శీర్షిక.
సాహిత్య స్ఫుార్తి.
చైతన్య ముార్తి.
--------------------
(వచన కవిత).
చిన్న తనంలోనే తండ్రికి దుారమై, అన్నగారైన
దాశరధి కృష్ణ మాచార్యుల సాంగత్యంలో పెరిగిన
దాశరధి రంగాచార్యులు , అభ్యుదయ, విప్లవ-
భావాలు సంతరించుకొని , ఉపాధ్యాయునుగా
పని చేస్తుానే , అలనాటి సమాజ అసమానతల
గుార్చి ప్రజలను చేతన్యపరచే రీతిలో ఉద్యమించేరు.
తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యొాధులైన, వీరు
తెలుగు కవులు. రచయితలు.
వీరి రచనల్లో ఆనాటి తెలంగాణ పోరాట-
స్థితిగతులు దారుణ బానిస పద్ధతులు
ప్రతిబింబిస్తుా ఉంటాయి.
శ్రీ రంగాచారిగారు "విశిష్ట సాహిత్య " రచనా కారులు.
ఈయన రాసిన నవల ల్లో "చిల్లరదేవుళ్ళు" నవల
సినీ చిత్రంగా రుాపొందబడి ఘన విజయాన్ని
సాధీంచడమే కాక అనెేక భాషల్లోకి అనువదింపబడి
నాటక రుాపంగా ప్రదర్శింపబడి, బహుళ ప్రాచుర్యం పొందింది.
వేదాలను తెలుగులోకి అనువదించి ,చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న "సాహిత్య చరిత్ర కారుడు"..
తెలంగాణ చారిత్రిక, సామాజిక , రాజకీయ ధృక్పధాలను "జీవనయానం " పేరుతో ఆత్మ కధగా
వెలువడి, సాహిత్యం పై చెరగని ముద్ర వేశాయి .
" మహాభారతం" గ్రంధాన్ని సులభ వచనం లో తెలుగులో రచించి అభినవ వ్యాసునుగా బిరుదు పొందేరు. ఇటువంటి ఎన్నో గ్రంధానువాదాలకు, వ్యాసాలకు, సంకలనాల సరళ రచనకు గాను ,
విశేష సత్కారాలను సన్మానాలను పొందిన
అభినవ సాహిత్య చైతన్య ముార్తి.
తెలంగాణ సాయుధ పోరాటం లో కీలక పాత్ర
పోషీంచిన ఉన్నత ఉపాధ్యాయులు.
"శ్రీదాశరధి రంగాచార్యులుగారు."
-------------------------------------
రచన,శ్రీమతి,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021
----------------------
No comments:
Post a Comment