Monday, July 27, 2020

స్వర్గీయ శ్రీ రాజశేఖర్ రెడ్డి గారు.

అంశం.
స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డిగారు.
-----------------------------------------
వచన కవిత.
శీర్షిక.
విజయ పథ సాధకుడు.
పులివేందుల పులి.
-------------------------
కడపలో "లోక్ సభ" నియొాజక వర్గం నుంచి," నాలుగు"
సార్లు ఎన్నిక్రె , పార్లమెంట్ లో అడుగుపెట్టేరు.
పులివేందుల అసంబ్లీ నియాజక వర్గం నుండి" ఆరు" సార్లు,  ఎన్నికల లో విజయం సాధించేరు , .
రాష్ట్ర శాశనసభ ప్రతి పక్ష నేతగా,  ఆంధ్ర ప్రదేశ్  కాంగ్రెస్ కమిటీ అద్యక్షునిగా రెందు సార్లు పని చేసేరు.
గ్రామీణాభివృద్ధి , వైద్య  శాఖ, విద్యా శాఖలవంటి కీలక పదవుల్లో, మంత్రి పదవులు నిర్వహించేరు.
అటుపై  2003 లో  అయన  చేసిన పాదయాత్ర  ప్రజాదరణ మెండుగా పొంది , కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడింది.
ఆపై 2004 శాశనసభ ఎన్నికలానంతరం , 
"ముఖ్య మంత్రి" పీఠాన్ని అధిష్టించడమే గాక ,
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కొరకు
జలయజ్ఞానికి ప్రాధాన్యత ఇవ్వడమే కాక , నీటి పారుదల ప్రాజక్ట్ లను పుార్తి చేసి ప్రజల హృదయాలను చుారగొన్నారు.
లోక్ సభ ఎన్నికల లో, ముాడవ స్థానంలో విజయం సాధించేందుకు కృషి చేసి , "ఆంధ్ర ప్రదేష్"  ను, కాంగ్రెస్  అధిష్టానం ముందు సగర్వంగా నిలబెట్టిన  కార్య సాధకులు  శ్రీ రాజశేఖరు రెడ్డిగారు.

నిరంతర కార్య పోరాటక సాధకులైన ఈయన , 
సెప్టెంబర్ 2009 లో , చిత్తుార్ రచ్చబండ కార్యక్రమానికి వెళుతుా నల్లమల అడవుల మధ్యలో హెలీకాప్టర్ ప్రమాదానికి గురై, దుర్మరణం పాలేనప్పటికీ , ప్రజల హృదయాల లో "   రాజకీయాల్లో ముక్కు సుాటితనానికి ,  నిర్మొహమాట ధోరణికి , ప్రసిద్ధులై న  " "పులివేందుల పులి "  గా స్థిర స్థానాన్ని సంపాదించుకొని , చిరస్మరణీయులైన విజయ నాయకులు.......ప్రజాభిమాన పాత్రులు -----
          "   శ్రీ , శ్రీ  శ్రీ  రాజశేఖరు రెడ్డిగారు"
          ----------------------------------------------
రచన , శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021.
iswarimurthy@gmail.com

No comments:

Post a Comment