Saturday, June 20, 2020

నిశ్శబ్దంగా..( బాబు రాసిన కవిత ).

నిశ్శబ్దంగా ....

రోజూ లాగే ఆవేశం నిశ్శబ్ధంగా కదిలిపోయింది.
మనిషి   మస్థిష్కంలో,  మంది గుండెల్లో 
గుబులు పుట్టించే ఆక్రోశాల నిశ్శబ్ధం.
బతకలేక ఛావలేక భరించలేని 
మధ్యతరగతి భాధల్లోంచి పుట్ఞిన నిశ్శబ్దం.
 మొహం మీద చిరునవ్వుల మాస్కుల వాతావరణంలో 
రిపబ్లిక్ డేలు,  స్వాతంత్ర దినోత్సవాలు 
యధాతధంగా జరిగి పోతాయి.
కరన్సీ  కట్టలకి అత్మాభిమానాన్ని 
తాకట్టు పెట్టినవాళ్ళు
కులాధిపత్యానికి మానిషితనాన్ని
మంటకలిపిన వాళ్ళు ..
మన కలల్ని కాల్చేసి ఆశల్ని చిదిమేసిన వాళ్ళు
త్రిరంగ పతాకాన్ని  ఆవిష్కరిస్తారు. 
సుఫలాం....సుజలాం.. మలయజ శీతలాం
సశ్యశ్యామలాం......మాతరం...ఆత్మవంచన.
స్వార్ధాన్ని   ఖర్మసిధ్ధాంతానికి ముడిపెట్టి
ఆవేశాన్ని అవసరాలకి అమ్మేసి
ఆదర్శాన్ని కాళ్ళకింద తొక్కేసి..
ఇలాగే  చూస్తూ..భరిస్తూ.....నిశ్శబ్ధం.
కుంభకోణాలు, కరన్సీ రద్దులు
జిఎస్టీ ఆమొాదాలు అన్నీ యధావిధిగా జరిగిపోతాయి.
రోజూ లాగే ఆవేశం నిశ్శబ్ధంగా కదిలిపోతుంది.
ఆఫీసు క్యాంటీన్ లోను, కాఫీ షాపుల్లోను  వాళ్ళ అక్రమాలగురించి, 
తమకు జరిగిన అన్యాయాల గురించి చర్చలు జరిగిపోతుంటాయి.
కాని ఎన్నికలలొ మాత్రం షరామామ్మూలే.
రోజూ లాగే ఆవేశం నిశ్శబ్ధంగా కదిలిపోతుంది.
                                  ----రమణమూర్తి ---

No comments:

Post a Comment