స్వశ్ఛమైన మల్లెల వంటి తేట తెల్లని
మనసులా,ఒక్క మచ్చకుాడా లేక నిర్భయంగా విహరిస్తున్న కాగితానికి ,ఇప్పుడు,బయటకు రావాలంటే భయమేస్తోంది.॥
తన తోటి సఖులు, -రంగు రంగుల వర్ణాల
నెచ్చెలులతో కలిసి, పేపర్ మిల్లు గుడారాల్లో
గుంభనంగా దాగునుంది దీనంగా..
ఒకప్పటి రోజుల్లో......తమ ఉనికి-
ఎంత ఆహ్లాదంగా ఉండేదనీ...
.పెండ్లి పిలుపులకు , సెంటు పుాసుకొని
సన్నాయి మేళాల సందడులతో ,
ఆహ్వాన పత్రికై అలరించేది.॥
భగవదారాధనా శోభలకు శుభ -
లేఖలుగా మారి,పసుపు కుంకాల
పచ్చ బొట్లతో నిండి, పరవశియై
కళ కళ లాడేది.॥
రవి వర్మ..పికసో..బాపుాల వంటి
చిత్రకారుల కుంచెలతో, రంగు రంగు వలువల
అందాలని సంతరించుకొని అద్భుత
సౌందర్యరాసియై .....
ఆనంద లోకాల్లో విహరించేది.॥
వలపు పిలుపుల వర్ణనలతో నిండిన
చెలికాని సందేశమై , అది చదువుతున్న
చెలియ సిగ్గుల , నునుపు దేరిన బుగ్గల,
కాంతి తో దోబుాచులాడేది.॥
రుాపాయి నుండి మొదలైన ముద్రలతో
మధ్యతరగతి నుండి మాముాలు
జనాల వరకు గల నిత్యావసరాల నిండు
లక్శ్మిగా పుాజలందుకునేది.॥
ధర్మ నిరతి గల స్వాతంత్ర్య పోరాటకుల
కీర్తి చిత్రాల చెలిమి తో
కొలువు తీరి ఉండేది.॥
వలసి నన్ని వార్తా విశేషాల న్యాయ బద్ధ
నిబంధనల చిట్టాలకు , పుటల దాస్యం చేసేది.॥
వసి వాడని , పసి పిల్లల అట పాటల
ఆనందాలకు, వర్షాకాలపు నీటి పడవగా మారి,
అనుభుాతుల అలలపై కేరింతలు కొట్టేది.॥
ఇలా ఎన్నెన్నో తీపి గుర్తుల జ్ఞాపకాల కధలు..
కాలంతో పాటు కరిగిపోతుా ...మసి కొట్టుకు పోయేయి.
కాగితం విలువ కనపడని కాలుష్యంలో పడి
మట్టి -కొట్టుకుపోయింది.
ఇప్పుడు...
పెళ్ళిళ్ళ పిలుపులకు బెత్తెడు ముక్కెై
చిరునామాను మొాసి...చదివిన
క్షణంలొోనెే చినిగి , చెత్త బుట్టలో చేరిపోతున్నామని.
కుమిలిపొోయింది ॥
గుడి నిర్వాహకుల గొంతెమ్మ కోర్కెల-
రుసుము పుాజల , బారెడు జాబితాల పట్టీలతో ,
గుడి బయట గోడకు అంటించబడి -కళాహీనమైన
ముఖంతో వెల- వెల బోతున్నామంది.॥
అర్ధం పర్ధం లేని, మొాడర్న్ ఆర్ట్ రంగులతో,
బారెడు కొలతల బుాతు బొమ్మలతో, బేరపు
సొమ్ముకు ,అమ్ముడుపోతున్నామంది॥
ఉత్కంఠ పరచే "ఉత్తరం" జాగాలో..
ఏసిడ్ దాడుల ఏహ్యపు బెదిరింపులను
సుాచించే ఎత్తుగడల రాతలకు రగిలే- కన్నీటి
కావ్యమయామంది .॥
అతి తక్కువ ముద్రతో ,అందరి కడుపుా
నింపి , ఆనందపరచెే తన విలువ,
అర్దాంతరంగా...
వేల రుాకలకు పెరిగి వేలంపాటలో
వెలివేయబడి, వెక్కిరింతలపాలయ్యిందంది.॥
అబద్ధపు రాజకీయ ప్రమాణాలకు
సాక్షిీ భుాతమై , ప్రపంచ ప్రజానీకాన్ని పేజీలతో
వంచించే వార్తావెలయాలిగా స్థిరపడిపొోతామేమొా
అని బెదిరిపొోతొోంది..॥
ఎన్నో సద్ధర్మ , సాంప్రదాయ , కావ్య
కళా -ఖండాల నిక్షిప్త నిధులను అలరించిన-
మా దొంతు పుటల భాగ్య రాసులు...
మారే కాలంతో ముడివడి , భాషా పటుత్వం
లేని భావ జాలాల మార్పుల్ని , జీర్ణించులో లేక,
వంశాభివ్రుద్ధికి నోచుకోని శాపగ్రస్తులుగా మిగిలిపోతామేమొా అన్న ఆవేదనతో
హా- హా -కారాలు చేస్తున్నాయంది॥
అంతెేకాదు...
సామాన్య మానవునికి అందుబాటులో లేని
మా అంతరంగ ఆవేదన" స్విస్" బేంకు ఖాతాల-
కారాగారంలో చిక్కుకొని కన్నీరు కారుస్తోందని
కుమిలిపొోయింది.॥
పాడి - పంటల పచ్చదనానికి కావలసిన
సరంజామాని సమకుార్చని , స్వార్ధపరుల
సోకు సౌలభ్యాల రంకు రుసుముగా, చేతులు మారుతుా ,చితికిపోతున్న జీవితానికి..
అంత మెప్పుడో ఎరుగని వింత ఆట పత్రాలుగా
మిగిలిపోతామన్న భయంతో ఆక్రోసిస్తున్న
అభాగ్యులమంది. ॥
ఏ రోజు కారోజు ఎన్ని చేతులు మారవలసి వస్తుందో,
ఎన్ని రంగులు పులుముకో వలసి వస్తుందో,
ఏ వెల "లేని" విలువకు దిగజార వలసి వస్తుందో-
అని బెదురుతుా బతుకుతున్న , మొండెం లేని
ముదనష్టపు జాతకులమంది.॥
గొంతెత్తి అరవలేక, మమ్మల్ని మేము
తీర్చి దిద్దుకోలేని, అసహాయ - అంగవైకల్య -
హీన చరితలం ,అంది॥
కరన్సీ పేరుతో ముద్రింపబడుతుా దీనమైన
స్థితికి దిగజార్చబడుతున్న, శక్తిహీన కాగితపు కాంతా-కనకాలమంటుా వాపొోయింది. ॥
వెట్టి చాకిరీ చేస్తున్న , వట్టి వెర్రి తెల్ల కాగితం.
---------------------------------------------------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
---------------.
---------------------------------------------------------------
.
No comments:
Post a Comment