ఈ నాడు మనని నిర్బంధనాల పాలుచేసిన
"కరోనా" కణపు, విషపు దాడిని ఎదుర్కోవడనికి
శాంతి, సంయమనాలని పాటించడమే మన కర్తవ్యం.॥
లాకౌట్ నిబంధనల నియమాలను పాటిస్తుా ,
నిర్మానుష్య నగరం వీధుల్లో నిస్తేజమౌతున్న-
మహమ్మారి పతనానికి యుధ్ధ వలయాన్ని సిధ్ధం చేద్దాం.॥
ఎందరినో కాటేసి ,ఎన్నో జీవితాలను నిర్వీర్యం చేసిన-
"కరోనా "రక్కసిని పారదోలేందుకు ,నిరసనల నినాదాల,
చప్పట్ల శరాల తో తుాట్లు పొడుస్తుా , చీకటిలో వెలిగించే ,సాముాహిక చిరుదివ్వెల కిరణాగ్నిశిఖల్లో
దగ్ధం చేద్దాం.॥
సముద్రంలో, బడబాలనంలా విజ్రుంభిస్తున్న
ఆ చీకటి రక్కసి, నిర్ఘాంతపోయేలా అందరి మాటా
ఒక్కటై అడుగేద్దాం.॥
కోట్ల కొలది , వెల్లువలా పొంగుతున్న ప్రజా శక్తి,
మమేకమై , దేశం లోకి చొరపడ్డ "పరదేశపు పాప పంకిలాన్ని" ,దేశ బహిష్కరణ చేద్దాం.॥
ఎన్ని అవాంతరాలొచ్చినా, మనమంతా "ఒకే మాట-
ఒకే బాట" గా సాగాలి.॥
మన ఆత్మ విశ్వాసమే మన ఆయుధం.॥
మన సంఘటిత సహన శక్తే , మనకు సహకార వైద్యం.॥
మనం పాటించే గ్రుహ నిర్దంధమే ,
మనం మరొకరికి చేసే మహోపకారం.॥
సాంప్రదాయ పధ్ధతుల ఆచార-వ్యవహారాల-
ఆచరణా విధానమే, మన ఆరోగ్య జీవనానికి
అసలై ఔషధం.॥
భగవంతుని శ్రుష్టిలో, అతి తెలివైన జీవి మనిషి.॥
ఏ పరికరాల అవసరంలేని అవయవాస్త్రాలతో ,
ఆత్మస్థైర్యం నిండిన గుండె నిబ్బరంతో,
కష్ట- నష్టాలను అధిగమించే బుద్ధి-బలంతో..,
అంతరిక్షానికి నిచ్చెనలు వేయగల విలక్షణ-విజ్ఞానంతో
శ్రుష్టికి ప్రతి-శ్రుష్టి చేయగల, మేధా-సామర్ధ్యంతో,
ఎన్నో విజయ పతాకాలను ఎగరవేసిన
మహా మనీషి మనిషి.॥
ఎన్నో కఠినమైన అవరోధాల నొడ్డి,
" కరోనా" వంటి -ఎన్నో ఋగ్మతలను , అవలీలగా గట్టెక్కించగలిగే ."వైద్య విధాన పరిశోధనాశాస్త్రం" లో ప్రజ్ఞ "కలిగిన ప్రధాన శాస్త్రవేత్త మనిషి. ॥
ఎన్నో భీబత్సవాలను ఎదుర్కొంటుా, వాటికి
ఎదురొడ్డి ,పోరాడగలిగిన సామర్ధత గల, విశ్వ వీర యొాధుడు మనిషి.॥
జీవితానుభవాల తుఫానుకు వచ్చిన ఒరవడిలో,
విపత్కర పరిస్థితులలో ఎదురైన, కష్ట- నష్టాల చిక్కుముడులను ,.అదరక- బెదరక నేర్పుతో -విడదీసుకొని ముందడుగు వేసే ...సమర్ధత గల
సాహస ధీరుడు మనిషి.॥
అటువంటి మహత్తరమైన మనిషి జన్మ పొందిన మనం, ఈ నాటి "కరోనా "ధాటికి తట్టుకో లేమా...?
పెనుగాలి వీచినపుడు వంగి ఉన్న మహావ్రుక్షమే
ఉధ్రుతం తగ్గగానే తలెత్తుకు నిలబడగలుగుతుంది.॥
కష్టం వచ్చినపుడు మనిషి సంయమనాన్ని పాటించినపుడే కష్టాల్ని అధిగమించగలడు.॥
ఆ కష్టం కుటుంబ పరమైనదైనా , సామాజిక పరమైనదైనా , కరోనా వంటి విషపు కణాల
విలయ తాండవానిదైనా...॥
అందికే నిరాశ పడకుండా , మనోధైర్య - సాహసాలతో ,శాంతియుత పోరాటాన్ని -కొనసాగించండి॥
చివరకు
"విజయం మనదే".
------------------------
రచన, శ్రీమతి..
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------
No comments:
Post a Comment