Monday, October 21, 2019

అక్శరాశ్రువు. Good.

ఆకాశంలో తారలతో తగువాడిన  అక్షరం..
అలవోకగా అలకసాగిస్తుా ఆశగా కిందకు జారింది..॥
కవితాంశ పాఠ్యాలలో కావ్య కన్నెగా ఒదిగి పోవాలనీ
పువ్వుల , నవ్వుల విరిజల్లుల లో తేలిపోవాలని 
కలలు కంది ॥

వలపు కన్నియల కురుల లోఒబ్బిడగా ఒదిగిపోవాలని ,కళాపోషకుల భావజాల-
 పద సాహిత్య సంపదలకు సౌరభాలు  నింపాలని
తపన  పడింది .॥.
ఆశల  ఆలోచనల-ఆనందొోత్సాహాలతొో
నెేలపై అడుగిడిన అక్షర   కన్య , నేల తల్లిపై 
అడుగిడి   నంతనే .....విల వల లాడింది ॥

ఎండి, బీటలువారి తడారిన నేలతల్లి 
ఒడి చేరి..,ఎక్కళ్ళు పడుతుా  కంటనీరిడింది.॥
రాత్రి చీకటికి , కారునలుపు బాటలు
సవాళ్ళై  వెంటాడుతుా ఉంటే..రాకుాడని చోటికి 
వచ్చిన తన ఒంటరి తెగువకు
ఉస్సురంటుా నిట్టుార్పు విడిచింది ॥

తెలిపొద్దు -తొలి కిరణానికిస్వాగతం పలికే 
పక్షి సముాహాలకిలకిలారవాలని ఓరగా
 కనులు విప్పి చుాసింది.॥
  చెట్లు కానరానక,చుారు నీడల్లో దుారిన
 చెలియ చిలుకల -వాడిన ముఖాల్లో
 నిండిన నైరాస్యం గమనించి కంట తడి పెట్టింది ॥
 
 రవి రాజు కురిపించే బంగారు కిరణాల ఒంపుల్లో
 నిండి విస్తరిస్తున్న కాలుష్యపు కంపుని
 ముక్కు ముాసుకు భరించింది.॥
దుమ్మతో రంగుమారి ధుాళిలో పొడిదగ్గులు
 ధగ్గుతుాన్న  ప్రక్రుతి సఖులని  ఓదార్చింది.....॥
 
 ఊసులాడుకుంటున్న పుాలతల సొంపుల్ని ....
 పైరు పచ్చని  గడ్డి తివాచీలని మత్తు గొలిపే మట్టి 
 సువాసనలని, ఆస్వాదించాలనీ,,సాఫీగా సాగే సెలయేరుల -గల-గలలని దాటుకుంటుా...
 కొత్త బంగారులోకంలోకి వచ్చి, తన ఆనందాన్ని  -
 ఎవరితోనైనా పంచుకోవాలని అనుకున్న  అశ- 
నిరాశగా  మారింది ॥
 
 బీడువారిన పొలాల్లో తడారిన  గతుకుల గుంతల్లో
  కుార్చొని ఉన్న కళాకారుల.. చేత పట్టిన కలాల్లోంచీ ,
జాలువారే  తన తోటి సఖుల---నిస్సహాయ నీరస 
కవితా గానాన్ని వినలేక చెవులు ముాసుకుంది.॥
 కలం గళం నుండి వెలువడే కర్కశ కన్నీటి వ్యధా భరిత పదాలతో కలిసి తానొక వాక్య -విలాప ..-
 కావ్య కథనాల కొలిమిలో సమిధయై మిగిలిపోయింది॥
 
 అప్పుడు  తెలిసింది   తాను  వచ్చినది 
 స్వర్గ సీమ కాదని...భుాలోక నరకమని ॥
 వర్గ , వర్ణ , కుల ,మత  కలహాలకు నెలవైన
 రాక్షస  వైరాల రాజ్యంలోకి తాను అడుగు పెట్టిందని..॥
  
 తను చేసిన తప్పుకు శిక్షగా...మచ్చుకైనా  మన:శ్శాంతి లేక  ,మనుగడ కరువైన
 మానవాళి,  వ్యధా భరిత భావ  పరంపరల -
 సుడిగుండాల -వలయాల-చిత్తడిలో చిక్కుకొని, 
 పైకి రాలేని  అశ్రాక్షర శకలంలా మిగిలి, కుమిలి..
 కమిలిపోవలసిందేనని ॥.
---------------------------------------
రచన,శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
కోట్ల కొలదిగా గల,
బాధా పరితప్త హ్రుదయాల-
భావ పరంపరల వేదికకు,
స్వాంతన చేకుార్చే.
చల్లని వెన్నెలలాంటి
అక్షర  సముాహాలకు
సాదర వందనాలతో...🙏🙏
--------------------------

 
 

No comments:

Post a Comment