రెండు , నాలుగు పాదాల లో "నాల్గవ గణం మొదటి అక్షరం " యతి కుదరాలి. ఆరవ గణం తప్పని సరిగా "నలము" గానీ "జగణం" గాని రావాలి. ప్రాస యతి చెల్లదు.
పద్య పాదం మొదలు దీర్ఘంతో మొదలైతే నాలుగు పాదాలుా దీర్ఘంతోనుా , హ్రస్వం తో మొదలైతే హ్రస్వం తోనే ఉండాలి. 8 వ గణం చవర గురువుతోనే పుార్తి కావాలి .అంటే గ గ ముగానీ సగణము గానీ మాత్రమే రావాలి.( 2 వ పాదం చివర , 4వ పాదం చివర లో ).
(సుసర్ల వేంకట సన్యాసిరావు గారి సష్టి పుార్తి సందర్భం గా రాసిన కంద పద్యములు.)
దీవెనల----
కంద పద్యాక్షతలు.
-------------------------
---------------------
1.పద్యం
UII UII UII
వెన్నెల పందిరి నీడను
UII IIU IIII UII IIU
కన్నులు మిరుమి ట్లుగొలుపు కాంతుల వడిలో
UII UU UII
అన్నయ సన్యా సయ్యదె
UII IIU IUI UII IIU
మన్నిక వదిన మ్మగుాడె మంగళ మలరన్------
---------------------
2.పద్యం.
IIII llll Ull
రజసపు I గుణములు I కల్గిన-
IIII UII IUI IUI IIU
సుజనుడు I వేంకట I సుసర్ల I సుజన్మ I దినమున్
IIII UII UII
సజవుగ I నింటను I జేసిరి
IIII UII IUI UII UU
నిజపరి వారము లువేడ్క - నిండగు రీతిన్ ॥
----------------------------------------
3.. పద్యం.
IIII IIII UII
సదమల హ్రుదయము తోడను
IIII UU IUI UU IIU
సతతము సన్మా ర్గమెంచి సంసా రమునన్
IIII UII IIU
జతనము తోడను తనదౌ
IIII IIU IUI UII IIU
పథమున సుఖసా రమెల్ల పంచుచు నిలిచెన్ ॥
-------------------
4. పద్యం.
UII UII UII
ఆటల పాటల దేలుచు
UII UII IUI IIU IIU
మాటల తేనెల నుపంచి , మసలుచు మహిలో
UII UII UII
ధీటుగ వేంకట వంద్యుడు
UII IIII IUI UII IIU
మేటిగ నరువది సుయేండ్లు మేలుగ మనియెన్॥
-----------------------------
5. పద్యం.
IIII IIU IIU
శశికిర ణపుకాం తులలో
IIU IIU IIII IIU IIU
యశమం దుచుబం ధు,జనులు,యఖులం దరితో,
IIII UII UII
మసలుచు వచ్చిన వారల
IIII UII IUI IIII IIU
కుశలపు దీవెన లదేలె కులమున గణుడై ॥
------------------------------
6.పద్యం.
IIII UII UII
విజయము లిచ్చెడు లక్ష్మియె
IIU IIU IUI IIU IIU
సజవుగ గ్రుహసీ మనేలు సగుణీ మణియై
IIII III UII
గజగమ నిసుఖ కారిణి
IIII UII IUI UII IIU
నిజసతి యైసర సనుండ నిండెను సుఖముల్॥
----------------------------------
7. పద్యం.
UII IIU UII
మానము అవమా నంబుల
UII UII IIII UII UU
ధ్యానము నెంచక నుమసలె న్యాయము తోడన్
UII IIU UII
పుానిక బాధ్యత లేలుచు
UII UII IUI UII IIU
మానస బంధము లనేలె మంచిగ మనుచున్
------------------------
8. పద్యం.
UII UII UII
పిల్లలు పౌత్రుల తోడను
IIU IIII IUI UII IIU
చల్లగ సుఖపయ నమేలు జన్మమె గురుతౌ
UII IIII UII
కొల్లగ పెరిగిన వంశపు
UII UII IUI UII IIU
వెల్లువ జల్లుల వరాల వేడ్కల మునిగెన్ ॥
----------
9. పద్యం.
IIU UII UII
శతమా నంభవ తీ,శుభ
IIU UII IUI UII UU
శతమా నంభవ తినీకు సద్గుణ ధామా
IIII UII UII
హితములు కాగల వెన్నియొ
IIII UII IUI IIII UU
సతతము నీపరి జనాలు శుభముల నేలన్॥
---------
కంద పద్య రచన,
శ్రీమతి , పుల్లాభట్ల-
జగదీశ్వరీముార్తి.
---------------------
తే:గీ:
ప్రతీ పాదంలో ఒక సుార్య గణం , రెండు ఇంద్ర గణాలు ,
రెండు సుార్య గణాలు ఉండాలి.
యతి : నాల్గవ గణం మొదటి అక్షరం.
1. పద్యం.
UI UII UUI III UI
ఇంటి వేడుక, తీయన్ని ఋచులు పండ
UI UII IIIU UI UI
వేంక టేశుడు విజయతో వేడ్క గుాడి
III UII UII UI UI
కదలి వచ్చెను కన్నుల కాంతు లీన
UI UIU IUI UI III
షష్టి పుార్తినా డు,పెండ్లి శోభ లలర ॥
-----------------
2.పద్యం.
తే:గీ:
UI UIU IUI UI UI
విందు భోజన మ్ము ,మెచ్చు వంట కమ్ము
Ui IIIU IUI UI UI
దండి జనులగుా డిప్రీతి నార గించి
UI UII IUI UI III
మెండు సంతస ముతోడ మెచ్చు కొనుచు
UI IIII IUI III UI
పంచె బహుమతు లుచాల ముదము తోడ ॥
---------------
ఆటవెలది: 4..పాదాల లో
ముాడు సుార్య గణాలు , రెండు ఇంద్ర గణాలు ,
ఐదు సుార్య గణాలు ఉంటాయి.
మొదటి గణం మొదటి అక్షరానికి
నాల్గవ గణం మొదటి అక్షరం యతి కుదరాలి.
1.పద్యం.
UI UI UI IIIU IIUI
అత్త మామ లందు అలరుగౌ రవముంచి
UI UI UI UI III
సార శుద్ధి తోడ సేవ లిడుచు
UI UI UI UIU UIII
కోడ లైన స్వాతి, కుాతుర ల్లేమసలి
UI UI UI III III
పుట్టి నింటి పేరు పుడమి నిలిపె ॥
-------------------------
2. పద్యం.
ఆ:వె:
UI UI UI UIU IIUI
షష్టి పుార్తి నాడు సంతస మ్మదెనిండ
UI UI UI UI UI
ఈశ్వ రమ్మ తానె ఇచ్ఛ తోడ
III UI UI IIIU UII
యిడెను మంగ ళాల నలరుఆ శీస్సులుా
UI UI UI III III
వంద నాలు జేసి వరుస గొనుమ ॥
------------------------------
రచన , శ్రీమతి -
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్.
8097622021
No comments:
Post a Comment