 
కురిసే చినుకు ప్రాణం 
ఉరిమే ఉరుము గమనం 
మెరిసే మెరుపు ప్రయాణం 
అలలై పొంగు ప్రాయం 
కలలో వలపు గేయం 
నీవై నిండు సవ్వడి 
నాలో ప్రేమ అలజడీ ॥ 

వయసూ వన్నెలా .....
అది   కురిసే  వెన్నెలా...... 
విరిసే ...నగవులా..... 
అవి పూవులా మధువులా.. 
అలలా ...నీ.... తలపులా.... 
నా జీవన రేఖలా    .... 
లయలా.... నీ అడుగులా...... 
నీ చూపులే కవితలా..... ॥ 
_______________________

నీ నవ్వుల జల్లులు .. 

________________________
నీ నవ్వుల జల్లులు కురిసి 
పూవులెన్నో విరిసాయీ 
నీ కన్నుల కాంతులవెంట 
దివ్వె లెన్నో వేలిగేయీ ॥ 

నీ హంసల నడకలలో 
నిండు హొయలు ఎన్నెన్నో 
నీ మువ్వల సవ్వడిలో 
నెమలి నాట్య గతులేన్న్జో 
అల్లే.. కురుల..జడలో  పూల 
పరిమళం పలకరించిందీ 
నాలో.. దాగి  ఉండే ప్రేమ 
నీకై ... నిద్ర లేచింది ॥ 

చెదిరే ముంగురులే ..చిరు 
గాలి వీచికై  కదిలే ....
బెదిరే  నీ  చూపులో ..
( ఆ) .. నీడే . నేనై  .మెదిలే 
అదిరే పెదవి అందాలా 
దాగేప్రేమ  సందేసాలే .అవి 
కబురై  మేఘమాలికలై 
కురిసే చినుకు చిరు జల్లై ॥ 

నీ తీయని తలపులు ఏవో 
నన్ను కమ్ముకున్నాయి 
స్వప్నం లో స్వర్గ విహారం 
చేయ రమ్మని పిలిచాయి 
నా వయసే ఓ నందనవనం 
నా మనసే .... బృందావనం 
నీవై నిండె నామది ... 
రావే ....... నా..... చెలీ   ॥ 
_______________________

"కరగిపోయె కలలన్నీ "

_________________________
(అతడు) :
కరగిపోయె కలలన్నీ
కలవరమే మిగిలిందీ
మాదిర మత్తులో కూడా
నీ రూపే మెదిలిందీ

మైకంతో మనసు చేరీ
మౌనగీతి పాడిందీ
శృతి చేయని గొంతు  దాటి
అపశృతిగా పలికిందీ ॥

ఈ పేద బతుకులో  కన్నీటికి విలువేదీ
మధువు రేపు మంటల్లో విఫలమైన ప్రేముందీ
ప్రేమించే నా తలపునూ నీకు ఎలా తెలిపేదీ
ముక్కలైన గుండె కోతనూ తిరిగి ఎలా అతికేదీ ॥

(ఆమె:)
తెలుసుకోనైతి  తెలుపరానైతి
దాగి ఉంది నీ రూపనీ .
దూరమౌదాక తెలియరాలేదు
ప్రేమ  నాలో నీదనీ .... .

సడిచేసే గుండె లోనా ..
నీ...తలపు వలపుందీ ...అది
నీవనే  నా తలపునూ
నీకు ఎలా తెలిపేదీ ॥

మోడువారిన మానులన్నీ ఒంటరిగా నిలిచేయీ
మనసు తోట పూలన్నీ వాడి రాలిపోయాయీ
చిగురించని కొమ్మ చేరి ఏ కోయిలా  పాడదూ
పూలులేని తోటలోకి ఏ  మధుపము చేరదూ ॥
__________________________________
___________________________________

''హాయిగొలుపు ఆ నవ్వే ''

_________________________________

హాయిగొల్పు  నీ నవ్వే 
వెన్నెలంత  చల్లదనం 
అలిగి దూరమైనంతనే 
కాల్చుతుంది నీ మౌనం ॥ 

ప్రేమతప్ప  ఏమివ్వనూ 
ఏమిలేని పేదతనం 
అందమైన లేదు నాకు 
నా రూపమే ఒక శాపం॥  

అనురాగం మూగదైనదీ 
అది నీదనీ  తెలుపలేనిదీ 
అందని ఆ చందమామను
పొందలేని తపనిదీ ॥ హాయి ॥ 

