Monday, April 6, 2020

కవిత కాని కధ

"శీర్షిక ..
కవిత కాని కధ.
"థేంక్యుా కరోనా.."
---------------------
"అమ్మాయ్ స్నానం చేసి 
వంట చేయమ్మా...
ఆ దేముడికి కాస్తా 
దీపం పెట్టి ధుాపం వేసి
కొంచం నైవేద్యం పెట్టు.
ఇంటికి చాలా మంచిది."
"నానీని  బయటి నుండి రాగానే
కాళ్లుా చేతులుా సుభ్రంగా 
కడుక్కో మనమ్మా।
చీడ- పీడా కదుా..
ఏం తొక్కి వచ్చేడో ఏమొా.."
"బట్టలు మార్చుకొచ్చేక
అన్నం పెట్టమ్మా..
అవతల దుమ్ము ధుాళి లో
ఆడి ఆడి వచ్చేడు.
క్రిములన్నీ వాడి బట్టల పైనే
ఉంటాయి .అనారోగ్యం కదా.
ఇదుగో అమ్మాయ్..."

ఆబ్భ బ్బ బ్బ బ్బ..
రోజుా ఇదే గోల మీతో...
భరించలేక పోతున్నాను.
మడి ,తడి ,పొడి..అంటుా..
వెధవ చాదస్తం..వెధవ 
చాదస్తమా అని...
అరుపు, విసుగు, నిర్లక్ష్యం 
గోల,  గోల ,గోల....

అటుా ఇటుా అసహనంగా
కదులుతుా గబుక్కున 
లేచేడు నానీ...నిద్ర నుండి.
చుట్టుా చుాసేడు...
అవతలి నుంచి "అమ్మ" 
అరుస్తున్నాది.
"నానీ ।..లేచి సబ్బుతో
సుభ్రంగా చేతులు కడుక్కురా.
ఆ పక్క మీది బట్టలు విప్పి
ఉతికిన బట్ట లేసుకురా..
టిఫిన్ తిందుాగాని.."
"బయటకు వెళ్ళకు.
ఎవరొచ్చినా  దుారంగా 
నిల్చొనే మాట్లాడు.
కలగా పులగం అయ్యి 
కాకెంగిళ్ళు అంటుా తినకు..".
"రేయ్.నానీ....నానీ....
నానీ..వింటున్నావా...?"
పొద్దుటి నుంచి అలా 
అరుస్తునెే ఉంది "శాంతి."

నానీ.ఆలోచిస్తుా మౌనంగా
అమ్మ చెప్పినవన్నీ చేస్తున్నాడు.
ఎప్పుడుా లేనిది,ఈమధ్య
అమ్మ కుాడా చాలా సుభ్రతలు
పాటిస్తున్నాది. "కరోనా" భయంతో...
రోజుా టి.వి ల్లో సుభ్రతల మీద
ఎంతమంది మాట్లాడుతున్నారో
"కరోనా"..వైరస్ ప్రమాదమైనదట.
సుభ్రత లేకపోతే మనని ఆక్రమిస్తుందట...
చంపేస్తుందట..మహమ్మారట..."

ఇవే మాటలు నానమ్మ చెప్పేది.
కానీ అమ్మ వినేది కాదు. సరికదా,
రోజుా కసురుకుంటుా...
ఛాదస్తం భరించలేనంటుా
 విసుక్కుంటుా..
 విరుచుకు పడుతుా...
నానమ్మని వ్రుద్ధాశ్రమంలో
వదిలే దాకా నాన్న ని పోరింది.

పాపం..నానమ్మ...చెప్పినట్టు
చాలా మంది చెప్పినట్టున్నారు
ఆశ్రమంలో ఎంత మంది నానమ్మలో...
ఆలోచిస్తుా...
నానీ అమ్మ చెప్పినవన్నీ చేసేడు.
రెడీ అయ్యి , బయటకు వచ్చేడు.
అమ్మ నాన్నకు టిఫిన్ పెడుతున్నాది.
నాన్న దగ్గరగా వెళ్లేడు..
నాన్న...బయటకు వెళ్ళాలి..అన్నాడు.
ఎక్కడికిరా..? అన్నాడు నాన్న..
"అమ్మను ఆశ్రమంలో వదిలి వద్దాం.
అమ్మ కుాడా నానమ్మ లాగే 
రోజుా అరుస్తున్నాది.
సుభ్రత, మడి, దుారం...అంటుా..
నాకు విసుగొస్తున్నాది...
అమ్మ ఇక్కడొద్దు..."

నానీ మాటలు విన్న శాంతి
కళ్ళ ల్లో గిర్రున తిరిగిన కన్నీళ్లు.
చటుక్కున లోపలికెళ్ళిపోయింది.
తలవంచుకున్నాడు నాన్న.

ఐదు నిముషాల్లో తయారై 
వచ్చిన శాంతి "పదండి ---
అత్తయ్యను ఇంటికి తీసుకువద్దాం "
అంది.
నాన్న కళ్ళల్లో ఆశ్చర్యం ..
అమ్మ ముఖంలో పశ్ఛాత్తాపం..
నానీ కళ్ళల్లో ఆనందం..
ముగ్గురి మనసుల్లోనుా
ఒకటే మాట..థేంక్ యుా---
       "  కరోనా."
       ----------------
రచన , శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
----------------------

No comments:

Post a Comment