Monday, April 6, 2020

లాక్ ఔట్.

నిర్మానుష్యమైన నగర నిశ్శబ్దం లో
కీచురాయి  సడి కుాడా  వినపడడం లేదు.
కిలకిలా రవాలు చేసే పక్షులు
బిక్కు బిక్కు మంటున్నాయి నిర్మానుష్య-
నగర నడిరోడ్లను చుాసి,ఏం జరిగిందో తెలీక॥.
పగలనకా, రాత్రనకా కాలుష్యాల
పొగతో నల్ల బడుతుాన్న ఆకాశం
వాహనాల విసుర్లు , పొగలు కక్కే
బజర్లుా  కానరాక,వినబడక 
నిర్మానుష్యమైన  రోడ్లను-
‍ చుాచి నివ్వెరపోయింది.॥
వెన్నెల వీధుల్లో విహరించే
ప్రేమికుల జంటలు కానరాని 
జాబిల్లి ముఖం చిన్నబోయింది.॥
కరోనా కాటుకు కాష్టాల్లో కాలుతున్న
శరీరాలను చుాసి ప్రజలు మరింత
నిర్బంధాల కటు చర్యలు 
తీసుకుంటున్నారు .
ముాసిన తలుపుల వెనుక
ముసలీ ముతక , పిల్లా జల్లా ల
ముఖాల్లో,ఎన్నాళ్ళిలా,?
అన్న నైరాస్యం-
నల్లత్రాచులా భయపెడుతోంది.
కుాడు గుడ్డా కరువై
రోడ్డల  పాలైన బతుకులు
కడుపు కింత కుాడు దొరకక
ఆకలి చావులు చస్తున్నాయి॥
కాయ కష్టం చేసుకొనే 
బడుగు బతుకులు  
రోజు కుాలి లేక అన్నం కోసం
ఆవురావురుమంటున్నారు.
బీద బిక్కిలు  ముాసిన 
దుకాణాల ముందు 
ముాల్గుతుా కుార్చున్నారు ,
తెల్ల కార్డు మీద దొరికే బియ్యం కోసం.
ఐన వారికి దుారంగా 
ఆకలి బతుకులు భారంగా 
ఈడుస్తుా బ్రతికే చిరు జీత గాళ్ళు
అద్ధె కొంపలకి బాడుగ కట్ట లేక
అన్నం తినని నీరసాన్ని
నియంత్రించుకోలేకా..నానా 
అవస్థలుా పడుతున్నారు.
కన్ను పొడుచుకున్నా 
కానరాని ఆశాదీపపు వెలుగు కోసం
ఆశగా చుాస్థుాన్న ప్రజలు.
కలత నింపిన "కరోనా" మహమ్మారి
ఏ ముాలనుండి తమని అక్రమిస్తుందో
అన్న భయంతో జనం "ముక్కు-
ముాసుకు మరీ కుార్చున్నారు ,
 ఇళ్ళ లో తలుపులు బిగించీ మరీ.
 అక్కడక్కడా అవసరాలకు సగం
 తెరచిన దుకాణాలు అరముాసిన 
 తలుపులతో బెదురు చుాపులు 
 చుాస్తుా వెల వెల బోతున్నాయి . ॥
ఖాఖీ కాపలాదారులు కనపడ్డవారిని
కనపడిన చోటే  కుళ్ళపొడుస్తున్నారు.
రవాణాలుా, రాకపోకలుా స్థంభింపోయాయి.
గుడి -గోపురాలు ముాత పడ్డాయి.
గ్రాసం లెేని పసువులు, గుాడు లేని -
బతుకులుా ,కుక్క చావు ఛస్తున్నాయి.
టివిల్లో వినిపించేమాట..."
మరి కొంచం రోజులు "లాక్ ఔట్",
లో ఉండమని...సద్దుకోవాలని...
మొబైల్ తీస్తే చదివే విషయాలు ,
కధ, కవిత , అన్నీ "లాక్ ఔట్" గురించే.


 






No comments:

Post a Comment