Friday, May 31, 2019

సప్త తాళ కీర్తన 7. రజతాచలాగ్ర నిలయే...

           రజతాచలాగ్ర నిలయే..
            మధ్యమావతి రాగం.
ఆ ==   స,  రిచ,   మశు,  ప ,  ని కెై ,  స.॥
అ====స    ని    ప     మ     రి     స ॥
          చతురస్ర జాతి ఏకతాళం.
                   4. క్రియలు. 
           (4 .వేళ్ళు.)ఒక లఘువు.
----------------------------------------------------------------
పల్లవి:
----------
--రజతాచలాగ్ర నిలయే అంబా..
   శ్రీ రమా వాణీ సఖీ.. సతీ..

   అను పల్లవి:
---------------------
   అజయే దయార్ద్ర ,  హ్రుదయే జయే
   జగదీశ్వరీ.. పాహిమాం శివే...॥

  చరణం:
--------------

--పావని శశిముఖీ , -పాహీ-పార్వతీ----
---భావిత శ్రీపదాశ్రితజన   స్తుతిమతీ...
---సర్వోన్నత ఘన, గుణ విభుాతీ
---సర్వమయే శ్రీ, గౌరి మహేశ్వరి   ॥ రజతా ॥

చరణం:
------------

----మునిజన హితే , -మొాహన- రుాపే
----మణిమయ భుాషిత , మంజుల గాత్రే
----జ్ఞానానంద విలసితే......   ,.హితే...
----సర్వ సుపర్వ  ,  సంపుాజిత  కీర్తే...

మధ్యమకాలం:
---------------------

      షట్చక్రోపరి స్థితకరి శ్రీకరి
                     చక్ర రాజ వలయే...
      షడ్గుణైశ్వర్య సంపత్కారిణి
                     సుందరి శ్రీ గిరి నిలయే..
     శుంభ-నిశుంభాది కైటభ భంజని
                    మహిషాద్యాసురగణ దమనే..
      అరిషడ్వర్గ విదారిణి గుణమణి
                  జగదంబా పరమశివే.....॥ రజతా ॥

---------------------------------------------------------------

రచన, స్వరకల్పన,
శ్రీమతి పుల్లాభట్ల ,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
-------------------

No comments:

Post a Comment