Thursday, June 21, 2018

ప్రణయగీతం

ఆమె = ఆకాశం లో  నల్లని మేఘం 
ఆడుతు పాడుతు  అల్లరి చేసెను ఈవేళా ...
చల్లని ఝల్లుల గాలులు వీచెను 
నా మది పాడెను మోహన గీతం ఈ వేళా ....... 

అతడు = నల్లని నీకురుల చెదరిన అందం 
మేఘ మాలలై సాగెనులే .... 
ఎగిరే పయ్యెద లయల ఊసులే 
చల్ల గాలులై వీచెనులే .... ॥ 
నా కమ్మని కలయై సాగెనులే ...... 

ఆమె= పూల వనంలో విరిసిన అందం 
రంగుల పల్లకి నెక్కిన భావం తోచెనులే ... 
మల్లెల మాలలు ఝల్లుగ కురిసే 
మత్తు పరిమళం మదిలో వలపులు రేపెనులే .....

అతడు =మల్లెలు కావవి నీ చిరునవ్వుల 
కురిసే ముత్యపు ఝల్లులులే .... 
పల్లవి పాడే పూల పరిమళం 
నీమేని సొగసుల అందములే .. 
పరువాల విరుపుల గంధములే ........ 

ఆమె+అతడు 
పున్నమి రాత్రుల వెన్నెల (సిరులే )తానుగ 
కవితకు జతయై   వలపుల గీతం పాడెనులే ....
ఇద్దరి తలపుల ఇంద్ర ధనుసుపై 
వలపు వాడలకు  ప్రేమ ప్రయాణం   సాగెనులే ..... 

ఆ.............. ఆ.............. ఆ.............. ఆ..... \\ ॥

No comments:

Post a Comment