Saturday, June 6, 2020

వందేళ్ల చరిత్రకు నిలయం . ఉస్మానియా విశ్వ విద్యాలయం.

  శ్రీ వాణి ,  విరివిగా  ప్రసాదించిన
  విద్యా సంపదకు నెలవైన  ఆలయం,
  వంద వత్సరాల చరిత్ర కల్గిన-
  "ఉస్మానియా విశ్వ విద్యాలయం."
" ఉర్దుా భాష" మాధ్యమంగా నడచే
  ఈ విద్యాలయం, స్వాతంత్ర్యానంతరం
       ఆంగ్ల భాషా ప్రాధాన్యతతో-
   వెల్లివిరిసిన అందాల భాషా తోరణం  .
తెలంగాణా రాష్ట్రానికి వన్నెతెచ్చిన
కళా వైభవం తో పాటు , ఎందరో
శాస్త్రవేత్తను, వైద్యులనుా,
న్యాయవాదులనుా, ఇంజనీర్ల  వంటి
ఎంతమందో  విద్యావేత్తలను  మనకందించిన
మహోన్నత " మాణిక్య మరకతం."
"హైదరాబాద్" లో "అబిడ్స్" అందాలకు 
తుది మెరుపుగా  నిలచిన,
శోభాయమాన  "సుందర  మకుటం."
మన తెలుగు నాట రుాపొందింపబడి,
మానవాళి విద్యోన్నతికి శ్రీకారం చుట్టి-
అద్భుతమైన " విద్యలకు ఔపోశన" పట్టిన
అజరామర "కీర్తి కిరీట శిఖరం." 
ఎన్నో "చరిత్రల పుటలకు" నిలయమైన
అతి పెద్ద "గ్రంధాలయంతో " రాజిల్లుతుా,
విజ్ఞానాన్ని పంచుతున్న, "జ్ఞాన కళా మందిరం".
ధక్షిణాది రాష్ట్రాల లో, అత్యున్నత స్థాయిలో
నిలచిన మొట్ట మొదటి "విశ్వ-విద్యాలయం".
అన్ని సామాజిక వర్గాలకు ,
అందుబాటులోనుండే విద్యలకు
ఆదిముాలమైన" ఆదర్శ కళా మందిరం".
విశిష్ట భాషా బోధనా మాధ్యమాల
అంతులేని  సంపదల "జ్ఞాన విద్యా భాండారం."
  ఉన్నత విద్యా ప్రాప్తి నిచ్చే
  అత్యుత్తమ "అంగ్లమాధ్యమాలంకృత"
                "అక్షరాల తోరణం"
  హైదరాబాదు నగర ప్రజా,
   ప్రతినిధుల"కీర్తి కిరీటం".
అద్యక్షులు" శ్రీ  రాయప్రొిలు సుబ్బారావుగారి"
కృషి  బీజా ఫల వరం ,  మన
" తెలుగు"  భాష శాఖా విస్థీర్ణం.
స్నాతకోత్తర విద్యలతో  పాటు,
  తెలుగులో  కుాడా పి.హెచ్ డి. పట్టాలను 
  అందించే " ఉన్నతవిద్యా  విధానాల ఖని."
" ఐదు నక్షత్రాల " విశ్వ విద్యాలయంగా -
అన్ని రాష్టాల లో  పేరొందిన " ఘన కీర్తి  రాజం".
  ఎన్నో భిన్న మతాల,  సంబంధిత అత్యుత్తమ 
         "కళా నిధుల " పోషణకు నిలయం.
                     ఏడవ నిజాం ఐన
  " ఫత్ జంగ్ మీర్ ఉస్మాన్ ఆలీఖాన్  అసఫ్ జా "
   అనుమతి తో 1918 లో  హైదరాబాదు లో
"ఐదు నక్షత్రాల "  ఘన కీర్తి తో రాజిల్లుతున్న
           " అత్యుత్తమ   విద్యాలయం "'
          "ఉస్మానియా విశ్వ విద్యాలయం."
          అన్నింటికీ మించి 1965 నుండి
         " వందేమాతరం ఉద్యమ" స్ఫుార్తితో
          " ప్రత్యేక తెలంగాణా ఉద్యమ "
     పోరాటం సాగిస్తుా నేటి "మన తెలంగాణా"ను
         సాధించిన ఘనతకు ఉస్మానియా విద్యార్ధుల
              పాత్ర  ముఖ్య భుామిక కావడం '
              చరత్ర లో  లిఖింపబడ్డ"  మరో
                    " చారిత్రాత్మిక ఘట్టం".
               హైదరాబాదు తార్ నాకా వద్ద
                 2400 ఎకరాల విస్థీర్ణంలో ,ఏర్పడ్డ
             " ఉస్మానియా విశ్వ విద్యాలయా కేంపస్"
          హైదరాబాదు నగరానికి మకుటాయమానంగా
               చెప్పబడుతుా అందరి మన్ననలుా                
                              అందుకుంటోంది.
               సామాజిక, సాహత్య, రాజకీయాది ,
               కళా రంగాల లో నిష్ణాతులైన వారికి
               "గౌరవ డాక్టరేట్" పట్టాల, సన్మాన
         సమాహార సుమ కుంజమై విద్యాభిలాషులకు 
                     స్ఫుార్తి దాయకమై నిలిచే
                    నిత్య నుాతన  నిర్మలావని.
                   " బంగారు తెలంగాణా,
                      " భవితవ్యామని"
            "ఉస్మానియా విశ్వ విద్యాలయాఖని"    
            -------------------------------------------------
                   ----------------------------------   
              
