ఓ వింత రోగ మైన ఓ కరోనా...
ఈ వింత వ్యాధి కంతమెపుడు కరోనా..
నీ పేరు లోనె ఉన్నదిలే రోనా ....
పాప మేమి చేసినాము కరోనా..॥
పరదేశపు పాపమా... మాదేశపు శాపమా
చీడపట్టినట్టి అంటు రోగమా, పిశాచమా...॥
మనిషి దగ్గరౌతే తగులు "కరోనా"
ఓ మనిషి దగ్గి , తుమ్మ నంటు "కరోనా"
మాస్కు లేని మాట చోట వ్యాప్తి చెందు "కరోనా"
దీని తస్సాదియ్యా మందు లేని
మాయలాడి ఘరానా....కరోనా....
ఓ............॥
నీ రాకతోనె ఇళ్ళ తలుపు లేసి నాము బెదురుగా
నీ రాక మాకు శాపమయ్యె , కంట నీరెగా
దారులన్ని ముాతబడెను నీదు కాన్కగా
మా బతుకులె బరువాయె గదా నీవు సోకగా..॥
చప్పట్ల మంత్ర మేసి నాము నిన్ను తరమగా
మా యింటి దీపాలార్పి నాము పారద్రోలగా
సిగ్గు యెగ్గు లేదు నీకు మమ్ము చేరగా
నీ పాలినబడి బతుకులె బలి చేసినాముగా ॥
మంది, గుంపు, మరణాలె. పసందు నీకుగా
అర్పించినాము అతిధి వైన నీకు విందుగా...
ఆ మరణాలకు జ్యోతులు .వెలిగించినాము నివాళిగా
ఛీత్కారపు నిరసనలను తెలిపినాము నీకెగా
ఓ......॥
---------------
రచన శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహరాష్ట్ర
-----------*--------------
No comments:
Post a Comment