Thursday, July 16, 2020

అందమైన పాట

పల్లవి : 

రెప్పవెనుక స్వప్నం కరిగిందా ఈ ఉదయం
ఉప్పెనున్న సంద్రంలా ఒణికిందా నీ హృదయం

జాడేదని వెలుగు కొరకు వెతికిందా నయనం
నీడ కోసం ఎదురుచూసి అలిసిందా కాయIIరెప్ప వెనుక II
చరణం: 1
అందమైన పొదరిల్లుగా అల్లుకున్న పేగు బంధాలు
అందించెను హృదయానికి అంతులేని మధురాలు
పెంచుకున్న ప్రేమలు దూర౫మైన సమయాన
పంచుకున్న గురుతులు వీడలేని తరుణాన
బతుకే ఇక భారమై.. పెనుచీకటి తీరమై
II రెప్ప వెనుక II
చరణం: 2
మీగాథలు మీబోధలు దారి చూపు దీపాలు
నడయాడిన ఆనవాళ్లు జాతికి నిర్దేశాలు
అది మరిచిన లోకంలో ఒంటరైన జీవితాలు
చేదోడుగ నిలిచేటి చేయూత కానరాక
వృద్థ్యాపమే శాపమై.. కన్నీటి పయనమై
I రెప్ప వెనుక II
----------రచన:రామకృష్ణ స్పందన-----------
9494353828

No comments:

Post a Comment