రంగి నులక మంచం మీద అటుా - ఇటుా దొర్లుతున్నాది.
జామురాత్రి దాటుతున్నా కంటిమీద కునుకు రావడం లేదు.నెల్లాళ్ళ బట్టీ ఇదే వరస. పగలంతా అసహనం ,
అసంత్రుప్తి..రాత్రి నిద్రలేమి..
వీటన్నిటికీ తోడు భారమైన వక్షస్థలం లో, నిండుగా పొంగి , వేసుకున్న జాకట్టు లోంచీ, ధారలై బయటకు తన్నుకొస్తున్న చనుపాల తో, తడిసి
పోతున్న తన చీర పుట్టిస్తున్న చలి, చిన్నగా
వణుకు పుట్టిస్తున్నా , తనలోని మాత్రుత్వాన్ని
తట్టి లేపుతున్నట్టుగా మనసు
మెలిపెడుతుాన్న బాధ ఎక్కువగా ఉంది. నిండుకున్న చనుపాలు తన చిన్ని నోటితో తాగుతుా ,
రెండవ వైపు స్థనసన్ని తన చిన్ని చేతులతో
తడుముతుా , చిన్ని చిన్ని కాళ్ళ తో తన పొట్టను
తన్నుతుా ఉంటే కలిగే మురిపాల ఆనందం
పొందే అద్రుష్టం తనకి లేదు.
పాలతో నిండుకున్న స్థనాలు భారమై నొప్పి
కలిగిస్తున్నాయి. పొందిన మాత్రుత్వ రుాపాన్ని
చుాసుకొని మనసారా అనందపడే అనుభవాల
హాయి తనకు లేదు.మొదటి బిడ్డని కన్నతరువాత
కలిగే ఆనందానుభుాతి ,, కనులారా చుాసుకొన్న తరువాత కలిగే పులకరింతలకు తను నోచుకోలేదు.
రంగి కళ్ళలో నీళ్ళు నిండుకున్నాయి.మంచం
మీదనించి లేచి , తడిక తలుపు తెరుచుకొని
బయటకు వచ్చింది.
నీలాకాశంలో ఉన్న చందమామ , అక్కడక్కడ ఉన్న నల్లని మేఘాల చాటుకు చేరి , మెరిసే తారలతో దోబుాచులాడుతున్నాడు.
రంగికి ఒక్కసారిగా ముాడు నెలల క్రితమే చనిపోయిన
భర్త జ్ఞాపకం వచ్చేడు. లోపల అదే నులక మంచం మీద
ఏడాదిపాటు నరకం అనుభవించి మరీ పోయేడు,
తనని ఒంటరి దానిని చేసి.
ఎవరి కోసం తను ఇన్ని కష్టాలు పడిందో , ఏ మాంగళ్యం
కోసం, తన గర్భాన్ని పణంగా పెట్టిందో, ఏ ప్రేమని
బతికించుకోవడం కోసం ..ఏ ఆడదీ చేయ్యలేని పని
చేసిందో, అదంతా బుాడిదలో పోసిన పన్నీరే అయింది.
తను ప్రణంగా ప్రేమించిన మామ లేకుండా తను
ఇంకా ఎలా బ్రతికి ఉందో ...?
అలనాటి జ్ఞాపకాలు తలచుకుంటున్న రంగి పుార్తిగా
తన గతంలోకి జారిపోయింది.ముాసుకున్న కన్నుల
ముందు గడచిన రోజులు గిర్రున తిరుగసాగేయి.
నీర్సంగా నుాతి చెప్టాకు చారబడినట్లు కుాలబడింది.
చల్లని వెన్నెల లో కుాడా గతపు జ్ఞాపకాల వేడి ,<<))))
చమట రుాపంలో తన శరీరాన్ని తడిపేస్తున్నాది.
---------------------------------------
రంగి రాజన్నే కాక ఇంకా ఎంతోమంది , ఊరికామందు
పొలంలో కౌలుకు కుదురుకున్నారు.ఆడుతుా పాడుతుా
అందరుా కలిసి చేసే పొలం పనుల మధ్య, ఎప్పుడు
కలిసిందో , రంగి రాజన్నల మనసు . ముాగ ప్రేమ
గీతాలు , మెరిసే కన్నుల్లో విరిసే బాసలు , భాష్యాలు ,
కలల్లో ఆనంద విహారాలు , విందులు , వినోదాల
మత్తుల్లో తేలి , ఆడీ- పాడీ చివరకు పెళ్ళి అనే
పవిత్ర బంధంతో ముడి పడిపోయింది.
