శ్రీ....రాజరాజేశ్వరీ...
శ్రీరాగం. మంగళం.
ఆరో॥ స , రిచ , మశు , ప , నికై, స ॥
అవ॥ స , ని , ప , మ , రి, గసా , రి , స ॥
ఖండజాతి ఏక తాళం.
దెబ్బ..నాలుగు వేళ్ళు.
---------------------------------------------------------
పల్లవి:
-----------
శ్రీ.....రాజరాజేశ్వరీ....పాలయే..శంకరీ....శివే...
అనుపల్లవి:
----------------
శ్రీ.....చక్ర సంచారిణీ..శ్రీకరి , మణిద్వీప వాసిని లలితే--------॥శ్రీ....॥
చరణం:
-------------
ఇందుకళాధరు సుందరీ..నారాయణి
నంద నందను సోదరీ ....ఘనీ...॥
బిందు మణ్డలా..వాసినీ...పావని..
కామకోటి పీఠ విలాసినీ..జననీ...॥ శ్రీ ॥
మధ్యమకాలం:
---------------------
కోటి బాలార్కవర్ణే అపర్ణే...
కనక కుసుమ కీర్ణే ...శ్యామల వర్ణే
కరధ్రుతేక్షు పాశాంకుశ పుష్ప బాణే
కామేశ్వరీ శ్రీ లలితే భవానీ.. ॥ శ్రీ ॥
చరణం:
------------
నిఖిల నిగమాంత నుత పదే మానిని
క్షిత్యాదీ తత్వ స్వరుాపిణీ భవానీ..
అ క చ ట త పా..దివర్ణే...సంపుార్ణే
అక్షర మాత్రుకే త్రిపుర సుందరీ భవానీ..॥శ్రీ॥
మధ్యమకాలం.
---------------------
చింతామణిమయ మందిర స్థితే
శివ కామేశ్వరి చిన్మాత్రే పరే
బ్రహ్మ , శివా , విష్ణుా నఖ ప్రకటిత
బ్రహ్మాండ నాయమకి ,
శివయువతే..శైలసుతే..॥-
---------------------------------------------
రచన , స్వర కల్పన,
శ్రీమతి పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి
కల్యాణ్.
--------------
No comments:
Post a Comment