శరణాగత వత్సలే...
ఆభోగి రాగం.
ఆరో॥ స - రిచ -గసా -మశు - ధచ - స ॥
అవ ॥ స ధ మ గ రి స ॥
చతురస్ర జాతి ఝంపె తాళం.
10. క్రియలు. 1.లఘవు..1అనుధ్రుతం ..1 ధ్రుతం
ఆరు వేళ్ళు , అర ఉసి , పుార్తి ఉసి .
---------------------------------------------------------
పల్లవి:
-----------
శరణాగత వత్సలే శంకరీ శివే...॥
అనుపల్లవి:
-----------------
పరమేశ్వరీ పరే...లలితే...పాహిమాం..॥
చరణం:
-------------
హిమవత్పర్వత రాజకుమారీశ్వరీ...
హైమవతీ హరి సోదరీ..గౌరీ.....
కామకోటి శ్రీపీఠాది విలసితే.....
కామ రాగాదిరస షడ్రిపు విదళితే.. ॥
చరణం:
------------
కమలాశన స్థిత ప్రణవాకార దీప్తే
మిధ్యా మాయా..మొాహవికారే పరే...
తామస గుణ ఘన త్రిగుణ రహితే..హితే
సామ గాన ప్రియ సంపుాజిత గుణ నుతే..॥
----------------------------------------------------------
రచన , స్వర కల్పన ,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------
No comments:
Post a Comment