53 వ మేళకర్త ఐన గమనశ్రమ జన్యం
హంసానందిరాగం.
ఆరోహణ =స- రిషట్- గఅం-మప్ర- ధచ- నికా- స
అవరోహణ= స ని ధ మ గ రి స
చతురస్ర జాతి , రుాపక తాళం. (ఆరు క్రియలు.)
1. ధ్రుతం. 1.లఘువు. ( 0 . 1).
0 1
--------------------------------------------------------------------
పల్లవి :
---------
శివానందమయ లహరీ -- శాంకరి హిమగిరీశ్వరీ
శక్తి స్వరుాపిణి దేవీ-- శ్రీ (చక్రేశ్వరి )లలితే...
అను పల్లవి:
-----------------
కామకోటి శ్రీ పీఠనివాశిని (శివ) కల్యాణీ...
కామ దహను ప్రియ సతీ శివే శర్వాణీ...
చరణం:
------------
చింతామణిమయ ద్వీప వాశినీ శ్రీమాత్రే..
చిద్ఘనే శుద్ధ మంత్రమయే... మంగళ గాత్రే..
సోమ సుార్యాగ్ని నయనే....సౌరి భయంకరి
సామవేద సంస్తుత శ్రుతి కీర్తే ...శుభంకరి..॥
చరణం :
------------
శబ్ద బ్రహ్మమయి సకల భువన వ్యాప్తే హితే
ఓంకార ప్రణవాది స్వరుాప మంత్ర ద్యుతే..
నాదబిందుమయి నాదానందానురక్తే -గతే..
నారాయణీ శివ నాట్య రసాద్భుత లయస్ఫుార్తే..॥
మధ్యమకాలం :
----------------------
తధ్ధిమిత ధిం ధిం సు ఢక్కా నినాదానందే రతే
తధ్ధిమ్మి తకధిమ్మి సంగీత సాహిత్య సింధే పరే
సిధ్ధే సుసిధ్ధే ప్రపంచైకానంతే అనంతానంతే..
అజేయే అమేయే అభేద్యే శుభే జోత్యఖండే శివాంగే..
॥ శివానందమయలహరీ...॥
----------------------------------------------------------------
రచన, స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-----------------------
No comments:
Post a Comment