నమస్సుమాంజలి
-------------------------
తెలుగు చదువు సున్న
పర భాష మిన్న , అన్న పద్ధతిలో
ఇంచుమించు, మాత్రుభాషను
మరచిపోయిన మన దేశంలో
అవతరించిన సాహిత్య సౌరభాల
స్ఫుార్తి " శ్రీ కపిలవాయి లింగముార్తి "॥.
మాత మాణిక్యమ్మ వడి పండిన
కీర్తి కిరణాల తేజో పుంజం.
తండ్రి వేంకటాచల స్వప్న
సార , సర్వోన్నత బీజం.॥
తెలుగు సాహిత్యాన్ని
విస్తరింపచేయాలన్నసంకల్ప బలం ॥
అక్షర యజ్ఞాన్ని అవలీలగా పుార్తిచేసిన "పరిశోధనా పంచాయన" వ్రుక్ష రాజం ॥
సాహిత్య సారాన్ని ఔపోసన పట్టి
పురాణేతిహాస సారాన్ని ,
పదిలంగా మనకందించిన
" సాహిత్యోద్ధండ పండితుడు ."॥
కంద అందాలు,
ఆటవెలదుల చందాలు,
సీస పద్య గంధాలు చేర్చి
యతి ప్రాసాభరిత వచన
పద్య-గద్య- సాహిత్య సారాన్ని
మనకందించిన నిష్కల్మష సేవా
దురంధర " సాహిత్య భీష్ముడు ॥
గౌరవ " డాక్టరేట్ బిరుదు " ను
సగౌరవంగా అందుకున్న
సమన్వయ " సాహిత్య సింహం.".॥
సరస్వతీ కటాక్షం నిండుగా
లభించిన తెలుగు భాషా ,
సాహిత్యాక్షర
" స్వర్ణ సౌరభ కేసరి "॥
తెలంగాణా కీర్తి కిరీటంలో
కైసేయబడిన వెలలేని
ఆణిముత్యాల మధ్య కొరలుకొన్న
మేటి " మాణిక్య తేజో పుంజం "॥.
" నంది అవార్డ్ " తో సన్మానింపబడి
పద్యాలంకార సార సాహిత్య
తిలకాన్ని నుదుట ధరించిన
, అక్షర వైబోగ
" ఆద్యోదయ అంశుమారి ".॥
గౌరవ బిరుదాంకితులు , కావ్య
సాహిత్య " కవితా కళానిధులకు "
" సాదర నీరాంజనావళి "---
" కపిలవాయి కళాపీఠ " -
స్థాపనాంజలి.॥
-----------------------------------------
రచన ..శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
No comments:
Post a Comment