Monday, July 27, 2020

ముత్యాల పుాసలు .అంశం ప్రగతికి మెట్లు చెట్లు నాట్లు.

*ప్రక్రియ :ముత్యాల పూసలు*
*అంశం: ప్రగతికి మెట్టు చెట్లు నాటు*
కవిత శీర్షిక నిన్నటి విత్తు నేటి మొక్క
పేరు: నెల్లుట్లసునీత
కలం పేరు: శ్రీరామ
ఊరు :ఖమ్మం
రాష్ట్రం: తెలంగాణ
చరవాణి సంఖ్య: 7989460657
"""""""""""""""""""""""""""""""""""""""""
1)
ఇంటికో చెట్టు పెట్టు
ప్రగతి బాటకు తొలిమెట్టు
పెట్టిన మొక్కలు సంరక్షించు
దాని ఫలాలను ఆనందంగా
భక్షించు పశుపక్ష్యాదులు సేదతీరు
పాలనకు విశ్రాంతినిచ్చు
ఇల్లాలికి వంటచెరుకు!!
🌲🌲🌲🌲🌲🌲🌲

2)
నిన్నటి విత్తు నేటి
మొక్క రేపటి వృక్షం
మర్నాడు మహా వృక్షాలు చెట్లు
పర్యావరణానికి ఫలాలను నీ
భావితరాలకు దాహార్తి తీర్చు
అందుకే మొక్కలు నాటు
మొక్కవోని సంకల్పాన్ని చా టు!!
🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

3)
పర్యావరణ పరిరక్షణ మనందరి
బాధ్యత మనిషికో చెట్టు
మనుగడ చెట్టు పెంచును
చెట్లు నాటితే హరితవనం
చెట్లు నాటితే క్షేమం
చెట్లు నరికితే ఎండలు
తరతరాలకు  ఆరని జ్యోతులు!!
🌱🌱🌱🌱🌱🌱🌱🌱

4)
చెట్లు నాటిన చేతులు
ముందుతరాలకు ఆపన్నహాస్తాలు
మొక్కల ప్రాణాధారం మానవాళికి
వృక్షాలే మనకు జీవాధారం!!
🌳🌳🌳🌳🌳🌳🌳🌳

5)
భూమాత ఒడిలో కళ్ళు
తెరిచి మెల్లగా ఎదుగుతున్న
చెట్ల ఉనికి మానవాళి
వాటికి ప్రాణం ఉంది చెట్లు
శ్వా సిస్తూన్న తులసి గా పూజింతురు
మొక్కను పెంచేవారికి ఆరోగ్యాన్ని
ఆయుష్షును పంచుతున్న హరితహారం!!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀

6)
మం చిచేడు ప్రకృతి సహజం
మహిరుహముల మనుగడే మానవ
బూరుహముల రక్షణ
జీవకోటికి జగద్రక్ష మనకు
మొక్కలే రక్ష సకల
ప్రాణకోటికి సురక్ష మొక్కలు
ప్రకృతి అంతా ప్రసాదం!!
🌿🌿🌿🌿🌿🌿🌿

7) గనులున్న   సిరులున్న ప్రకృతి
లేనిదే ప్రాణకోటి లేదు
మానవ జాతి ఉనికే
లేదు మేల్కొని కాపాడాలి
వృక్షజాతి మనకున్న ప్రకృతిలోని
ప్రగతి మనకు తరువులే
గురువులు త్యాగధనులు మొక్కలు!!
🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃🍃

8)
పిల్ల గాలులతో పిలిచి 
చల్లని నీడ ఇచ్చును
మొక్కలు పచ్చని ఆకుల
శుభ తోరణాలుగా కట్టెదురు
పండ్లను ఇచ్చు ప్రాణవాయువును
అందించు అద్భుతమైన ఔషధాలు
రుతు గతులను సవరించు!!
🎋🎋🎋🎋🎋🎋🎋🎋🎋

9)
అమ్మలా అందరికీ అన్నం
పెట్టును నాన్నల సేదతీర్చి
విశ్రాంతి ఇ చ్చేను బాల్యంలో
ఉయ్యాలగా నిద్రించే మంచం గా
ముసలి వయసులో కర్రలా
స్మశానానికి మోసే పాడేలా
ముఖ శుభ్రతకు పుల్లలు!!
🌿🌿🌿🌿🌿🌿🌿

10)
పచ్చదనాన్ని ఇచ్చే చెట్టు
ఆకృతి పచ్చని గొడుగు
కొమ్మల రెమ్మల అమ్మ
ఎండకు వానకు గాలికి
నిన్ను కాపాడును  జీవితానికి
బ్రతుకు తెరువు  చెట్లు
ఉనికి లేకుండా చేయకు!!
**********************
హామీ పత్రం: ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను దేనికి అనుకరణ దేనికి అనువాదం కాదు స్వీకరించ గలరని మనవి.

No comments:

Post a Comment