Saturday, May 18, 2019

సప్త తాళ కీర్తన.ధ్యాన కీర్తన.++ మంగళ హారతి.

  ధ్యాన కీర్తన.
--------------------
పుార్వికల్యాణి రాగం.  ఆదితాళం.
---------------------------------------------
పల్లవి .
---------
హిమశైల సుతే ..పాహీ లలితే
పాలయమాం , శరణాగత వత్సలే...॥హిమ ॥
అనుపల్లవి.
--------------
కామకోటి పీఠ వాసినీ.....ఈ.....॥ కామ...
శంకరాభరణ వేణీ....॥2 ॥  హిమ ॥
1.చరణం.
---------------
సుమశరేక్షు కోదండ పాణీ -
రమణి మణీ రస రాగ రంజనీ..॥ 2 ॥
కోమలతర శుభ సుందర వదనీ
శ్యామల వర్ణ అపర్ణ భవానీ ॥ హిమ॥
2.చరణం.
-------------
రాకా శశిముఖి , రాజీవ లోచని ,
శాకంబరి శ్రీ సింహ వాహినీ...॥ 2 ॥
ముాకదైత్య దమనీ.....మాహేశ్వరీ..
ఏకానేకాక్షర మంత్ర స్వరుాపిణీ..॥2॥.హిమ॥
3. చరణం.
---------------
షట్చక్రోపరిస్థిత కమలాసని..
షడ్గుణ నిపుణ సంపుార్ణాభరణీ..
మాయా కల్పిత విషయ ధురీణే....
త్రిజగద్వందిత త్రిగుణ స్వరుాపిణీ...॥ హిమ॥
------------------------------------------------------------
రచన + స్వర కల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
------------

సప్త తాళ కీర్తనల మంగళ హారతి.

--------------------------------------------

శహన రాగం 

ఆదితాళం.

మంగళ హారతి.

---------------------

పల్లవి:

మణి మయ మకుట ధరీ, సింహాసన

స్థితకరి శ్రీకరి శివ గౌరీ....

అను పల్లవి:

అణిమాద్యష్ట శిద్ధేశ్వరి ఈశ్వరి , 

జయ జగదీశ్వరీ..మంగళం....

మంగళం......మంగళం.....॥

మంగళం..

చరణం:

ఆర్కద్యుతి,  శిర పాదాంగుళ్యే

నయనంచ తధా , పావక తేజే

తేజో రాసి సముద్భవ భేద్యే

మాం పాహీ శివే... మంగళం..

మంగళం....మంగళం...॥

చరణం:

రుప దశ దివ్య , మంత్ర మాన్యే

క్షితి మండల క్షేమంకరి సౌమ్యే

చింతిత మానస హరిత క్లేసే

పాలయ మాం జయ మంగళే..

మంగళం..మంగళం...మంగళం...॥

...............


No comments:

Post a Comment