Friday, September 4, 2020

మారుతున్న విద్యా విధానం. ఇష్టపది ప్రక్రియ లో

రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ .మహారాష్ట్ర .
8097622021.
--------------------
శీర్షిక.
మారుతున్న విద్యా విధానం.
 
----------------------------------------

తలిదండృల బాధ్యత        తనిగ పెంచుట వరకె.
మహిని మను బాటలో       మార్గదర్శి  గురువే  ॥
తరమంతరించినా             తరం కదలినా,అది---
గురువుల కే సాధ్యం           గురువే ఇల దైవం...॥

అంతర్జాతీయపు                అనేక పరిణామపు--
ప్రభావాల ఫలితం              ఫల యొాచన లోపం.
విద్యారంగాల్లో                   వివిధ ఒత్తిడులు-
నాణ్యత గల విద్యలు        నలిగేటి శాపాలు॥

విద్యావ్యవస్థలవి               వీధి బడిన వేళలు
గురు శిష్య బంధాలు          గుడ్డి దారి నేను లలు॥
 గుణు లైన గురువులకు      గౌర-విలువల లోపం.
గురు బాధ్యత క్షీణం            గుణ శిష్యుల లోపం ॥

భవిష్యత్ ప్రణాళికల            బాధ్యతల బరువుకును -
మొరటు తేరె గురువులు      మొాడువారె బతుకులు.
కార్పరేట్ విద్యల                  కాలుష్య  విధానం.
ధర , విలువ విజ్ఞానం   -         ధనానికి అమ్మకం   ॥
.
కొనుగోలు పత్రాల              కొందారులనేకం .
విద్యార్ధుల ప్రగతి               వీధిపాలైన వైనం॥
నేడు విద్యల విలువ         నిలువు దోపిడీ వల           
సర్వేపల్లి సాటి                  సరి రాని గురువు లిల ॥
--------------------------------------------------------------------

No comments:

Post a Comment