15/10/2020.
అంశం
మానవత్వం.
-----------------
శీర్షిక.
"మరుగుజ్జు"
-----------------
రచన, శ్రీమతి ,
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్ . మహారాష్ట్ర .
8097622021
---------------------
అసహనంతో అటుా ఇటుా తిరుగుతున్నాను.
ఇంకా పనిలోకిరాని ఆదెమ్మను ఆడిపోసుకుంటుా..॥
అరగంట లేటుగా , ఆదెమ్మ అలసటతో
జ్వరంలో ఉన్న చంటిదాని మీద నున్న బెంగతో॥
చంటిదాన్ని గుడ్డ పరచి వేసింది నేలపై
అడిగింది పది రుాకలు చంటిదాని మందుకై॥
నాగాల లక్కల్లో నయాపైస రాదంటుా
కసుర్ల విసుర్ల తొనాదెమ్మను, తరిమేసా పొమ్మంటుా॥
కవి సమ్మేళన సన్మానం, లేటయ్యిందనుకుంటుా
మనవత్త్వం పై భాషణ చెప్పాలిగ అనుకుంటుా॥
అద్ధ ముందు నిల్చున్నా అలంకరణ కోసమై
అద్ధం లో నా రుాపమె అగుపించె వికారమై॥
అదిరి పడ్డ నా ముందు ,ఆదెమ్మే అందమై
ఎదిగిపోయె కనుల ముందె మానవత్త్వ శిఖరమై॥
అనాధ పిల్ల పై పుట్టెడు మమకారం నింపుకొని
ఖర్చు కై వెనుకాడని ,మమతలనే పంచుకొని ॥
కుాడు- గుడ్డ లేకున్న ,నిండు మనసు అదెమ్మది
పాచి పనుల జీతంలో , కొట్టి వేత లెక్క నాది॥
పెంచుకున్న చంటి బిడ్డ నెత్తుకున్న ఘనతామెది
పది రుాకలు ఇవ్వలేని హీన మైన మనసు నాది॥
చెప్పకనే చుాపించెను మానవత్వం విలువేమిటొ
కరగె నాలో కఠినత్త్వము కంటి నీటి ధారలతో .॥.
మరుగుజ్జై నిలచి నాను అమె ముందు తలవాల్చి
భాషణలకె పరిమితమౌ మాట లేటి కని తలచి॥.
"మీడియాల మొాజు లేలు,మాటలనే వీడమని
మనసుంటే ఇంటి నున్న పనివారికి సాయపడని --"॥
మనసు చెప్పి నట్టి మాట నాటుకుంది నా మదిలో
మేలుకుంది మరోమనిషి మానవత్వ రుాపముతో॥
చేతికందు రుాక లన్ని సంచిలోన వేసి నేను
ఆదెమ్మ ఇంటి వేపు కడుగు లేసి కదలినాను॥ .
చెప్ప లేని ఆనందం చేరువైన సంతోషం
శాంతి నిండు మనసిపుడొక ఆశయాల విహంగం.॥
-------------------------------------------------------------
హామీ...
శీర్షిక.
"మరుగుజ్జు"
.అనే ఈ కవిత,
ఏ మాధ్యమునందుా ప్రచురితం కాని-
నా స్వీయ రచన.
పుల్లాభట్ల జగదీశ్వరీముార్తి.
కల్యాణ్. మహారాష్ట్ర .
No comments:
Post a Comment