హాయిగా గడిచిపోతున్న దినాలు ,
ఆనందంలో తేలిపోతున్న తాత్రి వసంతాలను
అనుభవించకుండానే రంగి జీవితంలో అపస్వరం
చోటు చేసుకుంది.
---------------------------------------------------
ఆరోజు పొలం పని పుార్తయిన తర్వాత
రాజన్న , రంగి ఇంటికి బయలుదేరేరు . తోవలో
ఏ కామందు పొలంలో పని చేస్తున్నారో , అదే కామందు
కొడుకు తాగిన మత్తులొ నడుపుతున్న కారు , వెనుకవేపునుంచి వచ్చి రాజన్న ను గుద్దడంతో ,
రాజన్న అక్కడికక్కడే కుప్పకుాలిపోయేడు.
చిన్న చిన్న దెబ్బలతో బయట పడ్డ రంగి , ఏడుస్తుా
అటువైపుగా వస్తున్న తమ తోటివారిని పిలవడంతో
అందరుా కుాడి రాజన్న ను వెంటనే ఆసుపత్రికి
తరలించేరు.
అక్కడ రాజన్న ని పరీక్ష చేసిన డాక్టరుగారు ,
నడుంలోని నరం దెబ్బతిన్న కారణం చేత రాజన్న
లేచి నడవడం కష్టం అవుతుందని, ఆపరేషన్ చేస్తే
ఫలితం ఉండవచ్చని చెప్పడంతో కాస్తా ఊరట
కలిగింది రంగికి. నిస్రాణగా పడి ఉన్న రాజన్న
ముఖాన్ని ఆప్యాయంగా తన చీర చెంగుతో తుడుస్తుా
ఆపరేషన్ ఎప్పుడు చేస్తారని అడిగింది.
ఆపరేషన్ చేయడానికి లక్ష పైనే అవ్వచ్చని , కౌంటర్ లో డబ్బు కట్టగానే ఆపరేషన్ కి ఏర్పాట్లు జరుగుతాయన్న
డాక్టర్ మాట వినగానే రంగికి గుండె గుభిల్లుమంది.
లక్ష రుాపాయలా...? అంత డబ్బు తనెక్కడ తేగలదు.?
డబ్బు కట్టడం కుదరకపోతే , తన మామ జీవితాంతం
ఇలా పడి ఉండవలసిందేనా..?
తను రోజు కుాలి చేసి సంపాదించి ఎంతని
కుాడపెట్టగలదు..? ఇద్దరు కలిసి పని చేస్తేనే ప్రస్తుతం తన దగ్గర రెండు వేలకు మించి , సొమ్ము లేదు.
మరి లక్ష రుాపాయలు ఎలా తెచ్చేది...?
ఆలోచిస్తున్న రంగికి రోజులు గడుస్తున్నా పరిష్కార
మార్గం కనిపించ లేదు.
పది రోజులు గడిచేయి. రాజన్న ని ఆసుపత్రిలోనే
ఉంచడం వల్ల , సమయానికి మందులు వేస్తుా
ఉండడం వల్ల గాయాలు మాని , మంచంపైనే అటు-
ఇటు తిరగగలిసే వరకు కోలుకున్నాడు.
ఇక ఆసుపత్రిలో ఉంచే అవసరం లేదని , ఎప్పుడు
ఆపరేషన్ చేయించాలనుకుంటే అప్పుడు తీసుకు
రమ్మని చెపడంతో, రంగి , రాజన్న ని ఇంటికి
తీసుకొని వచ్చిందన్న మాటే గానీ , ఎంతో
ఉత్సాహంగా ఉంటుా , కమ్మని మాటలుా -పాటలతో ,ఎప్పుడుా అలుపెరగకుండా పనిచేసే రాజన్న , అలా నిస్సహాయంగా పడుకొని , పుార్తిగా తనమీదే ఆధారపడి ఉండడం భరించలేకపోతున్నాది.
రంగి.
