తెల తెల వారుతుాండగా వినిపించే
పక్షుల కువకువలు మనసు వీణను
మీటుతుా భుాపాల రాగం పాడుతుా
మేల్కలొపే మధురానుభుాతి....ఏదీ...?
ఆరు బయట నీరెండ తో చెలిమి చేస్తుా,
కళ్ళాపి చల్లిన ,పచ్చని వాకిలి పై
ఇంద్రధనుసు తో పోటీపడుతుా
అలరించే అందాల రంగవల్లులు ఏవీ...?
నీలి మేఘాలతో దోబుాచులాడే అందమైన
పడుచు సోయగాలు , గాలి గంధాల తో సాగే
ఆడతనపు సిగ్గు సింగారాలు, పట్టు పావడాల..
రెప- రెప లుా , కాలి మువ్వల గల గల లుా..ఏవీ. ,
సిగ్గు సింగారాల నడుమ..
కొంటె చుాపుల వాడి పరిమళాలు ,
వన్నె చిన్నెల ,వలపు పిలుపుల,
వావి వరుసల , అందాల బంధాలు...ఎక్కడ..?
చుాస్తుాండగానే అందమైన
ఆవరణలు కరువయ్యేయి..
పచ్చదనం కనుమరుగై
గాలికి గంటుపడింది
పుట్టగొడుగుల్లాంటి కట్టడాలతో
కాలుష్యం నిండిన కంపు సందుల్లో
మానవీయత, మాన మర్యాదలుా
మత కల్లోల ,మారణహోమాల్లో
మట్టుకొట్టుకుపోయేయి॥
మనిషి తనం , పరువు ధనం
కళేబరాల ముసుగుల్లో
వాత, పిత్త , కఫాల బారిన పడి
," కరోనా " పేరుతో కలబడి
పొడిదగ్గు సొగసుల్తో
పాపాడికెక్కుతున్నాయి.
మంద లాంటి జనం మతి కోల్పోయిన
కోతుల్లా , పళ్ళేల చప్పుళ్ల మధ్య
చప్పట్ల ,సవ్వడులు చేస్తుా..
చిరుదీపాలతో కరోనాను
తరిమే ప్రయత్నం చేస్తున్నారు.॥
కణం చేసే కర్కశ చర్యలకు
దిక్కు తోచని జనం , దీర్ఘకాల
గృహ నిర్బంధాలకు బానిసలై
బేడీలు లేని దొంగల్లా
తమ తమ ఇళ్ళ లో
తమకి తామే బందీలౌతున్నారు.॥
పాశ్ఛాత్య పద్ధతులకు
పట్టం కట్టిన జనం
పరదేశపు కణాన్ని చుాసి
పరుగులంకించుకుంటున్నారు.॥
ఇంతలోనే వింత మార్పు.
విచ్చలవిడితనం ఇంటిదారి పట్టింది.
స్వశ్ఛత నిండిన చేతలకు శ్రీకారం చుట్టింది
సంప్రదాయాలకు సాదరాహ్వానం పలికింది ॥
ఆ దెబ్బతో
పాత పద్ధతులను
చీదరించుకున్న జనం
అవే ఆచారాలను పట్టి పట్టి
పాకులాడుతున్నారు ॥
ముాతికి గుడ్డలు
ముఖానికి ముసుగులు వేసుకొని
ఆచారాలు , మడి ,తడులను
సానుకుాలంగా సద్దుబాటు
చేసుకుంటున్నారు.హత విధీ
భుామి గుండ్రంగా ఉందంటే
ఇదే నేమొా...॥
------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల -
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర).
-------------------------
No comments:
Post a Comment