సహస్ర పుస్తక యజ్ఞం కొరకు..
-------------------------------------.
ధన్య మహారాష్ట్ర మాయిా
----------------------.--------------
"శివాజీ టెర్మినస్ " పేరులొనే
కీర్తిని కిరీటాన్ని ధరంచిన నగరం
మరాఠీల మహోన్నత
స్వామిభక్తి కి నిదర్శనం.॥
అణువణువుా దేశ భాషనే
పలికే , ఆదర్శపుారిత ఐకమత్యం
" మాఝా మరాఠ్ వాడా "
అనేపదానికి వారిచ్చే గౌరవం.॥
చారిత్రాత్మక శిధిలాలు ,వారి
నిజమైన స్వామి భక్తి కి నిలయాలు.
అష్ట గణపతీ ; పండరిపుార్
వంటి ఆలయాలు...సాంప్రదాయ
నిష్ట- నియమాలకు ప్రతిరుాపాలు.॥
అభంగ కీర్తనాది , సంకీర్తనా సరాలు,
విఠలు ని నామామ్రుత గాన సుమాలు,
సంగీత కళా నిధుల సన్మాన వేడుకలుా,
మరాఠీ సంస్క్రుతికి వారిచ్చే
పలు సౌరభ భక్తి నీరాజనాలు.॥
నామదేవ్ , తుకారాం ,జ్ఞానేశ్వర్
వంటి ఎందరో మహనీయులు
మరాఠీ సంగీత , సాహిత్య
సమాహారం లో మెరిసే -
కలికితురాయిలు.॥
ఆత్మీయానుబంధాల పలకరింపులు;
సంక్రాంతి సంబరాల పసుపు, కుంకుమలు
కట్టు బొట్టుల పద్ధతిలో నిండైన తీరుకు
మరాఠీ .వాసుల కి, పెట్టింది పేరు.॥
బీద ,గొప్ప , జాతి మత
తారతమ్యాలు లేని ,పలు
ప్రేమ బంధాల , జీవన
గంగా వాహిని.మహరాష్ట్రా-
జనని, ప్రేమామ్రుత తరంగిణి ॥
-------------------------
రచన; శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహారాష్ట్ర)
ID...4200.
No comments:
Post a Comment