మనసు కలచే మౌన వేదన
పెదవి విప్పీ చెప్పలేను ...
కలల చెలివి నీవు నీవని
ఎదుట నిలిచీ పలుకలేను
ప్రియతమా ......నా .... ప్రణయ గీతమా ....
.. ప్రేమా ............ నా ప్రాణమా ......... ॥
గుండె గుడిలో నిలిపినాను
కానవైతివి నా వలపూ .....
మదిని నిండిన నీ రూపూ
చెరపలేవది నా గెలుపూ
మరపు రాని జ్ఞాపకాలే
నిండు పున్నమి వెలుగులూ ..ఆ ..
వెలుగు పంచిన ప్రేమ కధలే
బ్రతుకు నిలిపే శ్వాశలూ ...... నా ॥ బ్రతుకు ॥
ప్రియతమా ..... నా .... ప్రణయ గీతమా ..
ప్రేమా .......... నా....... ప్రాణమా ......
నిదురరానీ కనులు బాధగ
కార్చె కన్నీటి ఆవేదనా .....
కలత నిదురకు కరగే కలలే
మిగిలే నాలో వేదనా....
బ్రతుకు విరహపు అలల సడియై
అలజడైనది భావనా......
చితుకు ఆశల చివరి పల్లవి
పాడె అపశ్రుతి ఆలాపనా ....
తీరదు ఈ తీపి బాధా
ఎవరు ఎరుగరు నా గాధా.... .
ప్రియతమా ........నా ..ప్రణయ గీతమా....
ప్రేమా,.......... నా..... ప్రాణమా .........॥ ..
రచన , శ్రిీమతి,
పుల్లాభట్ల జగదిీశ్వరిీముార్తి.
కల్యాణ్.
-------------------------
No comments:
Post a Comment