తొలి వలపు .
___________
చిరు నవ్వుల వన్నెల సిరి సీతను చూచీ
సిరి వెన్నెల సిగ్గు పడెను కాంతులు బాసి॥
తరగని వన్నెలు కోమలి ముఖమున గాంచీ
నెలరాజే నీరసపడే కళలను బాసి !॥
చారెడు కాటుక కన్నుల సొగసులు చూసి
ముకుళించెను కలువ భామ ,మూతిని ముడిచి॥
విలుబోలిన కనుబొమ్మల విరుపును చూచి -
శరము----
కనుపాపల చిక్కు పడెను వింటిని బాసి !॥
ఎరుపెక్కిన పెదవులు రస మధురిమ లిడగ -
-ముద్ద----
మందారములూసులాపే మనసు మూగగ॥ -
కలికి
పలువరుసల మెరపులు చిరు కాంతులీనగా-
దాగె
ముత్యపు సరులన్ని సాగరాన చాటుగ !॥
వాలు జడల కురుల సఖులు నాట్యము లిడగ - తాచు
పాములు కుబుసములు విప్పే జతను చేరగ - ॥
చెదరు
ముంగురులే భ్రమరములని భ్రమసి ప్రేమగ-॥
కమల
ముఖ కన్నియ కళలు విడెను మధువు పంచగ !॥
బంగరు వన్నెల కోమలి సొగసులు చూచి
పచ్చాని చేమంతి ఒదిగే రేకులు ముడిచి -
ఇంతి
కుచ కుంభములంటు జారు పైటను చూచి
సిగ్గు పడెను శిఖరములే బిగువులు బాసి ॥!
పొలది మేని కులుకులు పలు కళల తేలగ -
మింట
హరివిల్లులె హొయలు వీడె గుండె బరువుగ॥
ఊయలలా ఊగు నడుము జిలుగులు చూచి -
దాగి
సంభ్రమాన చూచె లతలు గుసగుసలాపి !॥
మల్లెలు, జాజులు మేలిమి ముసుగులు వేసే -
ముద్దు
ముచ్చటలిడు మృదు పదముల జాడలు చూచి - ॥కలికి
నడకల నిడు నవ రసముల భంగిమ చూచి -
నెమలి
కన్నియలె నివ్వెరపడే నాట్యము మరచి !॥
అంతలో ........
అందానికి బంధము పడె ,అడుగు తడబడె -॥
అదురు-
బెదురు కనుల చూడ్కుల అలివేణి నిలబడె- ॥
చెదరు-
సౌందర్యపు రాశి కనులు సిగ్గు లోలికెగా -
నవ-
మన్మధ సుందరుని రామ చంద్రుని గాంచిీ !॥
తోలి వలపుల చూపుల తూపులను నిలుపగ -
పూల-
శరములు విడే మన్మదుడదే మంచి క్షణముగ -॥
సీతా -
రాముల కళ్యాణ మిలను కనులు పండగ -
ప్రక్రుతి-
పడతి సఖులు సహజ రీతి కళలు నిండేగ !!
-----------------------------------------------------
రచన -
పుల్లాభట్ల జగదీశ్వరీమూర్తి .
కల్యాణ్.
No comments:
Post a Comment