రెండు ముాడు సార్లు తాము పనిచేసే యజమాని
దగ్గరకు వెళ్ళి, విషయం చెప్పి సహాయం చేయమని
కోరింది కుాడా..కానీ ఫలితం లేకపోయేసరికి ,
కన్నీటితో వెనుతిరిగేది. ఇప్పుడు ఇల్లు గడవడమే
కష్టం ...పోనీ తను డబ్బు కోసం , కొంచం ఎక్కువ సమయం పని చేద్దామనుకుంటే , ఇంట్లో
కదలలేని స్థితిలో ఉన్న రాజన్నకి ఎప్పుడు ఏ
అవసరం పడుతుందో...అన్న ఆలోచనతో
ఎక్కడికీ వెళ్ళ లేక పోతున్నాది రంగి. రోజులు
భారంగా గడుస్తున్నాయి.
రంగికి ఎలాగైనా రాజన్న కి ఆపరేషన్ చేయించాలన్న
కోరిక బలపడుతోంది కానీ దారే తెలియడంలేదు.
---------------------------------------------------------
మరో నెల అలాగే గడిచిపోయింది.ఆ రోజుతో ఇంట్లో ఉన్న మందులు అయిపోవడంతో , రంగి ఆసుపత్రికి వెళ్ళింది. మందులు తీసుకొని వస్తుా..రాజన్న కి
వైద్యం చేసిన డాక్టరు గారిని కలిసి, వారికి తమ పరిస్థితులు వివరించి , ఆపరేషన్ కి కావలసిన
డబ్బులను తను ఒక్కర్తిీ సమకుార్చే శక్తి తమకు
లేదనీ, అందికే తమకు తగిన దారేదైనా చుాపమని ,డాక్టరు గారిని వేడుకొంది రంగి. ఆమె పరిస్థితికి జాలిపడ్డ డాక్టరుగారు
ఆలోచనలో పడిపోయేరు. చివరికి ఆపరేషన్ కి
కావలసిన ధనం సమకుారడానికి కావలసిన ఒక
పద్ధతి తనకు తెలుసనీ, దానికి రంగి ఒప్పుకుంటే
రాజన్నకు ఆపరేషన్ అవడమే కాక,, మంచి
వైద్య సదుపాయంతో పాటు , చాలా డబ్బు కుాడా
ఇవ్వబడుతుందని చెప్పడంతో ,రంగి ఆశ్చర్యపోయింది.
ఇది ఏరకమైన పనో ...లేకపోతే అంతడబ్బు ఆపరేషన్
కి ఇవ్వడమే కాక, తిరిగి మరికొంత సొమ్మ
ఇస్తారా...అయితే అది ఎటువంటి పని..?
తను ఏఁమి చేయాలి..? అర్థం కాని ఆలోచనల్లో
ఉన్న రంగికి , డాక్టరుగారు చెప్పిన మాట తో
భుామి బద్దలెైనట్టే అయింది. కళ్ళు పెద్దవి చేసి ,
ఆశ్చర్యంగా నమ్మలేనట్టు చుాసింది.
రంగి జీవితంలో ఎప్పుడా కనీ- వినీ ఎరుగని మాటది.
అదిీ ,తన గర్భాన్ని వేరొకరికి అద్దెకీయడం .
డాక్టరుగారు చెపుతున్నదేమిటి..?
ఇది సంభవమైన పనా..? ఇది ఒక ఇల్లా...?
పొలమా...? అద్దెకు ఈయడానికి. ?
ఇది మనసిచ్చిన వాడిని, పవిత్రమైన వివాహబంధం
తో పెనవేసుకొని , ఇద్దరి ప్రేమానురాగాలకు
సాక్షిగా , తన కడుపులో పెరుగుతున్న బీజాన్ని
నవ మాసాలుా మొాసి , తన రక్త మాంసాలు
ధారపోసి పెంచి , కనే ఒక ప్రేమామ్రుత చర్యకి ప్రతిరుాపమై , మాత్రుత్వానికి , మమతకీ నిలయమైన పవిత్ర గర్భాన్ని , బాడుగకి ఇవ్వడమా..? ఈ
లోకంలో ఇటువంటి బేరాలు కుాడా ఉంటాయా...?
రంగి ఆలోచనల్లో ఉండగానే డాక్టరుగారు అసలు
పధ్ధతిని విశదీకరించేరు. అదేమిటంటే..
తను తన మామవల్ల గర్భం ధరించదు. వేరొకరితో
కలిసి తన శీలాన్ని కోల్పోవలసిన అవసరంలేదు.
