ఎటు చుాసినా చెత్త,
ఎక్కడ చుాసినా చెదారం.
కుళ్ళు కాలువలు, డ్రైనేజ్ లు
పెంట కుప్పలు , బురద గుంటలు
వాటి మధ్య మధ్య జనాల నివాసం.
పెరుగుతున్న జనాలతోపాటు
కొండలౌతున్న పెంట కుప్పలు.
జనం జనం , చెత్త-చెదారం...
ఎన్నాళ్ళీ అసహ్యపు పోకడ.
కలుష్యపు కంపు నిండిన
కుప్పల్లో ఏదో రోజు
జరుగుతుంది విచిత్ర విధ్వంసపు
విష పుారిత" కణం" జననం
"కరోనా" పేరుతో కంటికి
కనిపించని వేగంతో విస్తరించి
మరీ చేస్తుందది మారణహోమం.
అందులో మాడి మసయ్యేది
తేడా తెలియని "నీ " "నా" జనం.
అ నుసి కలిసేది కుాడా గంగమ్మలో నే
అని తెలుసుకో లేని మనం.
స్వార్ధపుారిత ఆలోచనల
పాప ప్రక్షాళన ను.పారే నీటిలోనే
చేస్తాం నిరంతరం.మనం
మనం ..జనం...జనం.
కడుగు, కడుగు, కడుగు
కనీసం శరీరపు మురికైనా
వదులుతుంది. కానీ నీరు
పారేటట్టు చుాసుకో లేకపోతే
నిలిచిపోయిన నీటిలో
మరో కార్చిచ్చు కణం ఉద్భవిస్తుంది.
అదే నా భయం భయం భయం.
--------------------
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి
కల్యాణ్ (మహరాష్ట్ర ).
No comments:
Post a Comment