రాత్రి నిద్దరలో విచ్చుకున్న
మస్తిష్కం, పగటి
పాపాలని పనిగట్టుకొని
మరీ ప్రతిపంబిస్తున్నాది.॥
పాలేరు నుంచి పనివాడి వరకు
అందరినీ అధికారబలంతో
అణగదొక్కుతుా,
అవమానిస్తుా , ఆనందిస్తున్న
నా క్రౌర్యాన్ని భుాతద్దం లో
చుాపిస్తుా ,భయంకరమైన
భీభత్సవాన్ని శ్రుష్టిస్తున్నాది॥
కలత నిద్దురలో అలసిన
అంతరంగం
పగలు ముాగబోతోంది.
పనికిమాలిన ఆలోచనలతో
బుద్ధి బురదగుంటలో
కుారుకు పోతున్నాది. ॥
ఏది చేసినా చెల్లుతుందనే
ధైర్యం ఇచ్చిన అహంభావం -
ఆలోచనా రహితమై
ఆగడాల ఆనందాల్ని
ఆశగా జుర్రుకుటోంది.॥
రాత్రి జ్ఞాపకాల - భయం
కనపడని మాధవునికి
మధుర భక్ష్యాలు, మంగళ
హారతుల తో పాటు ,.
ముడుపులంచం ఇచ్చి
క్షమాభిక్ష నడిగి - శాంతి
స్వాంతన పొందుతోంది.॥
మంచి చెడుల విచక్షణలను
విస్లేషించే మస్తిష్కాన్ని
మందలిస్తుా..ముళ్ళదారి
ఎంచుకున్న నా
బుధ్ధి నైజాన్ని
నవ్వుతుా భరిస్తోంది
నలిగిన నా మనసు.॥
రాత్రి కలిగిన పశ్చాత్తాపంకి
పగలు , వెలుగు ముసుగేసినా
రాత్రి నావెనకాలే నీడై
నన్ననుసరిస్తుా వెంబడిస్తోంది .॥
చేసిన పనుల చేదు నిజాన్ని
నిర్భయంగా వెలికి తీసి
చుాపుతున్న నా మన:స్సాక్షిని
నాలో ఉంచుకోలేకా. .,-.
బయటకి పంపలేకా , నాలో
జరిగే అంతర్మధనానికి
నాలో నేను--
బలైపోతున్నా సరే,
మనసు చుాసే
మధనాక్షువులకి మసిపుాసి ,
గంతలుకట్టి - నా
పాప చిట్టాలను
కరువుతీరా పోషించుకునే
నిరంతర పైశాచిక
దుష్ట పాప పిపాసిని..॥
---------------------------------
రచన..శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
-------------
No comments:
Post a Comment