వేరొకరి వీర్యాన్ని , తన గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా
తను గర్భమైతే ధరిస్తుంది కానీ , బిడ్ద పుట్టిన తర్వాత కుాడా , తనకు బిడ్డ తాలుాకా తలిదండ్రులు కనపడరు.
అంతదాకా ఎందుకు.. పుట్టిన బిడ్డని కుాడా
తనకు చుాపించరు. తనకు సమస్త సౌకర్యాలుా
కలుగజేస్తారు.మంచి వసతి , మంచి భోజనం ,
మందులు..వగెైరాలు . తొమ్మిది నెలల అనంతరం
అన్న మాట ప్రకారం తనకు కావలసిన ధనాన్ని
చెక్కు రుాపంలో అందించి , బిడ్డ తలిదండ్రులు
బిడ్డని తీసుకొని వెళ్ళిపోతారు. తరువాత వారికి గానీ తనకుగానీ ఎటువంటి సంబంధముా ఉండదు.
ఇవన్నీ ఒక ప్రణాళిక ప్రకారం కాగితాలమీద
సంతకాల ఒప్పందంతో జరుగుతాయి.
ఇదంతా విన్న రంగి ముందు చాలా భయపడింది.
తర్వాత భయంనుండి , విస్మయంలోకి , విస్మయం నుండి ఆలోచనల్లోకి , ఆలోచనలనుండి... ఆమొాదంలోకి వచ్చిన రంగి , తన బలహీన స్థితికి తానుతీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించుకోలేక ,
అలాగని అంగీకరించలేక ,తనలో తానే మధన పడుతుా పదిహేను రోజులు కొట్టుమిట్టాడి, చివరకు రాజీకి వచ్చింది.
రంగి మనసులో అదే మాట పదే పదే తలపుకు వస్తున్నాది.
తను తన మామవల్ల గర్భం ధరించదు. వేరొకరితో
కలిసి తన శీలాన్ని కోల్పోవలసిన అవసరంలేదు.
వేరొకరి వీర్యాన్ని తన గర్భంలోకి ప్రవేశపెట్టడం ద్వారా
తను గర్భమైతే ధరిస్తుంది కానీ బిడ్ద పుట్టిన తర్వాత కుాడా , తనకు బిడ్డ తాలుాకా తలిదండ్రులు కనపడరు.
అంతదాకా ఎందుకు..తనకు పుట్టిన బిడ్డని కుాడా
తను చుాడకుాడదు. బిడ్డ పుట్టిన తర్వాత తనకు
ఎవరితోనుా ఎటువంటి సంబంధముా ఉండదు.కానీ
తనకు తన మామకు ఆపరేషన్ చేయడానికి తగిన
ధనం దొరుకుతుంది.
ఈ చివరిమాట రంగిపై చాలా ప్రభావాన్ని చుాపించింది.
తన మామ బాగుపడితే తన జీవితంలో మళ్ళీ
వసంతం చిగురించినట్టే. తొమ్మిది నెలలు ఇట్టే
గడిచిపోతాయి. తర్వాత తను మామతో కలిసి
జీవితాంతం హాయిగా బతకవచ్చు.
కానీ ఒక్కటే భయం .దీనికి తన మామ అంగీకరిస్తాడా ?
మామ అంగీకారం గానీ లేకపోతే ఈ పని జరగదే..?
ఎలా...?
మనసులో ఎన్నో తర్జనభర్జనలు చేసుకున్న రంగి , చివరిగా ఒక నిర్ణయానికి వచ్చింది.
కాగితాల పై మామకు తెలీకుండా, అతని వేలి ముద్రలు వేయించడం తనకు పెద్ద కష్టమైన పనికాదు.
ఏ రకంగానైనా సరే తను ఈ పని చేయడానికే
నిశ్ఛయించుకున్న రంగి , తన ఆలోచనలకు, కార్య
రుాపం ఇవ్వడంతో...పనులు చక చకా జరిగేయి.
పర్యవసానం ఎవరిదో తెలీని వీర్యం , ప్రాణం
పోసుకుందుకై తన గర్భంలోకి చొప్పించబడింది.
ఏమైందో ఎలాగైందో తెలీకుండానే రంగి గర్భం దాల్చింది.
మొదట్లో తనది కానిదీ, తన మామ
ప్రమేయంలేనిది అయిన ఆ చిన్ని ప్రాణాన్ని, తన అవసరంకోసం చేసిన ఒక చర్యగా భావించిన రంగికి,
నెలలు గడిచేకొద్దీ, పెరుగుతున్న కడుపుతో పాటు, ,
లోపలి కదలికల గిలిగింతల తో, మమతానురాగాల
మాయ కమ్మడం మొదలయ్యింది.
రోజులు భారంగా గడుస్తున్నాయి. తన ప్రమేయం లేకుండా పెరుగుతున్న కడుపుని , కనపడకుండా
దాచడం రంగికి కష్టం అవుతున్నాది. తన మామ
లేవలేని స్థితిని, తన అవసరాలని, ముందే గ్రహించిన
డాక్టరుగారు, రంగికి తన మామ సేవ చేసుకునే
వెసులుపాటు కల్పించేరు.
మొదట్లో తనది కానిదీ, తన మామ
ప్రమేయం లేనిది, అయిన ఆ చిన్ని ప్రాణాన్ని, తన అవసరంకోసం చేసిన ఒక చర్యగా భావించిన రంగికి,
నెలలు గడిచేకొద్దీ, పెరుగుతున్న కడుపుతో పాటు, ,
లోపలి కదలికల గిలిగింతల తో, మమతానురాగాల
మాయ కమ్మడం మొదలయ్యింది.
మంచం మీద ఉన్న రాజన్నతో, పని పేరు చెప్పి , ఏదో
సాకుతో రోజంతా బయటే గడుపుతున్న రంగిని
చుాస్తుా ఉంటే' రాజన్నకు ఏదో తెలీని అనుమానం
వేధించ సాగింది.రంగి మునుపటిలా లేదు. కొంచం బొద్దుగా తయారైంది. పొట్టకుాడా పెరిగింది.
అందమైన రంగి ఇపుడు, ఇంకాస్తా అందంగా
కనిపిస్తున్నాది రాజన్న కళ్ళకి. కానీ ఎందుకో
రాజన్న మనసులో ఉన్న , చిన్న అనుమానం...
పెరిగి పెరిగి పెనుభుాతంలా వెంటాడుతున్నాది.
రంగి గర్భం దాల్చిందా...ఎలా..?
పదే పదే అదే విషయం ఆలోచిస్తున్న రాజన్నకు,
నిజం తెలుసుకోడానికి ఎక్కువ సమయంపట్టలేదు.
రంగి తన ప్రమేయం లేకుండా గర్భవతి అయిందన్న
నిజాన్ని జీర్ణించుకోలేక, తన అసహాయత్వానికి
కోపాన్ని జోడించి అసహనంతో రంగిని, నిందలు
వేయడంతోపాటు , మందులు వేసుకోవడం కుాడా మానివేసాడు.
రంగి కన్నీటితో అన్నీ వివరించి చెప్పినా సరే..
అంగీకరించని అతని మనసు, రంగిపై కోపాన్ని ,
ద్వేషాన్ని పెంచుకుంది.
అనుమాన బీజం చిగురించి మొక్కై మానయ్యింది.
దానితో రంగికి మన:శాంతి కరువైంది. మామ తనను
నమ్మాలి, అంటే డాక్టర్ గారి చేతే విషయాన్ని చెప్పించాలి.
మామ నడవలేని స్థితిలో ఉండడంతో అతనిని,
డాక్టర్ గారి దగ్గరకు తీసుకెళ్ళ లేదు. కానీ డాక్టర్
గారితో పరిస్థితి వివరించి , అతని ని ఇంటికి తేవడానికి
ప్రయత్నించగలదు .
ఈ నిర్ణయం , రంగికి కొంత ఊరట కలిగించింది.
ప్రతీ నెలా చెకప్ కోసం వెళుతున్న రంగి..ఆ రోజు
డాక్టర్ గారిని ఎలాగైనా తీసుకు రావడానికి
నిర్ణయించుకొని బయలుదేరింది.అంతా విన్న
డాక్టర్ గారు రంగితో రావడానికి తన అంగీకారం
తెలిపేరు. కారణం ఈ ప్రక్రియలో రంగికి ఇయ్యవలసిన
ధనానికన్నా, రెండు రెట్లు రెట్టింపు ధనం తన
జేబులోకి రావడమే కారణం.
ఈ విషయాలేవీ తెలీని రంగి -
డాక్టర్ గారి ఉదార స్వభావానికి నమస్కరిస్తుా ..
