Monday, April 6, 2020

జయం మనదే...(పాట)

జయం మనది"..పాట.
------------------------------
పల్లవి:
జయం మనది జయం మనది
కలతపడకు సోదరా ...
కట్టడి చే" కరోనా" ను  ఖండిద్దాం సోదరా॥

అనుపల్లవి:
పరదేశపు పాప కణం ," కరోనా "పిశాచినీ
తరిమికొట్ట మనమంతా పాటిద్దాం సుభ్రతని॥
                 ॥జయం మనది, జయం మనదీ....॥

చరణం 1.:
నియముల పాటించి, మనము పద్ధతెరిగి మసలుదాం....
మన సంస్క్రుతి- సాంప్రదాయ, విలువలనే  పెంచుదాం-
చప్పట్ల సడుల "కరోనా" ను కలవర పెడదాం......
కోట్ల -జ్యోతులెలిగించీ సమైక్యతనె చాటుదాం.॥
                                                 ॥జయం మనది॥

చరణం 2:
సామాజిక దుార నియమ నిబంధనలు పాటిద్దాం
""స్వశ్వశ్ఛమైన భరతావని" మనదేనని చాటుదాం.
మన "మొాదీ "గౌరవాన్ని  కలసి-మెలసి నిలుపుదాం
ఐక్యమత్య బలముతో  "కరోన" నంతమొందిద్దాం.॥
                                              ॥ జయం మనది॥
చరణం 3.:
"మందు లేని మహమ్మరిని " మట్టుపెట్టి చుాపుదాం-
మనిషి ,కానరాని మంత్ర మేసి రోడ్ల  తిప్పుదాం.-
మన వారిని కుాల్చినట్టి "కరోనా"ను కాల్చుదాం.
కసిగ తర్పణాలు విడిచి శాంతి గీతి పాడుదాం.॥
                                              ॥ జయం మనది ॥.
-----------------------

రచన , శ్రీమతి ...
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
8097622021.
---------------------

శీర్షిక .
"లాకౌట్ "
ఒక-
నిర్విరామ "శస్త్రం".
-----------------------
కాల సర్పమై" కరోన " కాటేసెను క్షణ- క్షణం.
వేల జనుల ప్రాణాలె హరించి నట్టి దీ కణం.॥

కంటనీరు కట్టని జను లార్తి దీర్చ అందరం.
కలిసి జేయు యుద్ధములో, "లాకౌట్" ఒక అస్త్రము॥
"కరోన "రక్కసిని తరిమే నిర్విరామ శస్త్రము॥

బలిదానపు  సాహసం సఫాయి కర్మ చారులదే
కోవిడ్ రక్కసి నణచే  సేవా నిరతి  వైద్యులదే
రక్షకభటు లాచరించు విధులు  విశ్వ శాంతికి లే
కరోన వ్యాధి కెదురొడ్డి పోరాడు ,జయం మనదే॥

పరిధులనే దాటి నీవు పెంచకు మరణాలనుా,
కుండె కోత , కడుపు కోత నిండెడు శాపాలనుా,
కట్టుబాట్ల సంయమమును విడకు సంఘ హితునిగా
బాధ్యతగా వ్యవహరించు భరత దేశ పౌరునిగా॥

బలిదానపు  సాహసం సఫాయి కర్మ చారులదే
"కోవిడ్ "రక్కసి నణచే  సేవా నిరతి  వైద్యులదే
రక్షకభటు లాచరించు విధులు  విశ్వ శాంతికి లే
"కరోన "వ్యాధి కెదురొడ్డి పోరాడ జయం మనదేలే॥
---------------------------------
రచన ,శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర).
8097622021.
---------------------

No comments:

Post a Comment