ఆకాశంలో తారలతో
తగువాడిన అక్షరం..
అలవోకగా అలకసాగిస్తుా
ఆశగా కిందకు జారింది..॥
నేల తల్లిపై కరడు కట్టిన
బంజరు భుామి పగుళ్ళు
కాళ్ళకు తగిలి
విల వల లాడింది ॥
రాత్రి చీకటిలొో ,
రుాపు మారిన
వ్రుక్షరాజాలని చుాసి
ఉలిక్కిపడింది.॥
దానికితోడు
కీచురాళ్ళశబ్దాలు ,
కారునలుపు బాటకు
సవాళ్ళై , వెంటాడుతుా ఉంటే..
రాకుాడని చోటికి వచ్చిన తన
ఒంటరి భయానికి ఉస్సురంటుా
కనులు ముాసుకుంది..॥
తెలిపొద్దు -తొలి కిరణానికి
స్వాగతం పలికే
పక్షి సముాహాల
కిలకిలారవాలకి ఓరగా
కనులు విప్పి చుాసింది.॥
రవి రాజు కురిపించే
బంగారు కిరణాల ఒంపుల్లో
ఒదిగి ఊసులాడుకుంటున్న
పుాలతల సొంపుల్ని ....
పైరు పచ్చని గడ్డి తివాచీలని,
మత్తు గొలిపే
మట్టి సువాసనలని,
అఁగా ఆస్వాదిస్తుా,
సాఫీగా సాగే సెలయేరుల -
గల-గలలని దాటుకుంటుా,
కొత్త బంగారులోకంలోకి
వచ్చిన ,తన ఆనందాన్ని -
ఎవరితోనైనా పంచుకోవాలని,
చుట్టుా చుాసింది...॥
పచ్చని పొలాల్లో మెత్తటి
పచ్చికపై కుర్చున్న వాని-
చేత పట్టిన కలంలోంచీ ,
జాలువారే తన తోటి సఖులని
ఆనందంగా కలిసి మెలిసింది.॥
కానీ ...
కలం గళం నుండి వెలువడే
కర్కశ కన్నీటి వ్యధా భరిత
పదాలతో కలిసి
తానొక వాక్య -విలాప ..-
కావ్య కథనాల కొలిమిలో
ఒక సమిధయై మిగిలింది.॥
అప్పుడు తెలిసింది
తాను వచ్చినది
స్వర్గ సీమ కాదని...॥
వర్గ , వర్ణ , కుల ,మత
కలహాలకు నెలవైన
రాక్షస వైరాల రాజ్యంలోకి
అడుగు పెట్టిందని..॥
మచ్చుకైనా మన:శ్శాంతి
లేక ,మనుగడ కరువైన
మానవాళి, వ్యధా భరిత
భావ - పరంపరల
జాలం లొో చిక్కు కుందని-॥
సుడిగుండాల -వలయాల-
చిత్తడిలో... కుారుకొని,
పైకి రాలేని అశ్రాక్షర
శకలంలా మిగిలి, కుమిలి..
కమిలిపోవలసిందేనని ॥.
---------------------------------------
రచన,శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
--------------
కోట్ల కొలదిగా గల,
బాధా పరితప్త హ్రుదయాల-
భావ పరంపరల వేదికకు,
స్వాంతన చేకుార్చే.
చల్లని వెన్నెలలాంటి
అక్షర సముాహాలకు
సాదర వందనాలతో...🙏🙏
--------------------------
No comments:
Post a Comment