చతురస్రజాతి మఠ్యతాళం. 10 క్రియలు
1.లఘువు. 1. ధ్రుతం . 1. లఘువు. (1.0.1 )
మాయామాళవగౌళ రాగం.
ఆరోహణ = స ,రిశు,గఅం,మశు ,ప ,ధశు, నికా ,స ॥స.॥
అవరోహణ = స , నికా , ధశు , ప, మశు, గఅం , రిశు , స ॥
--------------------------------------------------------------------
పల్లవి.
----------
శ్రీ రాజరాజేశ్వరీ..శివే...శంకరి.......
అ॥ ప॥
-----------
శ్రీచక్ర సంచారిణీ...చిత్స్వరుాపిణీ శ్యామల గౌరీ..
॥ శ్రీ రాజరాజేశ్వరీ.. ॥
చరణం.
------------
పరమ దయాకరి పంకజ లోచనీ
పురభంజను సతి పాహీ భవానీ...॥
సర్వసిద్ధిప్రద త్రిజగత్కల్యాణీ...॥ 2 ॥
సరస సంగీత సాహిత్య మొాదిని పావని.॥శ్రీ॥
చరణం.
---------
నాదబ్రహ్మమయానందే నాట్యరతే...
నారాయణేనార్చితశ్రిత నుాపుర పాదే...॥2॥
బిందు మధ్యస్థితానందానందవిభుాతే....
వేదనుతే సద్గుణమణి శైలసుతే...॥2॥
మధ్యమకాలం:
--------------------
చింతామణిమయ ద్వీప నగరే
చిద్ఘనానంద చిన్మయి మంత్రస్వరుాపే...॥2 ॥
సుందర దరహాసోజ్వలదీప్తే లలితే....
కలిత భవార్ణవ తారణ నౌకే...॥2॥
॥ శ్రీరాజరాజేశ్వరీ ॥
--------------------------------------------------
రచన , స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------
No comments:
Post a Comment