డియర్ ఫ్రెండ్స్,
అవసరమైన పుస్తకాలు, సులుభంగా అందుబాటులో ఉంచడంలో భాగంtగా, 30 వ తేది జూన్ నాటికి, మొత్తం 361 పుస్తకాలను సేకరించాము (అరుదైన నవలలు, కథలు, కవిత్వం, సైన్స్, విద్య, తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, రాజకీయాలు మొదలైనవి). జూన్ నెలలో 67 పుస్తకాలు చేరాయి. ప్రతినెల కొత్తగా చేర్చిన పుస్తకాల పేర్లను మాత్రం లిస్ట్ లో ఎరుపు రంగులో సూచిస్తున్నాము. ప్రతి నెల కొత్తగా సమీకరించిన 40 - 50 ఈ - పుస్తకాలు క్రమం తప్పకుండా షేర్ చేస్తూ వస్తున్నాము. ఎక్కువ భాగం పుస్తకాలను మంచిపుస్తకం గ్రూప్స్ సౌజన్యంతో సేకరించాము.
ప్రగతిశీల సాహిత్యానికి సంబంధించిన ఈ-పుస్తకాలను ఎంపికచేసుకోవడానికి, వేలల్లో పుస్తకాలను చూస్తూ వచ్చాము. వీటిని మొత్తం 6 కేటగిరిలుగా చేశాము. తెలుగులో ఈ-పుస్తకాలకు సంబంధించిన మంచి సోర్స్ లో భగత్ సింగ్ లైబ్రరి ఒకటవుతుందని చెప్పవచ్చు. చిన్నపాటి ఈ ప్రయత్నానికి, మిత్రుల నుండి అద్బుతమైన ప్రోత్సాహం రావడం సంతోషమైన విషయం.
ప్రతి నెల డైరెక్ట్ గా 50 - 60 మంది మిత్రులకు షేర్ చేయడం కొంత సమయం తీసుకుంటుంది. గతంలో చెప్పిన విధంగా, ఈ-పుస్తకాలను షేర్ చేయడానికి భగత్ సింగ్ లైబ్రరి పేరిట వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నాను. దీనివల్ల కొంత శ్రమ తగ్గడమే కాదు, మిత్రులు ఈ-పుస్తకాలు పంపించడానికి, తగిన సలహాలను అందచేస్తూ, ఈ ప్రయత్నాన్ని మరింత మెరుగుపరుచడానికి అవకాశం కలుగుతుంది. దయచేసి ఈ గ్రూప్ లో పుస్తకాలకు సబంధించిన అవసరమైన విషయాలను మాత్రమే షేర్ చేయగలరు.
లైబ్రరికి సంబంధించి, కెటగిరీలు చేయడంలో గాని, మరే ఇతరవాటిలో గాని ఉన్న పొరపాట్లను సరిదిద్ది సహకరించగలరని కోరుతున్నాను.
ఈ-పుస్తకాల లిస్ట్ ను చూసి, ఆ ప్రకారం, సంబంధిత లింక్ ను క్లిక్ చేసుకొని, పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకొని చదువగలరని కోరుతున్నాను.
డౌన్ లోడ్ చేసుకోవడం లో ఇబ్బందులుంటే తెలుపగలరు. ధన్యవాదాలు.
361 పుస్తకాలు కెటగిరీల ప్రకారం క్రమపద్దతిలో ఫోల్డర్స్ లో ఉన్నాయి.
నవలలు: 80
https://drive.google.com/drive/folders/1vB1KQLyCLKCm9pIrIENHaPBnsZWSVzWf?usp=sharing
కథలు – కవిత్వం: 58
https://drive.google.com/drive/folders/1jelZyGiT_ffz93z0x0Y53NlJzO_NXo7j?usp=sharing
చరిత్ర - తత్వశాస్త్రం: 41
https://drive.google.com/drive/folders/1QAM7E3PvRsII5Fv7sUP4a_cMzvDcnmBh?usp=sharing
విద్య – సైన్స్: 38
https://drive.google.com/drive/folders/1xUeP0L5l62Nr0lJcGPGVBVP3tdCTDlBA?usp=sharing
సామాజికం – ఆర్థికం – రాజకీయాలు: 59
https://drive.google.com/drive/folders/1_cW92aObs3f32Y2pPTaPynq__eB3GnHM?usp=sharing
ఇతరములు: 85
https://drive.google.com/drive/folders/1u2-ebltzDSn7BcLs2oSbuLzOQDRO8JhI?usp=sharing
కెటగిరీల వారిగా పుస్తకాల లిస్ట్
https://drive.google.com/file/d/19vMeyibRTlVEj5JJl3UUXFnLr75Y_Bv4/view?usp=sharing
venkat.kolagari@gmail.com 9951810345
No comments:
Post a Comment