స్నేహమెంత ఓదార్పో  నిను
కలిసి తెలుసుకున్నాను 
నీ అల్లరి మాటలలో 
నన్ను నింపుకున్నాను 

ఈ జన్మకు చాలునదీ   నీ 
చెలిమి మరువలేనిదీ 
చీకటి మది , నీ తలపులే 
నా బ్రతుకు  నిలుపు శ్వాసలవీ .॥ హాయి ॥ 
___________________
____________________

ఆవేదన చెందకుమా ... 

_____________________________

ఆవేదన చెందకుమా హృదయమా 
కంటనీరు తుడిచి సేద తీరుమా 
ఆనందపు సీమలోన ,
అనురాగము పంచ చెలియ 

నన్ను చేర వచ్చినదే ప్రాణమా... ॥ 


పలకరింపు నవ్వులతో పిలిచిందీ 
సైగలతో  సోగకనుల  చూసిందీ 
ఏనాటినుంచి దాచిందో వలపు మదీ 
ఈనాటికి కరుణించి చేర వచ్చిందీ ॥ 

మూగ నోము వదలి మాట కలిపిందీ 
సిగ్గుతెరలు బుగ్గలలో దాచిందీ 
చేయి చేయి కలుప  దరికి చేరిందీ 
వలపు తోటలోన విహరింపగ రమ్మందీ ॥

ఏనాటి కలయో నిజమాయెనూ 
నా మదిలో వలపు పాట వినిపించెనూ 
చెలి చెంతనున్న క్షణమెంతో ఆనందమూ 
చిగురించె ప్రేమ లతల మా అనురాగమూ ॥ .. 
_____________________________
_____________________________

హృదయమా.... 

_____________________
హృదయమా  వలపు బంధమా ...
అందమా ప్రేమ తరంగమా.... 

వినుమా.... నను ... గనుమా,...... 
ఓ ... ప్రేమా..... మనోరమా........ ॥ 

రవివర్మ చిత్రకళా సారమా .... 
శ్రీనాధుని కవితా . సారాంశమా 
ఆ మురళీ మోహన సంగీతమా.. 
ఆ నిర్మల పూర్ణ చంద్ర బింబమా ॥  

వినుమా... నను .గనుమా
ఓ ... ప్రెమా.... మనోరమా..... ॥

అరవిరిసిన ఆటవెలది అందమా
కంద అంద గతి పదవిన్యాసమా ...
నా శ్వాశ   శీసమాల చెలి చంపకమాల
నా ప్రేమ పిలుపు వినుమా సందేహమా .....

వినుమా నను గనుమా
ఓ ప్రెమా....... మనోరమా...... ॥
_________________________
_________________________

మనసా..... మనసా ..

__________________________

మనసా.... మనసా.... 
నన్నొదిలి వెళ్ళకే  ఓ మనసా .... నా 
మదిని భావాలు నీకు తెలపాలి 
నీవే చెలివై విను మనసా... ॥ 

పెదవిపై నవ్వు చేరగిపోనీకు 
పంచుకో నువ్వు జంటగా.. ఈ 
వింతలోకాల  చింతలే వీడి 
మంచి మాట వినిపించనా ..నా  
కల నిండే కళ మది చెప్పే కధ 
వినవే  నాకై  నా చెలిగా ... ॥ 

నింగిలో మెరయు నిండు చందురుడు 
పాల వెన్నెలై కురిసేనులే 
ఆ చిన్ని తారలే చేయు అల్లరులు 
మిణుకు మెరుపులై వెలిగేనులే 
ఆ వింత లోకాలు చూసి రావాలి 
నాతొ కలిసి రా మనసా ....॥ 

నీలి మేఘాల ప్రేమ భావాలు 
జల్లు వానలై కురిసేనులే ..ఽఆ .. 
చినుకు తడులలో విరిసి సుమబాల 
ప్రేమ గీతాలు పాడేనులే ... ఏడేడు 
రాగాల ఇంద్ర_- ధనుసుపై ... 
నాట్యం చేద్దాం రా మనసా...... ॥ 
____________________________
___________________________
































 








































No comments:

Post a Comment