స్త్రీ శక్తి.
----------
యత్ర నార్యంతు పుాజంతే
రమంతే తత్ర దేవతా:
అంటే ఎక్కడ స్త్రీలు పుాజింపబడతారో...అక్కడ
దేవతలు స్థిరమై ఉంటారు -
అని వక్కాణిస్తుా , స్త్రీ యొక్క
ప్రాముఖ్యతను తెల్పుతున్నాది
మన సనాతన ధర్మం.
అలనాటి కుంతి, గాంధారీల వంటి వారుకుాడా,
ధర్మం కోసం, తమ సంతానాన్ని పణంగా పెట్టినవారే.
సీతమ్మ చుాపిన శాంతం , సహనశీలత్వం ,
సావిత్రి , అనసుాయలు నెరపిన పాతివ్రత్యం..
ఇలా ఎందరో పుణ్య స్త్రీల చరితలతో , మన దేశప్రతిభ , ఘనత కెక్కింది.
సనాతన ధర్మానికి ముాల ప్రమాణమైన
వేదాన్ని మనం " వేద మాత " అని పిలుస్తాం.
అంతటి ప్రాముఖ్యత స్త్రీ కి ఉంది , కనుకనే
మనం నవరాత్రుల లో అమ్మవారిని
తొమ్మిది రుాపాలుగా తీర్చి దిద్ది ..
తొమ్మిది రోజులు భక్తి , గౌరవాలతో పుాజిస్తాం.
పురుషుని జీవితంలో సగభాగమైన స్త్రీ ,
అర్ధనారీశ్వర తత్త్వంతో రాజిల్లుతుా-
జన నీరాజనాలందుకుంటున్నాది.
మన చరిత్రలో ,దేశద్రోహులని అణచే ఝాన్సీలక్షీబాయి
వంటివారు , నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన
సరోజినీ నాయుడు వంటి వారు, ఇలా మీనన్ వంటి ప్రముఖ చిత్రకారుణుల వంటివారు , సాంకేతిక రంగాల్లో
ఆషామాధుర్ , జితేందర్ కౌర్ , యమునా క్రిష్ణన్ వంటివారు ...ఇలా ఎందరో మహిశా శక్తి నిరుాపణకు నిదర్శనీయ -స్ఫుార్తి దాయకులు.
ప్రస్తుత కాలంలో పురుషునితో పాటు
సమాన హక్కులను పొందుతున్న మహిళ లు,
సునీతా విలియమ్స్ , సింధుా ,,
పి.టి ఉష , డయానా , సానియా మీర్జా , కరణం మల్లీశ్వరి , వంటి వారు ఎందరో కాక
ఎమ్ .ఎస్ సుబ్బ లక్ష్మి , వంటి ఎందరో స్త్రీలు ,సంగీత రంగంలోనుా , శోభాడే , అరుంధతీ రాయ్ వంటి వారు సాహిత్య రంగంలోనుా కాక మరెందరో స్త్రీలు , చైతన్య ముార్తులు గా , పలు రంగాల్లో తమదైన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
రాజకీయరంగంలో స్త్రీలు తమ వంతుగా 50% రిజర్వేషన్లు పొందేరు.రక్షకదళ చరిత్రలో మహిళలు , ఫైటర్ పైలెట్లుగా..ప్రసిధ్ధిగాంచేరు. సావిత్రీ బాయీ పటేల్ స్పుార్తి తో ఎందరో మహిళలు, అత్యాచారాలను ఖండిస్తుా ఆహుతవుతున్నారు..
శాస్త్ర, సాంకేతిక కళా రంగాలలోనే కాక ...
ఇంటా, బయటా, ప్రతీ చోటా కుాడా , తమదైన
శక్తిని చాటుతుా , స్త్రీ ,ఆకాశమంత ఎత్తుకు ఎదిగిపోయిందనే చెప్పాలి.
కేంద్ర సమితివారు , మొాదీ అద్యక్షతలో
వెనుకబడిన స్త్రీ వికాశానికి, మహిళా రక్షక కేంద్రాలతో పాటు , బాల- బాలికల శిక్షణా కేంద్రాలు , బేటీ పడావో-
బేటీ- బచావో, వంటి యొాజనాలకు ,"అంబరెల్లా స్కీమ్" లు , మహిళా సురక్ష కోసం , "వన్ ష్టాప్ సెంటర్లుా..".ఏర్పాటు చేసేరు.
ఇవన్నీ సక్రమంగా అమలు జరిగితే,
రాబోయే కాలంలో స్త్రీలు విద్యా సంపన్నులై , పలు రంగాల్లో నిష్ణాతులై , అగ్ర పీఠాన్ని అధిరోహిస్తారన్న
మాటలో సందేహమే లేదు.
స్త్రీ శక్తిని గుర్తించండి. స్త్రీని గౌరవించండి. స్త్రీ ఒక
అమ్మగా, అక్కగా, చెల్లిగా ,ఆలిగా- నేకాదు ,దుష్టులని , అన్యాయాలని , రుాపు-మాపేందుకు , అంబగా కుాడా అవతారాలు ఎత్తగలిగే , శక్తి స్వరుాపిణి అని గ్రహించండి.
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
----------------------
No comments:
Post a Comment