[7/22, 20:35] iswarimurthy:
సప్త వర్ణ శతాక్షరీ ప్రక్రియ.
రెండవ పురస్కార అంశములు.
-------------------------------------------
1.గురు శిష్యుల అనుబంధం.
----------------------------------------
చదువంటే నాకు చాలా భయం
ట్యుాషన్ లో గురువుల సహనం.
శిష్యుని పై, ఉండే మమకారం.
గురువు నాకై శ్రమించే కష్టం
పరీక్ష పాసవ్వాలన్న పంతం.
ఫష్ట్ క్లాస్ వచ్చిన సంబరం.
గురుాగారి కళ్ళలో ఆనందం.
ఇద్దరిదీ భావాతీతోద్వేగం .
గురుశిష్య బంధాలు అపుార్వం.
వారి పాదాల ముందు తలొంచా.॥
------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
2. చెల్లీ-తమ్ముళ్ళ ఆత్మీయత.
-----------------------------------------
నా పై ప్రేమ, చెల్లీ ,తమ్ముడికీ...
ఆట పాటల్లో నాకు తోడుగా..
చదువుా, సంధ్యా , నాతో పాటుగా
పెరిగేరు, నా తమ్మడుా , చెల్లీ.
పెరిగేకొద్దీ బంధం బలంగా..
వయసు వచ్చిన చెల్లి పెళ్ళి ,
ఉద్యోగం దొరికి, తమ్ముడెళ్ళి--
దుారమయ్యేయి , ప్రేమ బంధాలు.
పండగలప్పుడే కలయిక
మనసంతా ఆనందం నిండగా,॥
-----------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
3.స్నేహమే వరం.
------------------------
జామిట్రీ బాక్స్, నాది పోయింది.
ఎంతో వెతికా, దొరకలేదు.
నాన్నని అడగాలంటే భయం
హోమ్ వర్క్ ఎలా..?అన్న బెంగ.
భయంతో ఏడుపు ఆగలేదు.
నా ప్రియ సఖి వచ్చిందప్పుడే.
నా దుఃఖం చుాసి, తనుా ఏడ్చింది.
మరునాడు కొత్తది తెచ్చింది.
పోకెట్ మనీతో కొన్నానంది.
కష్టం లో వరం, స్నేహానుబంధం.
----------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
4.అమ్మ-నాన్నల ప్రేమ.
-------------------------------
అల్లరి- చిల్లరిగా, తిరిగా ,
చెడు స్నేహాలకి విలువిచ్చా.
నాన్న కోపంగా అరిచేవాడు.
నే, లక్ష్యపెట్టేవాడిని కాదు.
ఎక్సిడెంట్ తో మంచం పట్టేను.
రాత్రి-పగళ్ళ సేవలో అమ్మ..
మందులుా-పళ్ళతో వచ్చే నాన్న.
కంటికి రెప్పలా కాపాడేరు.
కోలుకొని, ఎరిగిన నిజం.
ప్రేమించేది అమ్మా, నాన్నే అని.
--------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
5.అత్త-మామలుా, తలిదండృల సామానులు.
-------------------------------*---------------------------
పుట్టింటి దైవాలు , అమ్మా-నాన్న.
మెట్టింటి దేముళ్ళు ,అత్తా - మామ .
వారందరుా నాకు సమానులే..।
ఎవరేదిచ్చినా నా కిష్టమే.
నేనెవరినీ బాధించలేను.
అమ్మిచ్చిన నగలు మెడలో..-
అత్తిచ్చిన గాజులు చేతికి ,
సారె మంచం , పడక గదిలో-
అత్త-మామల ఫొటో హాలులో,
అమర్చి , అందరినీ గెలిచా....॥
------------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
6.అక్క, అన్నల , మమకారం..
----------------------------------------
తల్లి లేని లోటు తీర్చే అక్క
తన సొంత బిడ్డనంటుా బావ
ఇద్దరి పెంపకం లో జీవితం
ముళ్ళ బాట కాని రహదారి.
దేనికీ లోటు లేని నిశ్ఛింత.
నిర్మల మైన , ప్రేమ కొండంత.
విద్యా, పదవుల్లో నా ఉన్నతి.
వారి అనందాలకు పెన్నిధి
ఎలా మరుస్తాను వారి ప్రేమ.
కొడుకు లేడన్న బాధ తీర్చి--
తీర్చుకుంటాను గా వారి ఋణం.॥
-------------------------------------------
రచన,శ్రీమతి,
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
7 ఒదినతో బంధం.
-----------------------------
ఉమ్మడి కుటుంబం కోడలమ్మ-
ఒదినమ్మే, ఇంటికి పెద్దమ్మ.
అందరం కలిసే ఉండేవారం.
బాధ్యత నిండిన పని భారం.
చక్కని చేతల సమ దృష్టి .
ఐకమత్యమే ఆమెకు తృప్తి.
సద్దుకుపోయే గుణం కలది.
సహనశీలత్వం ఆమె ఆస్థి.
కలతల్లేని కుటుంబం మాది.
ఒదినమ్మే అందుకు పునాది.
------------------------------------
రచన,శ్రీమతి,
పుల్లాభట్ల--
జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com.
----------------------------------------
హామీపత్రం.
ఈ శతాక్షరీ అంశములు నేను స్వయముగా రాసినవేననీ, ఇంత వరకు ఎక్కడకునుా పంపలేదని , ఇందు ముాలముగా తెలియజేయుచున్నాను.
ఇట్లు ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహరాష్ట్ర .
--------------------------------
[7/22, 21:36] శరాక్షరి భేరీ మధుసుాదన్ గారు: 🌹🌿🍁🍃🌹🌿🍁🍃🌹🌿🍁🍃
" శతాక్షరి "ప్రక్రియలో
20--07---2020 ( సోమ వారం)సోదరి శ్రీమతి
పుల్లాభట్ల జగదీశ్వరీ ముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
8097622021
iswarimurthy@gmail.com గారూ "స్వచ్ఛ ప్రేమిక--(93వకవయిత్రి)పురస్కారానికి ఎంపికయ్యారు
మరియు
22-07-2020(బుధవారం)సప్తవర్ణ శతాక్షరి ప్రక్రియ లో 7 ఆత్మీయ అంశాలు రచన గావించి
సోదరి శతాక్షరి కవయిత్రి
"'సప్తవర్ణ స్వచ్చ ఆత్మీయ ప్రేమైక"పురస్కారానికి ఎంపికయ్యారని గిఫ్ట్ ఆఫ్ గాడ్"సభ్యురాలు
శ్రీమతి అనుషాభేరిమధుసూదన్
తెలిపారు.
💐శతాక్షరి ప్రక్రియ రూపకర్త:శ్రీ భేరి మధుసూదన్(కర్నూలు)7674993500
berimadhusudhan @gmail. com
64 కళలు24 ఫ్రేమ్స్ వరల్డ్💐భేరి
భేరి💐సాహితి నిధి
భేరి💐సాహితి వేదిక
కర్నూలు-518002
ఆంధ్రప్రదేశ్, ఇండియా
🌹🌿🍁🍃🌹
భేరి💐 సాహితి వేదిక సభ్యత్వ సంఖ్య:93💐
🍃🌹🌿🍁🍃👌
22-07-2020
(PRESS NOTE)
No comments:
Post a Comment