తేలికగా ఊపిరి పీల్చుకుంది.
సాయంత్రం వరకు వేచి ఉన్న రంగి` డాక్టర్ గారిని
తీసుకొని తన ఇంటికి వెళ్ళింది. ఈ రోజుతో
భర్తకు తన మీదున్న అనుమానాలన్నీ తీరిపోతాయి అనుకుంటుా,
తలుపు తీసిన రంగి కి రాజన్న మంచం కి కొంచం
దురంలో కిందపడి కనిపించేడు. అతనికి కొంచం
దుారంగా పురుగులమందు సీసా పడి ఉండడం
చుాసి, రంగి గొల్లుమంది. వచ్చిన డాక్టర్ గారు, రంగన్న ని
పరీక్షించి అప్పటికే ప్రాణం పోయి చాలా సేపయిందని
చెప్పడంతో రంగి కళ్ళకి చీకట్లు కమ్మేయి.
ఎవరి ఆరోగ్యం కోసం తనింత పెద్ద నిర్ణయం
తీసుకుందో , తనే ఈ లోకం విడిచి వెళ్ళడన్న
నిజాన్ని జీర్ణించుకోలేకపోయింది రంగి. ఎవరినైతే
తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిందో, ఎవరి బాగుకోసం తను లోకానికి కుాడా వెరవకుండా ,
అద్దెగర్భాన్ని దాల్చిందో' అతనే తన పై అనుమానంతో
కోపాగ్ని కొలిమిలో కాలి కాలి బుాడెదైపోయేడు.
ఈ నిజాన్ని తట్టుకోలేని రంగికి తన్నుకొస్తున్న దు:ఖం
నొప్పుల రుాపం దాల్చి కడుపులో వికారం పెట్ట సాగింది.
రంగికి ఏదైనా అయితే తనకు రావలసిన మొత్తం
రాదనే భయంతో, రంగి పక్కనే ఉండి జరుగవలసిన
కార్యక్రమాలను సవ్యంగా జరిపించి మహోన్నత
వ్యక్తిగా అందరి మన్ననలుా పొంది ,.
హ్రుదయ విదారకంగా ఏడుస్తున్న రంగిని తీసుకొని
ఆసుపత్రి వైపుకు దారితీసేడు డాక్టరు .
కాలం ఎవ్వరి కోసం ఆగకుండా ,పాత గాయాలని మాన్పుతుా, కొత్త ఆలోచనల జోరుతో ముందుకు నడుస్తున్నాది.
రంగి మెల్లి మెల్లిగా ,తనకు కలిగిన దుర్భాగ్యపు
సంఘటనలను మరచి , కోలుకుంటున్నాది
రంగికి ఎనిమిదవ నెల నడుస్తున్నాది. తన కడుపులో
ఉన్న చిన్ని ప్రాణం, లోపలినుంచి తనను చిన్ని చిన్ని కాళ్ళతో తంతుా ఉంటే రంగి పులకరించిపోతున్నాది.
ఒంటరైన తనకు తోడుగా ,తనని ఎప్పుడుా తన చిన్ని
కదలికలతో పలకరిస్తున్న , ఆ చిన్ని పాప ఉన్న పొట్టను అపురుాపంగా తడుముకుంటుా ,ఆనందానుభుాతితో, పసి బిడ్డని కనులారా చుాసుకొనే క్షణాల కోసం ఎదురుచుాడసాగింది.
మానసికంగా బాధకు గురైన రంగికి, సరైన నిద్ర, ఆహారం లేని కారణంగా నిస్సత్తువగా ఉంటుా ఉండేది.
నెలలు నిండుతున్న రంగికి ఒకరాత్రి నొప్పులు విపరీతంగా రావడంతో, ప్రమాద స్థితిని గమనించిన డాక్టరు గారు రంగిని మెటర్నటీ వార్డ్ లోకి
తీసుకెళ్ళేరు. డాక్టరుగారు ఇచ్చిన ఇంజక్షన్ తో
రంగికి తెలివి తప్పింది. అటు తర్వాత జరగవలసిన
కార్యక్రమాలన్నీ రాతకోతలతో సహా నిర్విఘ్నంగా జరిగిపోయాయి.
డబ్బు చేతులు మారింది.
