శీర్షిక:
శ్రీ గిడుగు రామమూర్తి
-------------------------
"సస్యశ్యామల దేశం మన ఈ భారతదేశంలో" శ్రీకాకుళం ఉత్తరాన గల పర్వతాలపేట గ్రామంలో "వీర్రాజు వెంకమ్మ" దంపతుల ముద్దుబిడ్డగా జనియించిన మహనీయుడు మన శ్రీ "గిడుగు వేంకట రామమూర్తి పంతులు"
కార్యశూరుడై కలం పట్టి, తెలుగు ప్రజల కోసం భాషోద్యమాకారునిగా ధ్వజమెత్తి సమాజానికి యెనలేని సేవలు చేసి ,
తెలుగు వ్యవహారిక భాషకు
పితామహుడై,
తెలుగు వచనాన్ని ప్రజల వాడుక
భాషలోకి తెచ్చి,
నిత్య వ్యవహార భాషలో ఉన్న
అందాన్నీ, వీలునూ గొప్పగా తెలియ పరచిన బహుముఖ ప్రజ్ఞాశాలి మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"
గిరిజనుల అందుబాటుకు సవర భాషను రూపొందించి
సవర భాషలో వ్యాకరణాన్ని, సవర ఇంగ్లీష్ కోశాన్ని నిర్మించి
"ముండా ఉప కుటుంబ భాషను"
శాస్త్రీయంగా పరిశీలించిన మొట్టమొదటి స్థానంలో నిలిచిన ఘనుడు మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"
విస్తృతమైన తెలుగు భాషా రచనలతో అవగాహన పెంచి ఆధునిక ఆంధ్ర భాషా సంస్కరణకై తోటి సహోధ్యాయులు "గురజాడ, జే ఏ యేట్స్, శ్రీనివాస్ అయ్యంగార్" వీరి సమిష్టి ఆలోచనా సహకారంతో తెలుగుభాషా ఉద్యమోద్యుతి స్ఫూర్తిని పట్టుదలతో సాధించి వ్యవహారిక భాషా ఉద్యమాన్ని ఆరంభించి వ్యవహారిక భాషలో మార్చిన ఘనత సాధించాడు మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"
భారతీయుల పుణ్యము పండగా విద్యా ప్రాముఖ్యతకై కృషి నొనరించి, తెలుగు పత్రిక రచించి, రావ్ బహదూర్ వంటి
గొప్ప బిరుదులను పొందిన చిర స్మరణీయుడు మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"
ఆదర్శ దృక్పథం గల కార్యదక్షుడిగా దేశాభివృద్ధి కై శ్రమించి, గ్రంథ కావ్యాల భాష గ్రాంథిక ప్రాసని పాఠ్యాంశంగా నిత్య వాడుక భాషగా మార్చి, తెలుగు భాష పురోగమనానికి మార్గాన్ని చూపి, విద్యాభివృద్ధి అభ్యున్నతికై వినూత్న విద్యా కమలంగా వికసించి, ఆంధ్రులకు ఆరాధ్యుడై శిఖరాగ్ర మెక్కాడు మన శ్రీ "గిడుగు రామమూర్తి పంతులు"
తెలుగు జాతి గర్వపడేలా తన దేశభక్తిని చాటి, అభ్యుదయాన్ని ప్రసాదించి తెలుగు కీర్తిని నలుమూలలా పతాకంలా ఎగురవేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన జాతి రత్నం మన శ్రీ "గిడుగు వెంకట రామమూర్తి పంతులు" వారిని స్మరించుకుందాం!
అడుగు జాడల్లో నడుద్దాం!
దీక్షతో ముందుకు సాగుదాం!!
*-----------------------------------*
లక్ష్మీ వేణుగోపాల్
పుణె (మహారాష్ట్ర)
7709227773
No comments:
Post a Comment