Saturday, May 18, 2019

సప్త తాళ కీర్తన. సరస్వతీ ప్రార్ధన.

కల్యాణి రాగం. ఆది తాళం.
అరో॥  స, రిచ, గఅం, మప్ర , ప,  ధచ, నికా, స  ॥
అవ ॥  స  ని  ధ  ప  మ  గ  రి  స  ॥
-----------------------------------
పల్లవి.
-----------
నిరుపమగుణ సదనీ వాణీ
నీరజాక్షి జయ నిత్య కల్యాణి..॥ నిరుపమ ॥
అనుపల్లవి.
--------------
వరదాయకి వాణీ....కర రాజిత
వర మ్రదు వీణా పాణీ....॥ వర॥ నిరుపమ ॥
చరణం.
-----------
శరదిందు శోభిత సుందర వదనీ..
రాగాది స్వర, లయ, సంగీత సదనీ..॥
ఓంకార నాదాది ప్రణవ ప్రసుానే..
వాగ్విలాసిని వరదే కల్యాణీ...॥ నిరుపమ ॥
చరణం.
-----------
బ్రహ్మ  మానస జాయే మాత్రే..
శ్రుతి  సామ గాన సుధా రస పుార్తే..
అక్షయతేజో రుాప సుగాత్రే..
కచ్ఛతి వీణా వాదిని వంద్యే...॥ నిరుపమ ॥
-----------------------------------------------------------
రచన, :స్వరకల్పన...
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------

No comments:

Post a Comment