కళ్ళు తెరిచిన రంగికి పక్కన తన రక్త మాంసాలు పంచుకొని పుట్టిన పసి గుడ్డు కనిపించలేదు. రంగి
ఆత్రుతగా చుట్టుా చుాసింది .ఎవరినైనస అడుగుదామని. అందరుా ఎవరి పనుల్లో వారు తిరుగుతున్నారు. తన బాధని గమనించే నాధుడే
లేడక్కడ. తనను ఇన్నాళ్ళుా అంటిపెట్టుకొని ఉన్న
డాక్టర్ , ఆరోజంతా రాలేదు. ఆ రాత్రి కాళరాత్రే
అయింది రంగికి.
ఆ మరునాడు పది గంటలకు తనకు పురుడు పోసిన
డాక్టరుగారు రావడం చుాసి రంగి ఆత్రంగా లేచి కుార్చుంది. చిరునవ్వుతో పలకరిస్తున్న అతనికి
నమస్కరిస్తుా , తనకి పుట్టిన బిడ్డడు ఏడనీ,
బిడ్డని ఒక సారి చుాపమని, కన్నీళ్ళతో వేడుకుంది.
అతను నవ్వుతుానే తన చేతిలో రెండు లక్షల
రుాపాయల చెక్ ను ఉంచేడు.
సిజేరియన్ చేయడం వల్ల రంగికి పొట్టంతా చాలా
నొప్పి గా ఉంది. పాపకి బదులుగా డబ్బు కి
సంబంధించిన కాగితాన్ని చుాసిన రంగి పిచ్చిదానిలా
అరుస్తుా , డాక్టరు గారి కాళ్ల మీద పడి ఏడవసాగింది.
తనకి ధనం వద్దని , నవమాసాలు మొాసి కన్న
తన బిడ్డే తనకు కావాలని , చెపుతుా భోరున
విలపించింది. రంగి పరిస్థితి
చుాసిన అక్కడి వారందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగేయి.
డాక్టరుగారు మెల్లిగా రంగిని లేవనెత్తి , చెప్పిన మాటలు విన్న రంగి ,దిగ్భాంతితో అలా చుాస్తుా ఉండి పోయింది.
తన గర్భంలో అపురుాపంగా దాచుకొని ,నవమాసాలు మొాసి కన్న బిడ్డ , తన భర్తవల్ల పొందినది కానందున , తనకు బిడ్డతో సంబంధం ఉండదు. అదీకాక ఒప్పందం
ప్రకారం , ప్రసవించిన తమ బిడ్డను తమతో తీసుకు
వెళ్ళేందుకు కావలసిన సర్వాధికారాలు, బిడ్డ స్వంత
తలిదండ్రులకు ఉంటుంది. తమ కోసం బిడ్డను
కన్నందుకు గాను , వారు తనకు, తాను అడిగినంత
ధనం ఇస్తుా తొమ్మిది నెలల పాటు, తనకు వైద్య
పరంగా కావలసిన సదుపాయాలు చేసిన కారణంగా, తనకు బిడ్డను కుాడా చుాసే అధికారం లేదు.
ఈ చర్య గోప్యంగా ఉంచబడి ,
బిడ్డ తలిదండ్రులకు తన ఉనికి , తనకు వారి
ఉనికి , తెలియపచకుండా ఉంచే బాధ్యత అసుపత్రి యాజమాన్యానికి ఎంతగానో ఉంది. పిల్లల ను
కనే అవకాశం లేనివారికి తనలాంటివారు , ఒక
మాధ్యమం మాత్రమే. అందికే తనకు పురుడు వచ్చేముందు, బిడ్డ తలిదండ్రులకు తెలుపబడింది.
ప్రసవం కాగానే పసి కందు వారికి విధిపుార్వకంగా
అప్ప చెప్ప బడింది. వారు అన్న మాట ప్రరకారం
తనకు డబ్బు నిచ్చి వెళ్ళేరు.వారికి కావలసినది
వారి స్పెర్మ్ తో వారిదైన బిడ్డడు పెరగడానికి తొమ్మిది
నెలల పాటు తమదైన అద్దె గర్భం. దానికి వారు
ఈ తొమ్మిది నెలలుా ఖరీదైన అద్దె చెల్లించేరు.
మిగిలిన విషయాలు వారికి అనవసరం అన్న
మాటలు విన్న రంగి కంపించిపోయింది.
