Sunday, May 19, 2019

సప్త తాళ కీర్తన. 1.అఖిలాండేశ్వరీ...

            చతురస్రజాతి..ధ్రువ తాళం.
                        నాట రాగం. 
ఆరోహణ =స, రిష, గఅం, మశు ,ప, ధష  ,నికా ,స.   అవరోహణ =    స  ని  ధ  ప  మ  గ  రి   స  ॥
                  14 క్రియలు.  ( l0ll ).
        లఘవు , ధ్రుతం , లఘువు , లఘువు.
   == =l             0            l              l   .
--------------------------------------------------
పల్లవి .
-----------
అఖిలాండేశ్వరీ శివే ,ఆగమ వినుతే,అంబ భవానీ..
అనుపల్లవి.
----------------
సుఖ సాగర లహరీ, సురేశ్వరీ, సుందరి ,శివసహితే..
                                                  అఖిలాండేశ్వరీ॥
చరణం.
----------
లక్ష్మీ ,వాణీ, సన్నుత చరణే, హరి-సోదరి మాన్యే
యక్షరాజ సఖ, అర్ధ శరీరిణి , దేవీ ముని ధ్యానే..
మధ్యమకాలం.
---------------------
రాకా శశిముఖి, రాజీవ-లోచని,
రత్న-సింహాసన-రాజిత రాజ్నీ రమణి మణీ ...
మ్రుగ వాహిని గుణమణి సుగుణ ధనీ...॥

ప్రాకారీ ప్రముఖార్చిత సేవిత ..మంజుల తర శుభ కామిని, కోమల పదయుగనే
పాహీ పావని గజగమనే....॥అఖిలాండేశ్వరీ ॥
చరణం 2.
--------------
స్మిత సిత సుందరి, చంద్ర కళాధరి , దేవీ వేదనుతే
నతజన సేవిత త్రిజగద్వందిత దేవీ యొాగ శిఖే..
మధ్యమకాలం.
-------------------
చక్రాయుధ ధరి, శ్రీ చక్రోపరి-స్థిత కమలాశని,
దుర్దశ నాసిని దురిత శమే....భవ-సాగర-
తారణి  కలి హరణెే.....॥
ఛిద్రుాపీ శివ తాండవ లయకరి , నాదా నందిత
నాట్యరతే , శివ- శంకరు కామిని శైలసుతే....శివ వినుతే॥ అఖిలాండేశ్వరీ..॥

షట్ శ్రుతి రిషభం.
అంతర గాంధారం.
శుధ్ధ మధ్యమం.
కాకలి నిషాదం.
---------------------------------------------------------
రచన, స్వర కల్పన..
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి..
కల్యాణ్.
-------------

.

No comments:

Post a Comment