[4/14, 18:36] iswarimurthy: నమస్కారమండి. ఎలా ఉన్నారు...?
చిన్న సందేహం. పద్యం రాసినపుడు చివరలో అప్పుడప్పుడు ఒక గురువు మిగిలిపోతే పనికి వస్తుందా. (ముాడు గుర్తులు ఒక గణం కదా....అలా కాకుండా ఒక్కటే గుర్తుతో ఉంటే.....)
[4/15, 10:10] Tyagarajugaru ponangi: అన్ని గణాలూ సరిపోవాలి.
ఒకవేళ గణాలు సరిపోక పోయినా, ఆ రచనలో మంచి భావం, శబ్దసౌందర్యం ఉంటే, దాన్ని అలాగే ఉంచేసి, పద్యం అనకుండా కవిత అనవచ్చు్
[4/15, 11:01] iswarimurthy: గణాల లో lu , ul , u ...ఇలా కొన్ని ఉన్నాయికదా ..అవి ఏ పద్య పాదాలకు సరిపోతాయి. మనం శ్లోకాలు చదువుతాం కదా....అవి ఏ గణాల నుపయొాగించి రాస్తారు. వాటి పద్ధతి వేరేగా ఉందా....ప్లీజ్ శ్రమ అనుకోకుండా చెప్పరుా..
[4/15, 11:34] Tyagarajugaru ponangi: 1U ని లగము లేదా వగణము అంటారు. ఉదాహరణకు ఇది ఉత్పలమాలలో చివరన వస్తుంది.
UI ని గలము లేదా హగణము అంటారు. ఇది సూరఱయ గణాలలో ఒకటి. ఇది ఆటవెలది, తేటగీతి, సీస &ద్విపద లో వస్తుంది.
UU ని గగము అంటారు. ఇది కందపద్యంలో వస్తుంది.
శ్లోకాలకు వృత్త ఛందస్సులు ఎక్కువగా ఉంటాయి.
వృత్త ఛందస్సు కానిది ఒక ఛందస్సు అనుష్టుప్. ఇది భగవద్గీత లో ఎక్కువగా కనిపిస్తుంది.
No comments:
Post a Comment