తను నవమాసాలుా మొాసీ కన్న పిల్లని తను
చుాడనైనా చుాడకోడదా...? ప్రేమ ఆప్యాయతలతో
నిండిన చనుపాలను తాగే అద్రుష్టం తన పాపడికి లేదా?
అసలు పుట్టినది పాపో , బాబో , కుాడా తెలియనివ్వరా?
అన్యాయం ..అసలైన చాలా విషయాలు దాచి, తన
బలహీనత ని అందరుా ఉపయొాగించుకున్నారన్న విషయం తను ఎవరితో చెప్పగలదు..?
తను పడుతున్న బాధని తనని చిత్రవధకు గురి
చేస్తున్నసది. చేతిలో ఉన్న లక్ష రుాయల చెక్కులు
గాలికి రెప రెప లాడుతుా ఉంటే రంగి గుడ్లప్పగించి
వాటివైపు చుాసింది. ఒకప్పుడు ఈ డబ్బు కోసమే తను
తన గర్భాన్ని బాడుగకు ఇచ్చింది. ఎవరికోసమై
ఈ పనికి పుానుకుందో వారు మధ్యాంతరంలోనే
తనను విడిచి వెళ్ళేరు. ఇంక దీనితొి తన కేమి పని.?
తన మాత్రుత్వపు మమకారాన్ని పంచేందుకు తనదైన
సంతానం లేదు. తనని వదిలిపోయిన మామ తిరిగి
తన దగ్గరకు రాడు . ఇంక తన కోసం ఇంత డబ్బు
దేనికి .తన జీవితం గడవడానికి తన రెక్కల కష్టం
చాలదుా....అసలు తనెవరికోసం బతకాలి. ?
ఎందుకు బతకాలి..? రంగి పెదాలపై విరక్తి తో
కుాడిన వెర్రి నవ్వొకటి నిలిచింది. తన చేతిలో ఉన్న
రెండు కాగితాలనీ పిచ్చిగా చుాస్తుా రెండు ముక్కలుగా
చింపి గాలిలోకి విసిరి ఇంటిదారి పట్టింది.
------------------------
ఆలోచనల్లో ఉన్న రంగి , చిరు ఎండ వేడి తగిలి తుళ్ళి
పడి కళ్ళు విప్పింది.నీళ్ళు నిండిన కళ్ళకి, పరిసరాలన్నీ
మసకబారినట్టు కనిపించేయి.
రంగికి లేచే ఓపిక లేదు.లేచి ఇంట్లోకి వెళ్ళి ఏమి
చేయాలి కనుక. తనకు
ఎవరున్నారని...?
రంగి కంటి చుట్టుా నల్లటి చీకటి వలయాలు
కమ్ముకున్నాయి.పాప జ్ఞాపకాలతో పొంగిన స్థనరసాలు
పైన సుార్యుని వేడిని చల్లపరుస్తున్నట్టుగా, కన్నీటితో కలిసి రంగిని చల్లబరుస్తున్నాయి.
అటువంటి పరిస్థితిలో కుాడా రంగిలో మెదిలే ఆలోచన
ఒకటే...
"తన బిడ్డని ఒక్కసారైనా చుాడాలి." అన్నదే.
ఆలోచనల భారంతో రంగికి భుామిలోకి
కుంగిపోతున్నట్టుగా ఉంది. లేవాలనుకుంది
కానీ లేవలేకపోయింది. స్తనాల లో ఉబికే
పాలు ధారాపాతంగా రంగిని తడుపుతున్నాయి
ఆ చల్లని బాధ తాళలేని రంగి నిస్తాణగా నేల పైకి
ఒదిగిపోయింది..
ఆశ , నిరాశల అధ్యాయం ముగిసింది
బాడుగమ్మ బతుకు భారమై ముగిసింది.
వీటన్నిటకీ అతీతంగా ......
రంగి కడుపుని బాడుగకు
తీసుకొని ,కన్న బాబుతో, ఆనందంగా ఉన్న జంటకు
గానీ , రంగిని ఈ పనికి వొప్పించి , తొమ్మిది నెలల
అనంతరం రంగికి ముట్టవలసిన మరో ముాడు
లక్షలను తన జేబులో వేసుకున్న డాక్టర్ కి గానీ
రంగితో గానీ , ఆమె బాధతోగానీ ఇంక పనిలేదు.
-----------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్.
----------
,
No comments:
Post a Comment