సర్ ఆర్థర్ కాటన్ , బ్రిటిష్ సైనికాధికారి.
మొదటి బర్మా యుద్ధానంతరం
కాటన్ సర్ బిరుదాంకితుడయ్యాడు.
15 సంవత్సరాల వయసులోనే" మిలట్రీ క్యాడెట్" గా
చేరిన కాటన్ , ఈష్టిండియా కంపెనీ ఆర్టిలరీ లో
ఇంజనీరింగ్ శిక్షణ పొందేడు.
అనంతరం భారతదేశం వచ్చి, మద్రాసు లో ఉన్న
చెరువుల శాఖకు, ఇంజనీర్ గా నియమింపబడ్డాడు.
అదే సమయంలో , ఎప్పుడో వరదల కారణంగా , సగంలో అగిపోయిన ధవళేశ్వరం ఆనకట్ట పని కాటన్ కు అప్పచెప్పబడింది.
నీటిపారుదల ఇంజనీరుగా, తనకు అప్పచెప్పబడిన పనిని సమర్ధవంతంగా పుార్తిచేసి , ఉభయ గోదావరీ తీర వాసులకేకాక , చుట్టుపక్కల ఎన్నో గ్రామాలకు,
గోదావరి జలాలు లభించే విధంగా కాల్వలు తవ్వించీ
తద్వారా , ఎన్నో లక్షల ఎకరాలకు , గోదావరి జలాలు అందినట్టుగా చేసి, ""అపర భగీరధు"నిగా , ఆంధృలచేత కీర్తింపబడ్డాడు.
ఈయన స్మరణీయార్ధం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన" కాటన్ మ్యుాజియం" , లో కాటన్ చిత్రాల తోపాటు, ఆనకట్టకు సంబంధించిన వివరాలు,
ఉపయొాగించిన పనిముట్లు , తో పాటు, గుర్రంపై నున్న
కాటన్ దొర విగ్రహాన్ని ప్రతిషంచి తమ అభమానాన్ని చాటుకున్నారు.
" కాటన్ దొరగా "పేరొంది , వరదల కారణంగా "దుఃఖదాయిని" గా ఉన్న గోదావరిని "ప్రాణహిత"గా
మార్చి , ఉభయగోదావరీతీరవాసుల హృదయాల లోనేకాక, యావత్ ఆంధృల హృదయాల లో చిరస్మరణీయునిగా నిలిచిపోయిన ఘనుడు ,మన
" సర్ ఆర్థర్ కాటన్ దొర.
---------------------------------
రచన,
శ్రీమతి,
పుల్లాభట్ల, జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. (మహరాష్ట్ర ).
--------------------------------
ఈ కవిత సాహితీ పున్నమి విభాగం కోసం రాసిన ,
నా స్వీయరచన.
-------------------
No comments:
Post a Comment