Friday, May 31, 2019

సప్త తాళ కీర్తన 6.బాల త్రిపుర సుందరీ

            బాల త్రిపుర సుందరీ.
                   తోడి  రాగం.
ఆరో ॥   స  , రిశు, గసా , మశు  , ప ,  ధశు ,  నికై  , స   ॥
అవ॥     స ,  నికై ,  ధశు,   ప,   మశు,  గసా,   రిశు ,  స   ॥
      చతురస్రజాతి  త్రిపుట తాళం.
                    7. క్రియలు.
      ఒక లఘువు...రెండు ధ్రుతాలు.
           ( అసావేరిలో  పాడేను).
----------------------------------------------------------
పల్లవి:
బాల త్రపుర సుందరీ.. ,పాహిమాం పరమేశ్వరీ...

అనుపల్లవి:
శైల రాజ ప్రియ నందినీ , ఫాలనేత్రు ప్రియ భామినీ॥

చరణాలు :
------------

1.  కోటి సుార్య ప్రకాశినీ  --   ఖేటకాస్త్ర కర ధారిణీ..
     దుష్ట  దైత్య సంహారిణీ -- శిష్టత్రాణ పరాయణీ ॥

2.  మంత్ర తంత్ర సంవాస గుహే -- శ్రీకరీ ప్రణవాక్రుతే
     పంచాక్షర మంత్రార్చితే --బీజాక్షరి శ్రీ   మాత్ర్రుకే

3.  ఆగమాది నుత శ్రీప్రదే.----శ్రితజనాత్కల్ప లతికే
     శైల తీర్ధ వర వైభవే ---- శాంకరీ కరుణార్ణవే....॥

4.  ధ్యానయొాగ సంపుార్ణమయే- జ్ఞాన కమల -                                           మకరందమయే....
    వేద విదిత సంపుాజ్యమయే- నాద భరిత-
                                       స్వర శబ్దమయే....॥

5.  చక్ర రాజ స్థిత శ్రీకరీ..  త్రిపురాది చక్రేశ్వరీ...
     శక్తి అష్ట - శిద్ధేశ్వరీ  -  సుందరీ  జగదీశ్వరీ.....॥

-------------------------------------------------------------

రచన, స్వరకల్పన ,
శ్రీమతి , పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------

No comments:

Post a Comment