20-07-2020(సోమ వారం)
కవి:-నాయకంటి నరసింహ శర్మ(వనపర్తి)
💐💐💐💐💐💐
💐💐💐💐💐💐
(9 అంశాలు)-9 శతాక్షరీ లు రాయాల్సి వుండును
1పురస్కారం
💐నవరస శతాక్షరి
(1)శృంగారం(2)వీరం
(3)కరుణ(4)అద్భుతం
(5)హాస్యం(6)బయనకం
(7)బీభత్సం(8)రౌద్రం
(9)శాంతం
💐💐💐💐💐💐
***వివరాలకు****
--భేరి మధుసూదన్
కర్నూల్-518002
7674993500
6301932933
berimadhusudhan@gmail. com
💐
(BERI MADHUSUDHAN
google/Face Book)💐💐💐💐💐💐
శృంగారం--(1)
-------//-/-
కులుకులలోఅలరించగ
పలుకులతో హొయలొలుక
దరహాసములోన మరులు
మదనుని దర్పము చూపగ
నాయనుంగు ధవళరదన
అడుగుల సడిలో నడిచె
ఇందులాస్య బింబాధరి ,తను
నవలా మృగమదసౌరభి
ఎచటనుంచి ననుచేరెనొ
కలకాలం ననుతనియునొ
💐
డా.నాయకంటి నరసింహ శర్మ
################
కరుణరసము(2)
--------------/----//
బీదవాడొకడు , నడిరేయి
కారుచీకటిలో వర్షములో
తడిసిముద్దయి పోవగను
రెండురోజుల ఆకలి బాధతో
కప్పుకొనగా దుప్పటి లేక
ముదిమివయసులో భార్యతో
కనుచూపానక ,కీళ్ళరిగీ
చేతకాక ఎవరూ చూడక
చేతికొచ్చిన పిల్లలెవరూ
కనికరించని వృద్ధఘోష.
💐
డా.నాయకంటి నరసింహ శర్మ.
################
(3)
భీభత్సం
-----------------
చీము నెత్తురు అవనినిండ
మానవ కంకాళాలు పడగ
క్షతగాత్రులును మితిమీరి
పుడమి రక్త పటలమయ్యె
ఆర్తనాదాలు దీనరావాలు
రోదనలు హాహాకారములు
మాంస శ్లేష్మ మూత్రపురీషాలు
గండభేరుండాలు పీక్కుతినె
చీమలు నక్కలు మృగములు
ఎగబడి తినగసాగెను .
💐
డా.నాయకంటి నరసింహ శర్మ.
################
(4)
రౌద్రం
-----------
పండ్లు పటపట కొరికెను
రుసరుస గుడ్లురిమిచూసె
ఒంటికాలుపై లేచినిలిచె
ఎవడవురా నీవని తన
తొడగొట్టి కోరమీను వంటి
మీసము మెలివేయసాగె
గట్టిగ వికటాట్టహాసము
చేసి ముందుకురికి ,దుమికి
పిడికిలి బిగించి వడిగ
రయ్యిన పగవాడిని చంపి
💐
డా.నాయకంటి నరసింహ శర్మ .
################
(5)
వీరరసము
---------------
ప్రళయ మేఘ ఘన భీకర
రూపుడు ఫల్గునుడు వడిగ
కౌరవసేనతొ యుద్ధం సలిపె
అగ్నిచ్ఛటలు మింటికెగయ
పాశుపతాస్త్రమునుసంధించె
కురుసేన సంక్షుభితమయ్యె పాండవమధ్యమునిధాటికి
శతృసేన నలుదిక్కులకు
శరణార్థులై పరుగిడిరి
కిరీటి శౌర్యప్రతాపమున.
💐
డా.నాయకంటి నరసింహ శర్మ
################
(6)
హాస్యం
--------------
బానపొట్ట ,వంకర దంతాలు
దొడ్డి కాళ్ళు చీపిరికన్నులు
చప్పిడి ముక్కు సొట్ట పెదవి
చెవిటిమేళం నత్తిమేళపు
జోరీగలు ముసురు మోమును
చూచి పొట్ట చెక్కలగునట్లు
పడిపడి కడుపు పట్టుకు
నవ్వసాగెను నరుడొకడు.
సింగినాదం జీలకర్ర యను
సామెత మదిలో మెదలెను.
💐
డా.నాయకంటి నరసింహ శర్మ
################
(7)
శాంతరసము
------------------
చిత్తములో భగవచ్చింతన
సదా పరమేశ్వరుని ధ్యానం
యమనియమాలను పాటించి
పరులమేలు పరమార్థంగా
యోగసాధనే నియమముగా
నిశ్చల నిరాకార భక్తితో
పరోపకారచింతనగల్గి
సమభావం పరమావధిగా
పశుపక్ష్యాదులను ప్రేమిస్తూ
వసుధైక కుటుంబం సాధించు.
💐
డా.నాయకంటి నరసింహ శర్మ.
################
(8)
అద్భుత రసం
----------------//-
కలగంటిని నేనొకనాడు
ఆకాశంలో విహరిస్తున్నట్లు
కుప్పబోసిన పైసబిళ్ళలు
దోసిళ్ళతో నింపుకొన్నట్లు
ఎన్నితీసుకున్నా తరగని
నాణేలు అవి.పెద్ద భవనం
అందులో వందలాది గదులు
అది నాకు సంక్రమించినట్లు
రాజభవనమే నాదైనట్లు
అపూర్వమైన కలగన్నాను
💐
డా.నాయకంటి నరసింహ శర్మ.
################
(9)
భయానక రసం
------------------------
తాగిన వాడొకడు పిల్లలనూ
భార్యనూ చితకగొడ్తున్నాడు
కర్రతో ఇనుపరాడ్తో రక్తం
చిందునట్లు ,పిల్లలు భయంతో
తండ్రిని చూసి బెదరుచుంటే
భార్య ఎండుటాకులా వణుకు
తుంది గజగజ.అతనిని
చూస్తేనే గుండెలు గుభేలని
దెబ్బకి ఠారుమని చచ్చేలా
ఏ క్షణం లో ప్రాణం తీస్తాడని
💐
నవరస శతాక్షరి కవి
డా.నాయకంటి నరసింహ శర్మ.
చిరునామా:-
.డా.నాయకంటి నరసింహ శర్మ.
వనపర్తి,
వనపర్తి జిల్లా.
తెలంగాణ
వృత్తి అధ్యాపకుడు.
ఫోన్ 9441357400
భేరి💐సాహితి వేదిక
సభ్యత్వసంఖ్య:4-80
***వివరాలకు****
--భేరి మధుసూదన్
కర్నూల్-518002
7674993500
6301932933
berimadhusudhan@gmail. com
💐
(BERI MADHUSUDHAN
google/Face Book)💐💐💐💐💐💐
No comments:
Post a Comment