శీర్షిక .
ఓ..పడతిీ.
ఓ పడతీ...పైట కప్పుకో..పైటలాగ గానే
పరుగెత్తుకొచ్చే పరంధాముడు
ఇక రాడు....లేడు గనక..
అసహ్యపు హీన బ్రతుకును
ఆస్వాదంచే మ్రుగ మగాడికి
నీ ఆర్తనాదం ఆనందగీతమై
అర్ఘ్యం పోస్తుంది అందుకే ...
ఓ పడతీ...పైట కప్పుకో...
ఎవరో వస్తారని ఏదో చేస్తారని
ఎన్నాళ్లిలా ఎదురు చుాస్తావు
కాగితపు నోట్లకి అమ్ముడు పోయిన
న్యాయం...కామాంధుడికి
అద్భుత దీపం లాంటది.
కసిగా రుద్ది...కరకుగా వాడుకోవడమే
కాదుకోరిన వారికి కావలసినంత
పంచేంత దుర్గుణ హేయానంద
హృదయం వాడిది.అందుకే...ఓ పడతీ...
పైట కప్పుకో..
నీవు అక్రోశించిన ప్రతీ చోటాదుశ్శాశన రాజ్యం
దుందుభిలు మ్రోగిస్తోంది
సిగ్గు విడచిన సీమ పందుల్లాంటి
జనం మురికిలో కామం మందు
తాగి పొర్లుతుా.మలం నంజుకు తింటున్నారు
అందుకే..ఓ..పడతీ..పైట కప్పుకో..
పాచికలు పారడానికి సిద్ధంగా ఉన్న
శకునులతో జూదమాడి ఓడిన తలలు
సిగ్గుతో వాలి పోయాయి .అవి నిన్ను చుాడలేవు.
అందికే..ఓ పడతిీ....పైట గట్టిగా క ప్పుకో ॥
ఎందుకంటే
న్యాయం గుడ్డిదే కాదు. చెమిటిది. ...ముాగదీ కుాడాదానికి నీ ఆర్తనాదాలు వినబడవు .అవి రాజకీయ సీస శాశనాలతో ముాసుకుపోయాయి
దాని నోరు పదవుల పెద్దనోట్ల పక్షవాతంతో ఎప్పుడో పడిపోయింది..అందికే...
ఓ.....పడతీ...పైట గట్టిగా కప్పుకో
పైట లాగినంతనే పరగెత్తుకొచ్చే
పరమాత్ముడిక్కడ...లేడు. .ఇంక రాడు కుాడా...
-----------------------------------------
రచయిత్రి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------------------------------------------------
No comments:
Post a Comment