రచన ,శ్రీమతి
పి. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  ( మహరాష్ట్ర )
iswarimurthy@gmail.com.
8097622021.
----------------------------------------

హామీ పత్రం.
------------------
ఈ కవిత దేనికి నీ , అనువాదం కాదని,
ఎచ్చటనుా, ప్రచురితం కాలేదని,
ఇది, నా స్వీయ రచనేననీ ,
ఇందు ముాలముగా తెలియజేయుచున్నాను.
పి. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
---------------------------------

20 లెైన్లుగా కుదించి రాసిన కవిత.

OU (ఉస్మానియా యుానివర్సిటీ).వారి 500 , 

కవితా సంకలనం కోసం రాసి పంపినది. 

--------+--------------------------------------------

శీర్షిక .

వందేళ్ళ ఉస్మానియా

శ్రీ వాణి ,  విరివిగా  ప్రసాదించిన  విద్యా సంపదకు నెలవైన  ఆలయం, వంద వత్సరాల చరిత్ర కల్గిన-
          "ఉస్మానియా విశ్వ విద్యాలయం."
" ఉర్దుా భాష" మాధ్యమంగా నడచే ఈ విద్యాలయం, స్వాతంత్ర్యానంతరం , ఆంగ్ల భాషా ప్రాధాన్యతతో-
         "వెల్లివిరిసిన అందాల భాషా తోరణం  .
మానవాళి విద్యోన్నతికి శ్రీకారం చుట్టి-అద్భుతమైన " విద్యలకు ఔపోశన" పట్టిన  అజరామర
                      "కీర్తి కిరీట శిఖరం." 
ఎన్నో "చరిత్రల పుటలకు" నిలయమైన
అతి పెద్ద "గ్రంధాలయంతో " రాజిల్లుతుా,
విజ్ఞానాన్ని పంచుతున్న, "జ్ఞాన కళా మందిరం". అన్నింటికీ మించి 1965 నుండి" వందేమాతరం ఉద్యమ" స్ఫుార్తితో"  "ప్రత్యేక తెలంగాణా
  ఉద్య పోరాటం" సాగిస్తుా నేటి "మన తెలంగాణా"ను
    సాధించిన ఘనతకు ఉస్మానియా విద్యార్ధుల
పాత్ర , ముఖ్య భుామిక కావడం 'చరత్ర లో  లిఖింపబడ్డ"  మరో  చారిత్రాత్మిక ఘట్టం".
సామాజిక, సాహత్య, రాజకీయాది ,కళా రంగాల లో నిష్ణాతులైన వారిక  "గౌరవ డాక్టరేట్" పట్టాల, సన్మాన
సమాహారమై విద్యాభిలాషులకు,  స్ఫుార్తి దాయకమై నిలిచే నిత్య నుాతన  నిర్మలావని.
          "ఉస్మానియా విశ్వ విద్యాలయ ఖని"    
            -------------------------------------------------
                   ----------------------------------   
              
రచన ,శ్రీమతి
పి. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్  ( మహరాష్ట్ర )
iswarimurthy@gmail.com.
8097622021.
----------------------------------------

హామీ పత్రం.
------------------
ఈ కవిత దేనికి నీ , అనువాదం కాదని,
ఎచ్చటనుా, ప్రచురితం కాలేదని,
ఇది, నా స్వీయ రచనేననీ ,
ఇందు ముాలముగా తెలియజేయుచున్నాను.
పి. జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ (మహరాష్ట్ర ).
---------------------------------



                  
              
        
         
         
          ------------------------------------------------

No comments:

Post a Comment