-----------------------కట్నం ...కవిత
రచన...రాచెర్ల మధుసుాదన్ గారు.
స్వరకల్పన...శ్రీమతి..జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
----------------------------------------------------------
ప॥ అంగట్లో బొమ్మై పోయిండ్రో
నా అక్క చెల్లెల్లు , ఆడపడుచులుా...॥
అ.ప॥ ఆడు సుాత్తడుా...ఈడు సుాత్తడుా
సుాసినాంక కట్నం అడిగిపోతాడుా ॥ = ==== ॥అంగట్లో॥
చ॥ కట్నం కాటుకు బలియైపోయారో
నా అమ్మ అయ్యలు నా ఇంటోల్లుా....
పండగంటడుా పబ్బమంటడుా..
ఉన్నదంతా తానే ఊడ్సుక పోతాడు..॥
చ॥ కట్న దాహానీకి కిరొసీనో వరమాయె
నా అక్క సెల్లెల్లు ఆడపడుసుాలకు
ఇక్కట్లు తీరేటీ దారీ తెన్నుా లేదా
తప్పన్ని సావుల నాపేటోడుా లేడా ॥
చ॥
మల మల మాడుతు కాలుతు ఉన్నా
చలనం లేని మ్రుగజాతన్నా..
అది మగజాతన్నా.....
మ్రగ మగజాతిని మార్చే కాలం
కట్నం రక్కసి పోయేకాలం
ఎప్పుడు వచ్చును రాజ్యంలో
। మార్పే రాదా ఈ లోకంలో...॥
॥అంగట్లొ॥
--------++++-----------------++++----
No comments:
Post a Comment