[9/3, 19:07] iswarimurthy: శీర్షిక.
మానవ జీవితం- మానవతా విలువలు.
(వచన కవిత.)
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
8097622021.
iswarimurthy@gmail.com.
-------------------------------------------
-------------------------------------------------------
రోజు రోజుకుా మారుతున్న సమాజ పరిస్థితులు.
మనుషుల మధ్య దుారమౌతున్న మమతానురాగాలు.
కలసి ఉంటే కలదు సుఖం అన్న నాటి మాటలు.
నీ దారి నీది , నాదారి నాది , అంటున్న నేటి రక్త సంబంధాలు.॥
అన్నీ ఉన్నా , ఏదో పోగొట్టుకున్న వెలితి హృదయాలు.
అందరుా ఉన్నా , ఒంటరి జీవిత పోరాటాలు.
మనిషి జీవితం డబ్బుకు దాసొిహం అంటోంది.
రోజు రోజుకుా పెరుగుతున్న లైంగిక దాడులు.॥
మరోవైపు కరోనా పీడితుల హా హా కారాలు.
మందులేని మహమ్మారికి చికిత్స పేరుతో
వేల రుాకల బిల్లుల వేధింపులు.
లాక్ డౌన్ బాధితుల నిరుద్యోగ సమస్యలు ,
బతుకు భారాల ఆత్మహత్యలు .॥
అమమ్మ, తాత నానమ్మల తో నిండుతున్న
వృద్ధాశ్రమాలు.
అక్రమాలకు నెలవైన అనాధ బాలల అశ్రమ అడ్డాలు.॥
నేను, నాది , అన్న భావాల వలలో చిక్కుకొన్న
ఒంటరి పోరాటపు, ఏహ్య భావాలతో నేటి మానవుడు...॥
ఎక్కడుంది నైతికత , ఎక్కడుంది ఆప్యాయత...
ఎలా ఉంటుంది మానవత్వం, ఎటువంటిది బంధం-॥
ఇవన్నీ ఎరుగని మార్గంలో నేటి భావి తరం.
వందే మాతరం...ఇవన్నీ భరిస్తున్న నీకు వందనం.॥
-----------------------------------------------------------------
[9/3, 19:10] iswarimurthy: "మానవ జీవితం మానవతా విలువలు" అనే ఈ కవిత , ఏ మాధ్యమునందునుా ప్రచురితం కాని నా స్వీయ రచన.
జగదీశ్వరీముార్తి.
No comments:
Post a Comment