Tuesday, February 19, 2019

మీ మనసులో చిన్న జాగా

మీ మనసుల్లో
చిన్న జాగా కావాలి.॥

(పుల్వామా లో)

బలవన్మరణం ప్రాప్తించిన
అమరవీరులకు అంజలి
అర్పిస్తున్నపుడు  మా
మనసు లో రేగిన
కన్నీటి మంటలకు
ఏ కవి భాష్యం చెప్పగలడు.॥

మండుతున్న ఎండలో
వణుకుతున్న చలిలో
భయంకరమైన..
తుఫాను భీభత్సవం లో
దేశం కోసం  , మా
జీవితాన్ని పణంగా
పెడుతుా  కుాడా--మేం
మా గురించి ఆలోచించం.॥

మాకు వారంకో రోజు
శలవు దినం లేదు.
సరదాలు ,సంబరాలు లేవు.
పండగలు పబ్బాలుా ఉండవు.॥

భార్యా పిల్లలతో
గడిపే క్షణాలే కరువు.
తుపాకీ మొాతల్లో-
తుాటాల దారుల్లో-
అన్యాయపు ఆగడాల-
రుధిర ధారల్లో____
బంధానుబంధాల
కట్లు తెగిపోతాయి.
జ్ఞాపకాల  ఎడారుల్లో
మా కన్నీళ్ళు 
ఇంకిపోతాయి.॥

మాచేతిలో ఫోను ఉన్నా
మాకు స్నేహపుారితమైన
పలకరింపులు రావు.
అక్కా చెల్లెళ్ళ పెళళ్ళకి వెళ్లి
ఆశీర్వదించే అవకాశం రాదు.॥

అప్పుడప్పుడు ఫోన్
రింగవుతుంది. ఆనందంగా
ఎత్తిన  ఫోనులో
మా క్షేమ సమాచారం
అడగడానికి  ముందు
కేంటీన్  సరుకుల కాష్టు ,
వెరైటీ  మత్తుల
మందు లిష్టు ఉంటుంది.॥

చెప్పడానికి బంధువులు
కొల్లలైనా  , కోరి ప్రేమగా
పలకరించిన  వారు కరువే.॥

గాలి -ధుాళిల   విసురులో,
బండరాళ్ల  పై పరుగులో,
మాదేశం , మా వాళ్లు
అన్న నిస్వార్ధపు చావుల్లో,
మాకు , మా  ఉనికి కి -
రాలేదెపుడుా గుర్తింపు.॥

తుాటాల దాడుల్లో
కుాలిపోయిన మా
తోటి సైనికునికి
చేయుాతనివ్వడానికి
ఉండలేక , వదిలి పోలేక ,
మేము  పడే యాతన
పగవాడికి కుాడా రాకుాడదు.॥

శవాల గుట్టల
కుళ్ళు కంపుకు
ఓదార్పు  ముఖాల
మాస్కు ల్లో
ముఖాలు చిట్లించి
ముక్కులు
ముాసుకుంటారు.॥

మా కుటుంబాల
పోషణకై  ఆర్ధిక
మినహాయంపులుండవు.
మా పిల్లల భవిష్యత్ కి
పుాల బాటల 
తోటలుండవు.॥

మాలో ఒకరిగా ,మాకై
ఒక కన్నీటి  బొట్టు కార్చే
నాటకరంగం , నగర వీధుల్లో
ఏడాదికి  ఒక్కసారి చేసే
స్వాతంత్ర్యదినోత్సవం
మాత్రమే...॥

అదెందుకో  ఆరోజుకి
గుర్తింపెందుకు వచ్చిందో...
చర్చించితే...ఒక్కరికిీ-
తెలియదు.
గొర్రెలమంద చందం..
బారులు  తీర్చిన జనం.॥

ఎగరేసే  జాతీయ ఝండాతో
ఎంగిలి చేతులను
తుడుచుకొనే ఏలికలు ,
ఏడ్పు మొహాల
ముసుగుల్లో ,  నెరవేర్చని
బాసల భాష్యాలిచ్చి
తమ వంతు ...
పుార్తయ్యిందనిపిస్తారు.॥

గుట్టలుగా మారిన
మా  తోటి  వారి శవాలను
ముాటలు కట్టి
ముడివేసినపుడు..
ముంచుకొచ్చే కన్నీటిని
తుడుచుకోడానికి కుాడా
సమయం దొరకని  రక్షక
సేవా  నాయకులం ॥

అటువంటి సమయంలో కుాడా
మేము మా
కర్తవ్యాన్ని మరువం.
ఎందుకంటే   ..మేము
దేశభక్తి  వీడలెేని
భరతమాత బిడ్డలం.॥

రక్షణ  సుంతైనా లేని
విశ్వ వీర  రక్షకభటులం.
సరిహద్దు సాక్షి సైనికులం.॥

మీ రక్షణే లక్ష్యంగా
పోరాటాల పేటల్లో
శవాలమై మిగులుతున్న
మీ తోటి సోదరులం.
మీకై రక్తం చిందించే 
వీర  రక్షక  జవానులం ॥

మీ క్షేమమే  మా జీవితం
మేం కోరేది  ఒకటే..
మీ మనసుల్లో కొంచం
జాగా మాకోసం...మా
పరివారంకోసం ఉంచండి ॥

మీ ప్రేమే మాకు దిక్స్కుాచి
ఝండా కీర్తిని నిలబెట్టే -
ధైర్యానికి  సహకార స్ఫుార్తి ।
మీ తలపుల్లో నిలవడమే
మేము పొందే ఘనమైన కీర్తి ॥

-------------------------
రచన., శ్రీమతి-
పుల్లాభట్ల  జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.  (మహారాష్ట్ర .)

-------------------------------------

No comments:

Post a Comment