శీర్షిక .
శాంతి దుాత.
-----------------
అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదంటారు.
అలాంటిదీ అడగకుండానే అన్నార్తుల
ఆకలి తీర్చిన అన్నపుార్ణ "మదర్ థెరీసా".
అవసరార్ధులకు, అనాధులకు, నిరాశ్రయుల
సేవలకేై ,తన జీవితాన్ని ధారపోసిన" ప్రేమమయి."
అల్లలాడుతున్న అంటురోగుల "అభయ హస్తం".
అభాగ్య జీవిత "ఆశాకిరణాల ఆనంద దీప్తి "
తన సేవా ధృక్పథాలకు "నోబెల్ శాంతి పురస్కారం"
తో పాటు భారత దేశ అత్యున్నత
పౌర పురస్కారమైన -"భారత రత్న"ను
అందుకున్న ఘన కీర్తి కిరీటి .
మంచి పనులకు , సేవానిరతికి , మార్గదర్శి.
జాతి మత భేధాలకు అతీతంగా , ప్రతి ఒక్కరికి
తన జీవిత చివరి దశ వరకు సేవలందించిన-
నిశ్వార్ధ నిరంతర సేవా స్ఫుార్తికి నిదర్శనం .
రోమన్ కేథలిక్ ఐన, " మన మదర్ థరీసా "
------------------------------------
రచన, శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
--------------------
No comments:
Post a Comment