శైవ బ్రాహ్మ్మణ కుటుంబీకుడైన" బాలసుభ్రహ్మణ్యం"
హాస్య నటులు "శ్రీ పద్మనాభంగారి" స్ఫుార్తి తో , గాయకునిగా సినీ రంగప్రవేశం చేసిన
"బాల గాయకుడు".
"మర్యాద రామన్న" చిత్రంతో , తొలిసారి మంచి-
గాయకునిగా మన్ననలందుకున్న" గాయక గణ్యుడు".
"కోదండపాణిగారి" ప్రోత్సాహంతో,మధుర గాయకునిగా
చిత్రసీమనేలిన మధుర "నేపధ్య గాన గంధర్వుడు" ॥
గౌరవ , భక్తి ,విశ్వాసాలు ఆయన ఊపిరి.
తను స్థపించిన ఆడియొా ల్యేబ్స్ కు,
"కోదండపాణి అడియొా లేబ్స్ " అన్న పేరుపెట్టి,
అయనపై తన కున్న గౌరవాభిమానాలను చాటుకొని
అభిమానాన్ని నిలుపుకున్న మహా "మనీషి".
తన పాటలలో , భావాభినయాలతో పాటు-
నవరసాలుా పలికించగల మేటి "నేపథ్యగాయకుడు."
బహు భాషాగాయకుడు, నటుడు ,
సంగీత దర్శకునిగా "29 నంది పురస్కారాలను",
"జాతీయ పురస్కారాలను " అందుకున్న
"అద్భుత గాయకుడు " .
బుల్లి తెరమీద "పాడుతా తీయగా" వంటి
కార్యక్రమాల లో అనేకమంది ,గాయనీ ,
గాయకులను, తెరకు పరిచయం చేసిన -
"నిష్కల్మష మానస -హృదయుడు."
"కస్తుారిబా కళాక్షేత్రం" లో , హరికథా పండితులైన
తన తండ్రి " సాంబముార్తి " గారి విగ్రహ ప్రతిష్ట-
చేసిన " పితృభక్తిపరాయణుడు."
శత వసంత భారతీయ చలనచిత్ర -
"ముార్తిమత్వ పురస్కార " గ్రహీత , .
ఆయనే , తన గాన మాధుర్యంతో ,
అందరి మనసులను ఆకట్టుకున్న మాన్యడు ,
" శ్రీ శ్రీ శ్రీ పండితారాద్యుల-
"బాలసుబ్రంమణ్యంగారు."
-----------------------------------
రచన , శ్రీమతి ' ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .(మహరాష్ట్ర )
8097622021
iswarimurthy@ gmail.com.
--------------------------------
Wednesday, July 15, 2020
శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారిపై కవిత.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment