వాస్తవానికి దగ్గరగా. నా ఆలోచనల ని మీతో. పంచుకోవాలని రాసే చిన్ని అనుభవం.
"మధుర స్మ్రుతి "
------------------
హడావిడిగా అరిచే భర్త ని ఆఫీసుకి ,
ఆరడి చేసే పిల్లలని. స్కూలు కి తరలించి , భారంగా ఊపిరి తీసుకున్నాను . వడలిన శరీరాన్ని సేద తీరుస్తూ. ఈజీచైర్ లో అలసటగా నడుం వాల్చేను మరు క్షణం నా చెవులకి సోకిందొక చిరపరిచిత శబ్ధం.
టప్ ....టప్ .....టప్ ......
అంతే ...ఒక్క ఉదుటున. లేచి పరుగెత్తేను కిటికీ వైపుకి . "వర్షం "తీసిన తలుపుల్లోంచీ చల్లగా. , ఝల్లుగా , హాయిగా ......ఉత్సాహంగా.
పెరట్లోకి పరుగెత్తేను .
వర్షం లో తడుస్తూ. నా అలసటని పారదోలుతూ. నన్నేవేవో. జ్ఞాపకాలలోకి
తీసుకుపోతూ.... "వర్షం ".
ఆనందానుభూతికి మూసుకుపోయే కన్నుల ముందు కదలాడే చిరుఝల్లుల
జ్ఞాపకాలు ....అవును ఇదే వర్షం లో నేనూ , నా స్నేహితురాళ్ళూ , చిలిపి గిల్లికజ్జాలూ...........
----------------
చేతుల్లో చేతులు వేసుకొని " వానా వానా చల్లప్పా "......అని పాడుకుంటూ.
అందరం కలిసి గుండ్రంగా గింగరాలు తిరిగే చిన్ననాటి చిలిపి సరదాలు .....
చెట్ల ఆకులపై పడే వర్షపు నీటి బొట్లని
నోరు పట్టి. జుర్రుకొనే ఆనంద క్షణాలు ......
గొడుగుల్లో ఒదుగుతూ , కేరింతలు కొడుతూ చిందర వందర కబుర్లతో కలిసి స్కులుకి వెళ్ళే ఎత్తు- పల్లాల కాలిబాటలు .....
వర్షానికి తడిసిన పచ్చని పైరుబాలల తివాచీ తోరణాలు ......
చిరుజల్లు తో కలిపి వీచే చల్లని గాలులలోంచీ వచ్చే , తడిసిన మట్టి సుగంధాలు ...
పిల్ల కాలువల పారే నీటిలో , పోటీల కాగితపు పడవల వరుసలు ........
వేడి వేడి ఫల్లీలు తింటూ , ఉరుముల శబ్ధాన్ని. వింటూ , మెరిసే మెరుపుల్ని
వింతగా చూసే అమాయకపు.
,విస్మయ , చిన్నారి చూపులు.....
శ్రావణమాసపు నోముల సందడిలో ,
పట్టు పరికిణీ , పావడాల రెప రెపల తో
అమ్మ చేయి పట్టుకొనీ , అమ్మలక్కల ఇళ్ళకి. " పేరంటానికి ". వెళ్ళే తోవలో
గుడినుంచి వినిపించే. "జే గంటల " చిరు గణ గణలు ......
అట్లతదియ రోజు ఆరు గంటలకే. ఉట్టికింద ముద్దలు తిని , ఊయలలాటలకై. , ఉత్సాహంగా పరుగులుతీసే కాలి మువ్వల గలగలలు ....
రాత్రి కాగానే. నాన్నమ్మ పక్కలో , వెచ్చగా ఒదిగి ఆమె చెప్పే చిలకమ్మ . కధలు వింటూ , ఆశ్చర్యానందాల పసి హ్రుదయపు పులకరింతలు ......
ఇలా ఎన్నో. .... ఇంకెన్నో జ్ఞాపకాలు , ఇంకా నాలో మాసిపోని బాల్య స్మ్రుతులు.
ఆ రోజుల్లో ప్రతి రోజూ ఒక కొత్త వెలుగు
ప్రతి క్షణం ఒక నందనవనం .
ఆ రోజులు మళ్ళీ వస్తాయా .......అటువంటి. పండగలు , సరదాలు. ఇప్పుడు ఏవీ
పిల్లలలో పసితనం వెతికినా కనపడ్డంలేదే ...
అలవోకగా ఆలోచిస్తున్న. నేను ,చెవులకి వినిపించే గంటలమోతకి. ఉలిక్కిపడి
గడియారం వైపు చూసేను .
సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది ,
ఉస్సురంటూ కదిలేను .
ఆయన వస్తారు , పిల్లలు వస్తారు .
టిఫిన్ ఏమి చేయాలబ్బా ...... అనుకుంటూ వంటింటి వైపు కదిలేను
" రొటీన్ గా ".
రచయిత్రి ,
పుల్లాభట్ల జగదీశ్వరీ మూర్తి ,
కల్యాణ్ .my iPhone
No comments:
Post a Comment